Nagula Chavithi

Nagula Chavithi 2022: అనాదిగా వ‌స్తున్న ఆచారం నాగుల‌చ‌వితి గురించి తెలుసా?

Special Stories

Nagula Chavithi 2022 | పాముల ఆరాధ‌న ఈనాటిది కాదు. ఎన్నో యుగాల‌నాటిది. సౌభాగ్యానికి, స‌త్సంతాన ప్రాప్తికి స‌ర్ప‌పూజ చేయ‌డం ల‌క్ష‌ల శర‌త్తుల కింద‌టే ఉన్న‌ట్లు ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. దేశంలోని అనేక ఆల‌యాల్లో మెలిక‌లు తిరిగిన నాగ‌రాజు విగ్ర‌హాలు క‌నిపిస్తాయి ఇప్ప‌టికీ. దీపావ‌ళి అనంత‌రం వ‌చ్చే కార్తిక శుద్ధ చ‌వితిని నాగుల చ‌వితిగా పండ‌గ చేసుకోవ‌డం అనాదిగా వ‌స్తున్న ఆచారం. పాముల్ని(Snkaes) ఆరాధించే(Nagula Chavithi 2022) భార‌తీయ సంస్కృతి ఆంతర్యం ఏమిటి? ప్ర‌కృతిలోని స‌మ‌స్త ప్రాణుల్లో దైవ‌త్వం అదృశ్య రూపంలో ప‌రివ్యాప్త‌మై ఉంటుంది.

ప్రాణికోటిని కాపాడుకుంటే స‌మ‌స్త మానవ‌కోటి మ‌న‌గడ‌కు ముప్పు వాటిల్ల‌దు. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యానికి విఘాతం క‌ల‌గ‌దు. చెట్ల‌లో, పుట్ల‌లో, రాయిర‌ప్ప‌ల్లో, కొండ‌కోన‌ల్లో, న‌దుల్లో దైవ‌త్యాన్ని వీక్షించింది భార‌తీ య సంస్కృతి. అందులో భాగంగానే నాగ‌రాజు(nagaraju)గా, నాగ‌దేవ‌త‌(naga devatha)గా పూజిస్తూ వ‌స్తున్నారు. భూమిలో పాములు నివ‌సిస్తూ జీవ‌కోటికి నీటిని ప్ర‌సాదించే దేవ‌త‌లుగా పూర్వీకులు భావించారు. పంట‌ల్ని నాశ‌నం చేసే క్రిములు, కీట‌కాల‌ను భ‌క్తిస్తూ, ప‌రోక్షంగా రైతుల‌కు పంట న‌ష్టం రాకుండా చూస్తాయ‌ట‌. విష స‌ర్పాల మాట విన‌గానే భ‌య‌ప‌డి పారిపోతాం.

విష‌స‌ర్పాల‌కు మించిన దుష్ట మాన‌వులు మ‌న మ‌ధ్యే తిరుగుతూ నిష్కార‌ణంగా కాటేస్తుంటారు.శ‌రీరంలో నాడుల‌లో నిండిన వెన్నెముక‌ను వెన్నుపాము అంటాం. కుండ‌లినీ శ‌క్తి మూలాధార చ‌క్రంలో పాము ఆకృ తిలో ఉంటుంది. నాగుల చ‌వితినాడు విష‌స‌ర్పం పుట్ట‌ను పూజించి, పాలుపోస్తే, మ‌నిషిలోని విష స‌ర్పం కూడా శ్వేత వ‌ర్ణం పొంది హృద‌యాల్లోని మ‌హా విష్ణువుకు తెల్ల‌ని ఆదిశేషు వ‌ర్ణం పొంది హృద‌యాల్లోని మ‌హా విష్ణువుకు తెల్ల‌ని ఆదిశేషువుగా మారి శేష‌పాన్పుగా భాసించాల‌న్న కోరిక నెర‌వేరుతుంద‌ని పెద్ద‌లు చెబుతారు.

స‌ర్ప‌రాధ‌న‌కు తామ‌ర‌పుష్ఫాలు(tamara pusphalu), క‌ర్పూరం, పూలు, ల‌డ్డు మొద‌లైన శుభ‌ప్ర‌ద‌మైన‌వి. స‌ర్పారాధ‌న చేసేవారి వంశం తామ‌ర‌తంప‌ర‌గా వ‌ర్థిల్లుతుంద‌ని భ‌విష్య‌పురాణం చెబుతోంది. మ‌న దేశంలో ఎన్నోఇళ్ల‌లో ఇల‌వేలుపు సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌రుడే. నాగ‌ర్ కోయిల్(nagar koyal) అనే ఊరిలో ఒక నాగుపాము విగ్ర‌హం ఉంది. దాని స‌మీపంలో తెల్ల‌ని ఇసుక ఆరునెల‌లు, నల్ల‌ని ఇసుక ఆరునెల‌లు ఉబికివ‌స్తుంద‌ని భ‌క్తులు చెబుతారు. పాము కుబుసానికి ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. గ‌ర‌ళాన్ని ఆయ‌ర్వేద మందుల్లో త‌గు మోతాదులో ఉప‌యోగిస్తారు.

source: twitter @hema_samala

న‌క్ష‌త్ర మండ‌లాలు స‌ర్పాకృతిలోనే ఉన్నాయంటారు. నాగ‌లింగం(nagalingam) పువ్వులో పుప్పొడి స‌ర్పాకృతిలోనే ఉంటుంది. శివుడు మెడ‌నిండా స‌ర్పాకృతిలోని హారాలు మెరుస్తుంటాయి. నాగేంద్రుని శివ‌భావంతో చ‌వితినాడు అర్చిస్తే స‌ర్వ‌రోగాలు న‌శించి సౌభాగ్య‌వంతుల‌వుతార‌ని రుషివాక్కు.

భార‌తీయుల న‌మ్మ‌కం ఇదే!

ఈ నాగుల చ‌వితి నాడు నాగేంద్రుని శివ‌భావంతో అర్పిస్తే స‌ర్వ‌రోగాలు పోయి సౌభాగ్య‌వంతుల‌వుతార‌ని భారతీయుల న‌మ్మ‌కం. ఈ మాన‌వ శ‌రీర‌మే పుట్ట‌కు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే న‌వ‌రంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శ‌రీరంలో నాడుల‌తో నిండివున్న వెన్న‌ముక‌ను వెన్నుబాము అని అంటారు. అందుకుండ‌ల‌నీ శ‌క్తి మూల‌ధార చ‌క్రంతో పాము ఆర‌మువ‌లెనే ఉంటుంద‌ని యోగ‌శాస్త్రం చెబుతోంది.

ఇది మాన‌వ శ‌రీరంలో నిదురిస్తున్న‌ట్టు నటిస్తూ, కామ‌, క్రోద‌, లోభ‌, మోహ‌, మ‌ద‌, మాత్స‌ర్యాల‌నే విషాల్ని గ్ర‌క్కుతూ, మాన‌వునిలో స‌త్య‌గుణ సంప‌త్తిని హ‌రించి వేస్తూ ఉంటుంద‌ని అందుకు నాగుల చ‌వితి రోజున ప్ర‌త్య‌క్షంగా విష‌స‌ర్ప‌పుట్ట‌ల‌ను పుట్ట‌లో పాలు పోస్తే మానవునిలో ఉన్న విష‌స‌ర్పం కూడా శ్వేత‌త్వం పొంది, అంద‌రి హృద‌యాల‌లో నివ‌శించే శ్రీ‌మ‌హా విష్ణువు కు తెల్ల‌ని ఆదిశేషువుగా మారి శేష‌పాన్పుగా మారాల‌ని కోరిక‌తో చేసేదే ఈ నాగుపాము పుట్ట‌లో పాలు పోయ‌డంలో తెల్ల‌ని ఆదిశేషువుగా మారి శేష‌పాన్పుగా మారాల‌ని కోరిక‌తో చేసేదే ఈ నాగు పాము పుట్ట‌లో పాలు పోయ‌డంతో గ‌ల అంతర్య‌మ‌ని చెప్పారు.

పాహి పాహి స‌ర్ప‌రూప నాగ‌దేవ ద‌యామ‌య‌
స‌త్సంతాన సంప‌త్తిం దేహియే శంక‌ర ప్రియ‌
అనంతాది మ‌హానాగ రూపాయ వ‌ర‌దాయ‌చ‌
తుభ్యం న‌మామి భుజ‌గేంద్ర సౌభాగ్యం దేహిమే స‌దా!

ఆవు పాలు పుట్ట‌లో పోసి నాగ పూజ‌చేసి చ‌లిమిడి, చిమ్మిలి, అర‌టిప‌ళ్లు మొద‌ల‌గున‌వి నివేద‌న చేస్తారు. ఈ క్రింది శ్లోకాన్ని ప‌ఠిస్తే క‌లిదోష నివార‌ణ అవుతుంద‌ని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

క‌ర్కోట‌క‌స్య నాగ‌స్య ద‌యయంత్యా న‌ల‌స్య చ‌|
రుతుప‌ర్ణ‌స్య రాజ‌ర్షే : కీర్త‌నం క‌లినాశ‌న‌మ్ ||

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *