Nallamothu Sridhar: నాకు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అని ఎవరైనా అడిగితే నేను మొదట చెప్పే సమాధానం మెడిటేషన్ చెయ్యమని అంటున్నారు నల్లమోతు శ్రీధర్ (Nallamothu Sridhar). ఆయన చెప్పిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నాకు మెడిటేషన్ Meditation, లో కూర్చోగానే ఎక్కడా లేని ఆలోచనలు వస్తున్నాయి. కళ్ళు మూసుకుంటే స్థిమితంగా ఉండలేకపోతున్నాను అని చాలా మంది అంటుంటారు. అయితే దీనికి ముందుగా మైండ్‌కి ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. అది కళ్లెదురు ఏదైనా చూడాలి. కళ్లు మూసుకుంటే దానికి తోచదు. కాబట్టి ఏదైనా ఆలోచించడానికి ట్రై చేస్తుంది.
ఎక్కడెక్కడివో లాక్కొచ్చి గుర్తు చేస్తుంది. వాడు అప్పుడు నిన్ను అలా అన్నాడు..గుర్తుందా, వాడు నీ గురించి ఏమనుకుంటున్నాడు. అంటూ రెచ్చగొడుతుంది. నీ బొందలే, నాకు లేని బాధ నీకుందుకు.. అని ఆ మైండ్ చెప్పే దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే కాసేపటికి తన ఆటలు సాగక ఊరుకుంటుంది. సో మైండ్ చేసే ఏ ఆలోచనా తిరస్కరించకండి. తిరస్కరిస్తే వేరే రూపంలో వస్తుంది. అలాగే పట్టించుకోకండి.
Nallamothu Sridhar: ఈ అలవాట్లు మార్పు తెస్తాయి!
నో చెప్పడం తప్పు కాదు.. అందరి చేత మంచి అన్పించుకోవడం కోసం అందరూ అడిగే సాయాలకు, డిమాండ్ చేసే నీ టైమ్‌కి Yes చెప్పి మానసిక ఒత్తిడి పెంచుకోకు. నీ life నీది, నీ కంటూ కొన్ని ప్రయారిటీలు ఉంటాయి. నీకు నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయి. నో చెప్పే ఏం కాదు. అది నీపై చాలా ఒత్తిడి తగ్గిస్తుంది.
మనుషుల వల్ల గానీ, పరిస్థితుల వల్ల గానీ, అనుకున్న పనులు అవక గానీ డిజప్పాయింట్ అవ్వడం, ఇతర పరిష్కారం కాని ఎమోషనల్ ప్రతిరోజూ నీలో పేరుకుపోతుంటాయి. సో అవి ఎవరితో అయినా షేర్ చేసుకో, భారం తగ్గుతుంది. ఎవరితో షేర్ చేసుకోవడానికి కుదరకపోతే ఓ డైరీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని రోజూ నీకు అన్పించింది డైరీ రాయడం అలవాటు చేసుకో, మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఒక మనిషి రోజుకి సగటున 6200 ఆలోచనలు చేస్తాడు. అంటే గంటకి 258 చొప్పున అన్నమాట. సో దీనివల్ల మైండ్ Mind, అలిసిపోతుంది. అందుకే రోజుకి కనీసం ఓ 10 నిమిషాలైనా ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని నీతో నువ్వు గడుపు. ఏమైనా ఆలోచనలు వస్తే వాటిని తిరస్కరించకుండా, వాటిని పట్టించుకోకుండా అలాగే కామ్‌గా కూర్చో.
ఏ విషయమైనా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యే స్వభావాన్ని తగ్గించుకో. అది ఒక్క రోజులో తగ్గక పోవచ్చు. కానీ అలవాటు చేసుకో. ఎమోషనల్‌తో రియాక్ట్ కావడానికి బదులు కేవలం కూల్‌గా రెస్పాండ్ అవ్వు అంతే. ఓ మాట కోపంతో అరిస్తే అది రియాక్ట్ అవ్వడం అన్నమాట. అదే కూల్‌గా సమాధానం చెబితే అది రెస్పాండ్ కావడం అన్నమాట. ప్రాక్టీస్ చేయి.
Nallamothu Sridhar వ్యక్తిగత జీవితం!
నల్లమోతు శ్రీధర్ కంప్యూటర్ ఎరా తెలుగు పత్రికకు సంపాదకులు. అంతే కాకుండా సాంకేతిక నిపుణులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఆయన హైదరాబాద్‌లో జీవనం కొనసాగిస్తున్నారు. శ్రీధర్ తన యుక్త వయసులో చదువు సగంలోనే ఆపేశారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ drugs, వంటి దురలవాట్లకు బానిసయ్యాడు. దీంతో తాను నివసించిన ప్రాంతంలో ముఖం చెల్లక ఊరికి దూరంగా ఉండేవారు. ఊరికి వెళితే వ్యసనాలకు బానిసైన వ్యక్తిగా చులకనగా చూస్తారనే భయంతో కొన్నాళ్ల వరకు ఊరికి వెళ్లలేదు.

తర్వాత చెడు అలవాట్లన్నీ మానేశారు. 2005లో విపరీతమైన డిప్రెషన్‌కి గురయ్యారు. ఒక సైకాలజిస్టును కలిసి తన ద్వారా కౌన్సెలింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం పది మందికి ఆదర్శం వంతంగా జీవిస్తూ స్టేజ్ మీద మోటివేషన్ స్పీచ్ motivational speech, కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాసం, టెక్నాలజీపై ప్రభావం, ఆన్లైన్ భద్రత, సంబంధిత అంశాల గురించి పలు టీవీ షోల్లో, సోషల్ మీడియాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.