Nalugu Pindi | వారానికోసారి నలుగు పెట్టకుని స్నానం చేస్తే చర్మంపై ఉండే మృతకణాలు తొలిగిపోతాయి. నిజమే కానీ ఈ ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని హడావుడిగా ముగించకూడదు. చాలా నెమ్మదిగా, సున్నితంగా చేయాలి. అప్పుడే మృత కణాలు పూర్తిగా తొలిగిపోతాయి. అలా హడావుడిగా నలుగు పిండి పెట్టుకునే వారికి కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు ఆయర్వేద నిపుణులు.
చర్మం పొడిగా ఉన్నప్పుడు నలుగు(Nalugu Pindi) పెట్టుకోకూడదు. స్నానానికి అరగంట ముందు చక్కగా నూనె రాసుకుని, ఇరువై నిమిషాలయ్యాక తడిపొడిగా ఉన్న చర్మానికి నలుగు పిండి పెట్టుకుని రుద్దుకోవాలి. మెడ దగ్గర బరబరా రుద్దుకోకూడదు. చాలా నెమ్మదిగా మర్ధన చేయాలి. మెడ భాగం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి రెట్టింపు జాగ్రత్త అవసరం.
మృత కణాలు సులువుగా తొలిగిపోవాలంటే క్రమ పద్ధతిలో నలుగు పెట్టుకోవాలి. అంటే నలుగు రాసుకుని సవ్య, అపసవ్య దిశలో వేళ్ల చివర్లతో మర్థన చేయాలి. లేదంటే మార్కెట్లో లభిస్తున్న లూఫా(loofah) ఒకటి కొనుకోండి. ఇలా జాగ్రత్తలు పాటిస్తూ నలుగు పెట్టుకుంటే మృతకణాలు మటుమాయ మవుతాయి.

నలుగు అంటే ఏమిటి?
చర్మానికి అందం ఆరోగ్యం కాంతి కలగడం కోసం కొన్ని రకాల ఔషధ చూర్ణాలతో తయారైన పిండిని నువ్వుల నూనెతో లేక పాలతో లేక మంచినీటితో కలిపి గుజ్జులాగా తయారు చేస్తారు. అలా తయారైన పిండిని తల నుండి పాదాల వరకు లేపనం చేసి అది లోపలికింకేటట్టుగా రుద్దే పద్ధతినే నలుగు పెట్టడం అంటారు. నలుగు పెట్టి సాన్నం చేయడమనే పద్ధతి కొత్త విషయం కాదు. తరతరాలుగా మన భారతజాతికి అపూర్వ యౌవన సౌందర్యాలను కడదాకా అందించిన ప్రాచీన సంప్రదాయమే ఇది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!