Nagari: తండ్రిని చంపిన త‌న‌యుని విష‌యంలో సంచ‌ల‌న తీర్పును ఇచ్చిన Court

Nagari | మ‌ద్యం మ‌త్తు ఎంత ప‌ని చేసింది? క‌న్న‌తండ్రినే హ‌త‌మార్చి చివ‌ర‌కు కొడుకు జైలు పాల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. విచ‌క్ష‌ణ కోల్పోయిన ఆ కొడుకు చేసిన ప‌నికి ఇప్పుడు ప‌శ్చాతాపం ప‌డినా లాభం లేకుండా పోయింది. Madyam మ‌త్తులో తండ్రిని చంపిన ఆ కొడుకు చివ‌రికి క‌ట‌క‌టాల పాల‌య్యాడు. స‌మాజంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా కోర్టు స‌రైన తీర్పును ఇచ్చింది. ఇప్పుడు ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది.

మ‌ద్యం మ‌త్తులో క‌న్న‌తండ్రిని క‌త్తితో న‌రికి చంపిన కుమారుడిని యావ‌జ్జీవ కారాగార శిక్ష విధిస్తూ Tirupathi థ‌ర్డ్ ఏడీజే కోర్టు జ‌డ్జి గురువారం తీర్పునిచ్చారు. వివ‌రాల్లోకి వెళితే(Nagari) మండ‌లంలోని Kannikapuram ఎస్టీ కాల‌నీకి చెందిన సుబ్ర‌మ‌ణ్యం (57) కుమారుడు సురేష్ (25) జులాయిగా తిరుగుతూ మ‌ద్యానికి బానిస‌య్యాడు. గ‌త ఏడాది మే నెల 10వ తేదీన KG కుప్పం గ్రామ శివారుల్లోని వెంక‌టేష్ చౌద‌రి పొలంలో మేక‌లు మేపుతున్న సుబ్ర‌మ‌ణ్యం వ‌ద్ద‌కు వ‌చ్చిన సురేష్ మ‌ద్యంకు డబ్బులు ఇవ్వ‌మ‌ని గొడ‌వ‌ప‌డ్డాడు.

డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌ద్యం మ‌త్తులో విచ‌క్ష‌ణ కోల్పోయి క‌త్తితో తండ్రి త‌ల‌పై న‌రికి చంపి ప‌రార‌య్యాడు. సుబ్ర‌మ‌ణ్యం భార్య క‌న్నెమ్మ‌(54) Policeల‌కు ఫిర్యాదు చేసింది. CI మ‌ద్ద‌య్య ఆచారి నేతృత్వంలో పోలీసులు నాగ‌రాజు, భాస్క‌ర‌య్య‌, భాస్క‌ర్‌, ఏలుమ‌లైరెడ్డి, gavaskar గాలింపు చేప‌ట్టి చాక‌చ‌క్యంగా అత‌న్ని ప‌ట్టుకుని అరెస్టు చేశారు. అనంత‌రం రిమాండ్‌కు త‌ర‌లించారు. తిరుప‌తి థ‌ర్డ్ ఏడీజే Courtలో ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. Public ప్రాసిక్యూట‌ర్ వెంక‌ట నారాయ‌ణ కోర్టులో ఈ కేసును వాదించారు. కేసును పూర్తిస్థాయిలో ప‌రిశీలించిన పిమ్మ‌ట జ‌డ్జి ముద్దాయికి యావ‌జ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *