Mutton Recipes

Mutton Recipes: మ‌ట‌న్ కూరల వెరైటీలు- మ‌ట‌న్ కూర‌లు త‌యారు చేసే విధానం!

Share link

Mutton Recipes | ఆదివారం వ‌స్తే ప్ర‌తి ఇంటిలోనూ మ‌ట‌న్ కూర వండి తీరాల్సిందే. Mutton Curry మ‌సాలా వాస‌న వ‌స్తుంటేనే ఎప్పుడు తినాలా? అనిపిస్తుంటుంది. అయితే మ‌ట‌న్ కూర చేయ‌డం కొంద‌రికి రాదు. అలాంటి వారు మ‌ట‌న్ కూర‌ను ఇంటిలో చేసుకోవ‌డానికి ఇక్క‌డ కొన్ని మ‌ట‌న్ కూర‌ల ర‌కాలు అంద‌జేశాం. మీకు న‌చ్చిన కూర‌ను(Mutton Recipes) ఇక్క‌డ చూసి నేర్చుకోవ‌చ్చు.

Mutton Kebab త‌యారీ విధానం ఎలా ఉంటే?

కావాల్సిన‌వి

మ‌ట‌న్- కిలో (ఖీమాలా కొట్టించాలి)
టొమాటోలో- ఒక‌టి (స‌న్న‌గా తుర‌మాలి)
సోమ‌క్ (ప‌ర్షియ‌న్ హెర్బ్‌) 0 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు- త‌గినంత‌
మిరియాలు -త‌గినన్ని

త‌యారు చేసే విధానం

మ‌ట‌న్‌లో ఉల్లితురుము, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని 8 గుండ్ర‌ని బంతుల్లా చేయాలి. ఇప్పుడు ఓవెన్‌లో పెట్టే ఎనిమిది చువ్వ‌లు తీసుకోవాలి. ఈ ముద్ద‌ల్నిచ‌క్క‌గా చువ్వ చుట్టుతూ అంటించాలి. ఇప్పుడు వీటిని #Ovenలో పెట్టి గ్రిల్ చేయాలి. అలాగే టొమాటోలను విడిగా గ్రిల్ చేయాలి. క‌బాబ్‌లు బ‌య‌ట‌కు తీశాక సోమక్‌పొడిని చ‌ల్లి వ‌డ్డించాలి. ఇవిరోటీ లేదా బ‌ట్ట‌ర్డ్ రైస్‌లోకి కూడా బాగుంటాయి.

Mutton Pakodi త‌యారీ ఎలా?

కావాల్సిన ప‌దార్థాలు

ఎముక‌లు తీసిన మ‌ట‌న్‌- 300 గ్రాములు
శ‌న‌గ‌పిండి- పావు క‌ప్పు
అల్లం ముక్క‌లు- రెంచు చెంచాలు
ప‌సుపు- చిటికెడు
వెల్లుల్లి – నాలుగు రేకులు,
ఉల్లిపాయ‌లు- ఒక‌టి
క‌రివేపాకు- నాలుగు రెబ్బ‌లు
కొత్తిమేర‌- కొద్దిగా
కారం, ఉప్పు- రుచికి త‌గినంత‌
నూనె- వేయించ‌డానికి స‌రిప‌డా

Mutton Recipes | త‌యారీ విధానం

ముందుగా #మ‌ట‌న్‌ను శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లు కోయాలి. కుక్క‌ర్‌లో మ‌ట‌న్ ముక్క‌లు, అల్లం, వెల్లుల్లి, ప‌సుపు, కారం, ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాలి. నాలుగు కూత‌లు వ‌చ్చే వ‌ర‌కూ ఉంచి దించేయాలి. చ‌ల్లారాక అందులో త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు, కొత్తిమీర‌, క‌రివేపాకు, శ‌న‌గ‌పిండి వేస్తే స‌రిపోతుంది. త‌ర్వాత బాణాలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడ‌య్యాక #Mutton ముక్క‌ల‌తో క‌లిపిన పిండిని ప‌కోడీల్లా వేయాలి. అవి బంగారు వ‌ర్ణంలోకి వ‌చ్చేదాకా వేయించి తీస్తే స‌రిపోతుంది. వేడి వేడి మ‌ట‌న్ ప‌కోడీల‌ను ట‌మాటాసాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

Mutton Dhamaka Biryani

కావాల్సిన ప‌దార్థాలు

మ‌ట‌న్‌- పావుకేజీ
బాసుమ‌తి బియ్యం- పావుకేజీ
మ‌సాలా- 10 గ్రాం
అల్లం, వెల్లుల్లి పేస్టు- 75 గ్రా.
నెయ్యి-100 గ్రా
పెరుగు-100 గ్రా
ప‌చ్చిమిర్చి పేస్ట్‌- 20 గ్రా
పుదీనా- 1 క‌ట్ట‌
కొత్తిమీర‌-1 క‌ట్ట‌
బిర్యానీ ఆకులు-4
ఉప్పు – త‌గినంత‌

Mutton Recipes | త‌యారు చేయు విధానం

మ‌ట‌న్‌లో అల్లం, వెల్లుల్లిపేస్టు, నెయ్యి, పెరుగు, నిమ్మ‌ర‌సం, ఉప్పు, ప‌చ్చిమిర్చి పేస్ట్ కొన్ని నీళ్లు పోసి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇలా ఒక అర‌గంట‌సేపు ఉంచాలి. ముందుగానే బియ్యాన్ని క‌డిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లుపోసి బాగా మ‌ర‌గ‌నివ్వాలి. దాంట్లో మ‌సాలా, నెయ్యి, #బిర్యానీ ఆకులు, బియ్యం వేయాలి. స‌గానికి పైగా ఉడికాక దించేయాలి. ఇప్పుడు మ‌రో గిన్నెలో కీమా వేసుకుని స‌గం ఉడికిన బియ్యాన్నిపైన వేయాలి. నీళ్లు మాత్రం పోయ‌కూడ‌దు. పై నుంచి మూత గట్టిగా పెట్టాలి. ఆవిర బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కు అలాగే ఉంచాలి. అప్పుడు మూత తీసిపై నుంచి బిర్యానీ క‌ల‌ర్‌, నిమ్మ‌రసం, నెయ్యి వేసి క‌ల‌పాలి. వేడి వేడి మ‌ట‌న్ ద‌మ్‌కా బిర్యానీ అదిరిపోతుంది.

upma recipe: ఇంట్లో సులువుగా త‌యారు చేసుకునే ఉప్మా గురించి తెలుసుకోండి!

upma recipe | ఉప్మా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహార‌ము. ఈ ఉప్మాను బియ్యం ర‌వ్వ‌తో, అటుకుల‌తో, సేమ్యాల‌తో, గోధుమ నూక‌తో చేసుకోవ‌చ్చు. ఉప్పు మ‌రియు Read more

Bone Less Mutton Recipe: బోన్‌లెస్ మ‌ట‌న్ వేపుడు ఎలా అంటే?

Bone Less Mutton Recipe | బోన్‌లెస్ మ‌ట‌న్ అంటే ఎవ‌రి ఇష్టం ఉండ‌దు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ క‌ర్రీని ఇష్టంగా తినేవారు ఉన్నారు. కానీ ఇది Read more

Mutton Pakodi Recipe: మ‌ట‌న్ ప‌కోడీ త‌యారు చేయ‌డం ఎలా?

Mutton Pakodi Recipe:మ‌ట‌న్ ప‌కోడీ చేయ‌డం మీకు వ‌చ్చా! ఒక వేళ ఎలా త‌యారు చేయాలో తెలియ‌దా? అయితే ఇక్క‌డ మ‌ట‌న్ ప‌కోడీ ఎలా త‌యారు చేయాలో Read more

kitchen Tips: తెలుగు ఇంటి ఆడ‌ప‌డుచుల‌కు వంటింటి చిట్కాలు!

kitchen Tips | తెలుగింటి ఆడ‌ప‌డుచులు వంటింట్లో ఎక్కువుగా స‌మ‌యం కేటాయిస్తారు. వారి కుటుంబానికి ఏది కావాల‌న్నా క్ష‌ణాల్లో వండి వ‌డ్డిస్తారు. వారు ఎన్నో ఆహార ప‌దార్థాలు Read more

Leave a Comment

Your email address will not be published.