Mutton Pakodi Recipe:మటన్ పకోడీ చేయడం మీకు వచ్చా! ఒక వేళ ఎలా తయారు చేయాలో తెలియదా? అయితే ఇక్కడ మటన్ పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. మీ ఇంటిలో కుటుంబ సభ్యులకు వండి పెట్టండి.
Mutton Pakodi Recipe: కావాల్సిన పదార్థాలు
ఎముకలు తీసిన మటన్ – 300 గ్రాములు
సెనగ పిండి – పావు కప్పు
అల్లం ముక్కలు – రెండు చెంచాలు
పసుపు – చిటికెడు
వెల్లుల్లి – నాలుగు రేకులు
ఉల్లిపాయ – ఒకటి
కరివేపాకు – నాలుగైదు రెబ్బలు
కొత్తిమీర – కొద్దిగా
కారం, ఉప్పు – రుచికి తగినంత
నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలు కోయాలి. కుక్కర్‌లో మటన్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాలి. నాలుగు కూతలు వచ్చే వరకూ ఉంచి దించేయాలి. చల్లారాక అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, సెనగ పిండి వేసి నీళ్లతో కలుపుకోవాలి. మరీ జావగా అయితే కొద్దిగా మొక్కజొన్న పిండి వేస్తే సరిపోతుంది. తరువాత బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక మటన్ ముక్కలతో కలిపిన పిండిని పకోడీల్లా వేయాలి. అవి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించి తీస్తే సరిపోతుంది. వేడివేడి మటన్ పకోడీలను టమాటా సాస్‌తో తింటే మరింత రుచిగా ఉంటాయి.