Myanmar update

Myanmar update : మ‌య‌న్మార్ లో ఆగ‌‌ని నిర‌స‌న‌లు! నిర్భంధంలోనే సూచీ!

Special Stories

Myanmar update : Myanmar: భార‌త్ పొరుగు దేశం మయ‌న్మార్ లో నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 1న సైనిక కుట్ర త‌ర్వాత నిర్భంధానికి గురైన పౌర నేత ఆంగ్‌సాన్ సూచీ తాజాగా వీడియోలో క‌నిపించారు. ఓ వీడియో ద్వారా కోర్టుకు హాజ‌ర‌య్యార‌ని ఆమె త‌ర‌పు న్యాయ‌వాదులు తెలిపారు. సైనికులు నిర్భంధించిన త‌ర్వాత ఆమె తొలిసారి క‌నిపించారు. అయితే ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు క‌నిపించారు. సైనిక కుట్ర‌కు వ్య‌తిరేకంగా గ‌త ఆదివారం జ‌రిగిన పెద్ద ఎత్తున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్ర‌మంలో సైనిక‌, పోలీసు బ‌ల‌గాలు కాల్పులు జ‌రిపాయి. ఈ కాల్పుల్లో 18 మంది మృతి చెందారు. అయితే ఈ నిర‌స‌న‌లు సోమ‌వారం కూడా కొన‌సాగాయి.

సైనిక కుట్ర ఎందుకు జ‌రుగుతోంది?

మ‌య‌న్మార్ లో గ‌త ఏడాది 2020లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో ఎన్ఎల్‌డి పార్టీ విజ‌యం సాధించింది. అయితే ఈ ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆ దేశ సైన్యం ఆరోపిస్తోంది. అందువ‌ల్ల‌నే తాను అధికారం స్వాధీనం చేసుకున్న‌ట్టు సైన్యం చెబుతోంది. కానీ సైన్యం చేసే ఆరోప‌ణ‌ల‌కు ఎటువంటి ఆధారాల‌ను చూపించ‌లేదు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల క‌మిష‌న్ ను మార్చేసి ఏడాదిలోగా తాజా ఎన్నిక‌లను నిర్వ‌హిస్తామ‌ని సైన్యం హామీ ఇస్తోంది.

ఆంగ్ సాన్ సూకీ చిత్రం (సేక‌ర‌ణ‌‌: twitter‌)

ఆంగ్ సాన్ సూచీ ఎక్క‌డ‌?

ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన సైనిక కుట్ర మొద‌లైన‌ప్పుడు ఆంగ్ సాన్ సూచీని గృహ‌నిర్భంధంలో ఉంచారు. అప్ప‌టి నుంచి ఆమె ఎవ‌రికీ క‌నిపించ‌లేదు. సోమ‌వారం దేశ రాజ‌ధాని నేపీటా కోర్టులో వీడియో లింకు ద్వారా సూచీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మ‌య‌న్మార్ దేశంలో చ‌ట్ట‌వ్య‌తిరేకంగా వాకీటాకీలు దిగుమ‌తి చేసుకున్నార‌ని, మియ‌న్మార్ ప్ర‌కృతి విప‌త్తు చ‌ట్టాన్ని ఉల్లంఘించార‌ని, ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించార‌ని, ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యార‌నే సూచీపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొద‌టి రెండు అభియోగాళ్లో సూచీ దోషిగా నిర్థార‌ణ అయితే 3 సంవ‌త్స‌రాల వ‌ర‌కు జైలు శిక్ష విధించే అవ‌కాశ‌ముంది. తాజాగా చేర్చిన కొన్ని అభియోగాల్లోనూ శిక్ష ప‌డి అవ‌కాశం ఉన్న‌ట్టు అక్క‌డ స్థానిక వార్తా సంస్థ‌లు పేర్కొంటున్నాయి. అయితే ఆంగ్ సాన్ సూచీని సైనిక వ‌ర్గం నిర్భంధించిన‌ప్ప‌టి నుంచీ మ‌య‌న్మార్ లో ఆమెపై ప్ర‌జాద‌ర‌ణ విప‌రీతంగా పెరిగింది. అయితే అంత‌ర్జాతీయ స్థాయిలో మాత్రం ఆమెకు మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. ఎందుకంటే సూచీ ఆ దేశంలోని మైనార్టీలైన రోహింగ్యా జాతి నిర్మూల‌న త‌న‌కు ప‌ట్ట‌న‌ట్టు ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

కాల్పుల్లో 18 మంది మృతి

మ‌య‌న్మార్‌లో నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు దాడులు జ‌రిపారు. ఈ దాడిలో 18 మందికి పైగా మృతిచెందార‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వ హ‌క్కుల కార్యాల‌యం వెల్ల‌డించింది. సైనిక తిరుగుబాటుకు వ్య‌తిరేకంగా యాంగూన్‌, దావె, మండాలె స‌హా వివిధ ప‌ట్ట‌ణాల‌లో ఆందోళ‌న చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జ‌రిప‌గా కొంద‌రు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆంగ్ సాన్ సూచీతో స‌హా ప‌లువురు నాయ‌కులు నిర్భంధంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కాల్పులు మోత‌ల‌తో రోడ్ల‌న్నీ ర‌క్త‌సిక్త‌మ‌య్యాయి. కాల్పుల‌ను ఎదుర్కొనేందుకు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ర‌క్ష‌ణ క‌వ‌చాలు ధ‌రించి అక్క‌డికి చేరుకున్నారు. వారంతా పోలీసు దాడిని ప్ర‌తిఘ‌టించ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు.

గాయ‌ప‌డ్డ వారిని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్న‌దృశ్యం (సేక‌ర‌ణ‌‌: twitter‌)

2020 నవంబ‌ర్ లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో నేష‌న‌ల్ లీగ్ ఫ‌ర్ డెమెక్ర‌సీ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించింది. అయితే త‌త్మ‌డా, సైన్యం మ‌ద్ద‌తుదారుల పార్టీ యూఎస్‌డీపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప‌దేప‌దే వివాద స్ప‌దం చేస్తూనే వ‌చ్చింది. ఎన్నిక‌ల్లో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌ని నేష‌న‌ల్ లీగ్ ఫ‌ర్ డెమెక్ర‌సీ చెప్పుకొచ్చింది. ఈ ఆరోప‌ణ‌ల‌ను మాత్రం ఎన్నిక‌ల క‌మిష‌న్ ఖండింది. వివాదం కాస్త పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వానికి , ఆర్మీకి మ‌ధ్య తిరుగుబాటు వ‌స్తుందేమోన‌ని ముందే ఊహించారు స్థానిక ప్ర‌జ‌లు. ప్ర‌స్తుతం దేశం ఆర్మీ జ‌న‌ర‌ల్ ఆంగ్ హ్ల‌యింగ్ చేతిలో ఉన్న‌ది.

ఇది చ‌ద‌వండి:ముఖానికి క‌వ‌ర్‌తో నైట్రోజ‌న్ గ్యాస్ పీల్చి యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

ఇది చ‌ద‌వండి: రూ.500 కే టివీ అంట‌..ఆరా దీస్తే!

ఇది చ‌ద‌వండి:స‌గ‌టు వాలంటీర్ లోపల ఆవేద‌న ఇదేనేమో!?

ఇది చ‌ద‌వండి:వ‌త్స‌వాయి : టిడిపి కార్య‌క‌ర్త వాహ‌నానికి నిప్పు!

ఇది చ‌ద‌వండి:దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్తూ రోడ్డు ప్ర‌మాదం

ఇది చ‌ద‌వండి:చాప‌కింద నీరులా సెకండ్ స్ట్రెయిన్ ముప్పు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *