Nalla Nagulamma Dj Song: కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమా పాటకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా ఒక మామూలు సాంగ్ ఉన్నదంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే యూట్యూబ్‌లో నల్ల నాగులమ్మ డిజె సాంగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ పాట డ్యాన్స్ కానీ, కొరియోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ అంతకంటే కెమెరామెన్ టాలెంట్ కానీ మైండ్‌బ్లోయింగ్ అయింది.
గత నెల కిందట విడుదల అయిన నల్ల నాగులమ్మ DJ Song ఇప్పుడు కుర్రకారుకి హుషారెక్కిస్తోంది. పాటను ఇయర్ ఫోన్ పెట్టుకొని వినమని ముందే వీడియోలో చెప్పేశారు. అసలు మ్యూజిక్ వింటే లోలోపల రిథమ్ పుట్టుకొస్తుంది. ఈ పాటలో మాత్రం డ్యాన్స్ దుమ్ములేపారు అనే కంటే దుమ్ము దులిపారని చెప్పవచ్చు.
తాళ్లపల్లి సురేష్ గౌడ్ నల్ల నాగులమ్మ సాంగ్‌కు లిరిక్స్ అందించారు. చాలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఇక సింగర్స్ లావణ్య, ఆకునూరి దేవయ్య స్వరాలతో పాటను ఒక లెవల్లో హైప్ పెంచారు. అంతకంటే సంగీతం ప్రవీణ్ కాయితోజ్ అందించారు. అసలకి ఆ మ్యూజిక్ వింటే ఒంట్లో వైబ్రేషన్ పుట్టుకొస్తున్నాయి. పాటకు, సంగీతానికి బాగా సరిపోయింది. ఇక Vicky, Mounika Dimple డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
విక్కీ, మౌనికా డింపుల్ డ్యాన్స్ ఫెర్మామెన్స్కే అభిమానులు, ప్రేక్షకులు ఎక్కువ మార్కులు వేశారు. వారి డ్యాన్స్ ఎంతలా చేశారంటే అబ్బో, డ్యాన్స్ కోసమే ఈ సాంగ్‌ను చూసేవారు చాలా మంది అభిమానులు ఉన్నారు. మౌనికా డింపుల్ చేసిన పాటల్లో ఎక్కువగా డ్యాన్స్ చాలా బాగుంటుంది. డింపుల్ డ్యాన్స్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు.
కెమెరా మేన్‌కు 100 కి 100 మార్కులు పడ్డాయి. సినిమా టెక్నిషియన్లు కూడా తీయనంత విధంగా కెమెరా మెన్ పాటను అద్భుతంగా చిత్రీకరించారు. పాటను మంచి లోకేషన్లలో షూట్ చేశారు. కొరియోగ్రఫీ మామూలుగా లేదు. కొరియోగ్రఫీ కళానైపుణ్యం ఇక్కడ వారి డ్యాన్స్‌లో కనిపిస్తుంది. మౌనిక డింపుల్ డ్యాన్స్ ఫెర్మామెన్స్ కోసం ఎంతో మంది చూస్తున్నారు.
Song ను ప్రతి రోజూ చూస్తున్నవారు కూడా ఉన్నారు. ఇక శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఈ పాట మోత మోగిస్తుంది. కుర్రకారు ఈ పాటకు డ్యాన్స్‌లు మామూలుగా వేయడం లేదు. ఈ పాట లిరిక్స్, సంగీతం, డ్యాన్స్, కొరియోగ్రఫీ అంతా సూపర్ గా ఉన్నాయని అభిమానులు అంటున్నారు. మీరు కూడా ఈ పాటను ఒక్కసారి చూడండి. పాటను డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఉన్నది.
Nalla Nagulamma Dj Song Credits:
Song Name | Nalla Nagulamma Dj Song |
Lyrics | thallapally Suresh Goud |
Singer | Lavanya , Akunoori Devaiah |
Music | Praveen Kaithoju |
Casting | Vicky & Mounika Dimple |
Choreography | Sheker Virus |
Making Camera | Manoj Datta |
Youtube Video Song | Link |
Special Thanks To: |
Kangti C.I Garu A.O Kangti, Deccan industries Tadkal, Tadkal GP Villlagers,Tadkal Sarpanch, Jamgi Villagers, Pandre Ramdas, Santhosh Mestri Garu,Gnaneshwar Valmure, jamgi (G.P) Villager’s, Kottakapu janardhan Reddy, Bollu Naresh, Kranthi yalavala, Hemanth, Bunny Mahesh, Laddu Music. |