mutton curry types

mutton curry types: మ‌ట‌న్ కూర‌ల త‌యారీ విధానం ఇక్క‌డ నేర్చుకోండి!

Share link

mutton curry types | మ‌ట‌న్ కూర త‌యారీ చేయ‌డం మీకు తెలియ‌దా? అయితే ఇక్క‌డ ప‌లు ర‌కాల మ‌ట‌న్ కూర‌ల వెరైటీలు ఇచ్చాము. వాటిని చూసి మీరు మ‌ట‌న్ కూర త‌యారీ నేర్చుకోవ‌చ్చు. మ‌ట‌న్ కూర‌కు సంబంధించి కావాల్సిన ప‌దార్థాలు, త‌యారీ విధానం(mutton curry types) ఇక్క‌డ తెలుసుకొని సులువుగా నేర్చుకోండి!

మ‌ట‌న్ బోన్ పులుసు

కావాల్సిన ప‌దార్థాలు

మ‌ట‌న్ (ఎముక‌తో స‌హా) – అర‌కిలో,
ఉల్లిపాయ‌లు- నాలుగు
అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను
చింత‌పండు – కొద్దిగా
కారం – రెండు టీ స్పూను
ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు – మూడు
ప‌సుపు – చిటికెడు
ఉప్పు – త‌గినంత‌
గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూను
ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్లు
క‌రివేపాకు – ఒక రెబ్బ
కొత్తిమీర – ఒక క‌ట్ట‌
నూనె – స‌రిప‌డా

mutton curry types | త‌యారు చేయు విధానం

గిన్నెలో స‌రిప‌డా నూనె వేసి బాగా కాగాక అల్లం వెల్లుల్లి ముద్ద‌, క‌రివేపాకు, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు వేసి వేగించాలి. త‌ర్వాత స‌న్న‌గా త‌రిగిన #Onion ముక్క‌లు కూడా వేసి బాగా వేగించాలి. త‌ర్వాత ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి బాగా క‌లిపి మ‌ట‌న్ కూడా వేసి వేగించాలి. స‌న్న‌ని మంట‌పై ఓ 10 నిమిషాల వేగించిన త‌ర్వాత ఒక గ్లాసు చింత‌పండు నీళ్లు పోసి ఉడికించి దించేయాలి. దించే ముందు కొత్తిమీర తురుము వేసుకోవాలి.

Boneless mutton Fry (మ‌ట‌న్ వేపుడు)

కావాల్సిన ప‌దార్థాలు

బోన్‌లెస్ మ‌ట‌న్‌- అరకిలో
అల్లం ముద్ద – ఒక టీ స్పూను
అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను
వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను
వెల్లుల్లి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూను
కారం – ఒక టీ స్పూను
ధ‌నియాల పొడి – రెండు టీ స్పూను
ప‌సుపు – చిటికెడు,
ఉల్లిపాయ‌లు – ఒక‌టి
చిన్న ఉల్లిపాయ‌లు – ఆరు
కొబ్బ‌రి తురుము – అర‌క‌ప్పు
గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూను
క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు
దాల్చిన చెక్క ముక్క‌లు – నాలుగు
ఉప్పు – త‌గినంత‌
నూనె – స‌రిప‌డా

త‌యారు చేయు విధానం

ముందుగా మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం వెల్లుల్లి, ధ‌నియాల పొడి వేసి మెత్త‌గా రుబ్బుకోవాలి. పొయ్యి మీద మంద‌పాటి గిన్నె పెట్టి స‌రిప‌డా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ గుజ్జు, ఉప్పు, కారం, ప‌సుపు వేసి వేగించి అందులో మ‌ట‌న్ ముక్క‌లు వేసి పూర్తిగా ఉడికాక ఉడికించి దించేయాలి. ఇప్పుడు మ‌రో గిన్నెలో స‌రిప‌డా నూనె పోసి కొబ్బ‌రి తురుము, క‌రివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లి ముక్క‌లు, తొక్క తీసిన చిన్న ఉల్లిపాయ‌లు వేసి వేగించాలి. త‌రువాత ఉడికించిన మ‌ట‌న్‌, గ‌రం మ‌సాలా వేసి ఓ ఐదు నిమిషాలు వేగించి దించేయాలి.

Gongura Mutton Recipe (గోంగూర మ‌ట‌న్‌)

కావాల్సిన ప‌దార్థాలు

మ‌ట‌న్‌- అర‌కిలో
గోంగూర – చిన్న క‌ట్ట‌
ఉల్లిపాయ‌లు – మూడు
అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టీ స్పూను
క‌రివేపాకు – ఒక రెబ్బ‌
గ‌రం మసాలా – ఒక టీ స్పూను
ప‌సుపు – చిటికెడు
ఉప్పు – త‌గినంత‌
నూనె – స‌రిప‌డా

త‌యారుచేయు విధానం

ముందుగా గోంగూర‌ని ఉడికించి ప‌క్కన పెట్టుకోవాలి. మ‌రో గిన్నెలో స‌రిప‌డా నూనె పోసి బాగా కాగాక అల్లం వెల్లుల్లి ముద్ద‌, క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేగించాలి. త‌ర్వాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మసాలా, మ‌ట‌న్ వేసి బాగా క‌లిపి కొద్ది సేపు వేగించాలి. అర క‌ప్పు నీళ్లు పోసి ఓ 10 నిమిషాలు వేగించి ముక్క మెత్త‌బ‌డ్డాక ఉడికించిన గోంగూర ముద్ద వేసి మ‌రో 10 నిమిషాలు ఉడికించి దించేయాలి.

Mutton Pakodi (బోన్‌లెస్ మ‌ట‌న్ ప‌కోడి)

కావాల్సిన ప‌దార్థాలు

బోన్‌లెస్ మ‌ట‌న్ – పావుకిలో
మొక్క‌జొన్న పిండి- రెండు టేబుల్ స్పూను
శ‌న‌గ‌పిండి- అర క‌ప్పు
కారం- ఒక టీ స్పూను
ధ‌నియాల పొడి- ఒక టీ స్పూను
జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూను
అల్లం ముద్ద – ఒక టీ స్పూను
ఉప్పు – త‌గినంత‌
నూనె – స‌రిప‌డా

mutton curry types | త‌యారు చేయు విధానం

మ‌ట‌న్‌ని శుభ్ర‌తంగా క‌డిగి చిన్న‌ముక్క‌లుగా చేసుకోవాలి. మ‌రో గిన్నెలో మొక్క‌జొన్న పిండి, శెన‌గ‌పిండి, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, #Ginger ముద్ద‌, ఉప్పు, కారం, స‌రిప‌డా నీళ్లు జోరుగా క‌లుపుకోవాలి. అందులో మ‌ట‌న్ ముక్క‌లు వేసి ఓ ప‌ది నిమిషాలు నాన‌బెట్టాలి. త‌ర్వాత మ‌రో గిన్నెలో స‌రిప‌డా నూనె పోసి బాగా కాగాక మ‌ట‌న్ ప‌కోడీలు వేసుకోవాలి.

Mutton Sabzi Recipe (కొర్‌మెహ్ స‌బ్జి)

కావాల్సిన ప‌దార్థాలు

కొత్తిమీర‌, పాల‌కూర‌, మెంతికూర‌, సొయ‌కూర‌- ఒక్కోటీ నాలుగు క‌ట్ట‌లు,
మ‌ట‌న్‌- పావుకిలో (ఖీమ్‌లా కొట్టాలి)
రాజ్మా – పావుకిలో (ముందురోజు రాత్రే నాన‌బెట్టాలి)
ఉల్లిపాయ‌- ఒక‌టి
న‌ల్ల ఉప్పు – టీస్పూను
నూనె- 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి- టీ స్పూను
ప‌సుపు- చిటికెడు
ఉప్పు- త‌గినంత‌

త‌యారు చేసే విధానం

మంద‌పాటి బాణ‌లిలో టేబుల్ స్పూను నూనె పోసి Keemaను వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ‌ను స‌న్న‌గా త‌ర‌గాలి. అందులోనే ఉప్పు, మిరియాల పొడి, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని వేయించిన ఖీమాలో క‌ల‌పాలి. త‌రువాత దీన్ని చిన్న ఉండ‌లుగా చేయాలి. వీటిని మిగిలిన #Oilలో ఎర్ర‌గా వేయించి తీయాలి. మ‌రో గిన్నెలో స‌న్న‌గా త‌రిగిన ఆకుకూర‌లు వేసి మెత్త‌గా ఉడికించాలి. అందులోనే వేయించిన మ‌ట‌న్ బాల్స్‌, న‌ల్ల ఉప్పు అన్నీ వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి స‌న్న మంట మీద ఉడికించాలి. ఇది బ‌ట‌ర్డ్ రైస్‌లోకి బాగుంటుంది.

Munakkaya Mutton (మున‌క్కాయ మ‌ట‌న్‌)

కావాల్సిన ప‌దార్థాలు

మ‌ట‌న్ – అర‌కిలో
మ‌న‌క్కాయ‌లు – మూడు
ఉల్లిపాయ‌లు – మూడు
అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను
కారం – రెండు టీ స్పూను
ప‌సుపు – చిటికెడు
గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూను
క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు
కొత్తిమీర – ఒక క‌ట్ట‌
ఉప్పు – త‌గినంత‌
నూనె – స‌రిప‌డా

త‌యారు చేసే విధానం

మ‌ట‌న్‌ని శుభ్రంగా క‌డిగి కుక్క‌ర్‌లో వేసి, కొద్దిగా కారం, ఉప్పు, గ‌రం మ‌సాలా క‌లిపి స్టౌ మీద పెట్టి రెండు విజిల్స్ వ‌చ్చాక దింపేయాలి. మున‌క్క‌యాల్ని చిన్న సైజు ముక్క‌లు క‌ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ‌ల్ని బాగా స‌న్న‌గా త‌ర‌గాలి. స్టౌ మీద మంద‌పాటి గిన్నె పెట్టి స‌రిప‌డా నూనె పోసి బాగా వేడెక్కాక క‌రివేపాకు, ఉల్లిపాయ‌ముక్క‌లు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం #Masala వేసి క‌ల‌పాలి. ఇందులో మున‌క్కాయ ముక్క‌లు, ఉడికించి పెట్టుకున్న మ‌ట‌న్ ముక్క‌లు కూడా వేసి క‌లిపి మూత పెట్టాలి. రెండు నిమిషాల త‌రువాత కొద్దిగా నీళ్లు పోసి స‌న్న‌ని మంట‌పై ఓ 10 నిమిషాలు ఉడికించాలి. ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌ర్వాత కొత్తిమీర తురుము వేసి దించేయాలి.

Bone Less Mutton Recipe: బోన్‌లెస్ మ‌ట‌న్ వేపుడు ఎలా అంటే?

Bone Less Mutton Recipe | బోన్‌లెస్ మ‌ట‌న్ అంటే ఎవ‌రి ఇష్టం ఉండ‌దు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ క‌ర్రీని ఇష్టంగా తినేవారు ఉన్నారు. కానీ ఇది Read more

Mutton Pakodi Recipe: మ‌ట‌న్ ప‌కోడీ త‌యారు చేయ‌డం ఎలా?

Mutton Pakodi Recipe:మ‌ట‌న్ ప‌కోడీ చేయ‌డం మీకు వ‌చ్చా! ఒక వేళ ఎలా త‌యారు చేయాలో తెలియ‌దా? అయితే ఇక్క‌డ మ‌ట‌న్ ప‌కోడీ ఎలా త‌యారు చేయాలో Read more

kitchen Tips: తెలుగు ఇంటి ఆడ‌ప‌డుచుల‌కు వంటింటి చిట్కాలు!

kitchen Tips | తెలుగింటి ఆడ‌ప‌డుచులు వంటింట్లో ఎక్కువుగా స‌మ‌యం కేటాయిస్తారు. వారి కుటుంబానికి ఏది కావాల‌న్నా క్ష‌ణాల్లో వండి వ‌డ్డిస్తారు. వారు ఎన్నో ఆహార ప‌దార్థాలు Read more

upma recipe: ఇంట్లో సులువుగా త‌యారు చేసుకునే ఉప్మా గురించి తెలుసుకోండి!

upma recipe | ఉప్మా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహార‌ము. ఈ ఉప్మాను బియ్యం ర‌వ్వ‌తో, అటుకుల‌తో, సేమ్యాల‌తో, గోధుమ నూక‌తో చేసుకోవ‌చ్చు. ఉప్పు మ‌రియు Read more

Leave a Comment

Your email address will not be published.