ముస్లిం మ‌త‌గురువు Halim Saheb మృతి | సంతాపం ప్ర‌క‌టించిన‌ ఉప ముఖ్య‌మంత్రి

Halim Saheb : ముస్లింల మ‌త గురు ప్ర‌ముఖ‌లు, సున్నీ జ‌మాత్ జాతీయ నాయ‌కులు అల్లామా మౌలాన ముప్తి హ‌లీమ్ సాహెబ్ కీబ్లా కొద్దిసేప‌టికి క్రితం దివంగ‌తుల‌య్యారు. రాష్ట్రంలో ఇస్లాంకు పెద్ద దిక్కుగా అభిమానించే హ‌లీమ్ సాహెబ్ మృతి ప‌ట్ల ఉప ముఖ్య‌మంత్రి అమ‌జాద్ బాషా తీవ్ర విచారాన్ని వ్య‌క్తం చేశారు. ముస్లిం స‌మాజం ఒక పెద్ద మ‌హానుభావుడిని కోల్పోయింద‌న్నారు. అల్ల‌హ్ హ‌లీమ్ మ‌హాత్ముల వారికి జ‌న్న‌త్ ప్ర‌సాదించాల‌ని ఆకాంక్షించారు. హ‌లీమ్ సాహెబ్ దివంగ‌తుల‌య్యార‌న్న స‌మాచారం తెలుసుకున్న దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆయన శిష్యులంద‌రూ ఆయ‌న అంతిమ ద‌ర్శ‌నం కోసం విజ‌యవాడ రానున్నారు. అనేక మంది ఇస్లాం పండితులు, ప్ర‌ముఖులు ఆయ‌న‌కు అశ్రు న‌య‌నాల‌తో వీడ్కోలు సందేశాల‌తో సోష‌ల్‌మీడియా మాధ్య‌మం ద్వారా సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ముప్తీ హ‌లీమ్ సాహెబ్ అంత్య‌క్రియ‌లు ఆదివారం విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్రంలో ఉన్న ముస్లీం ఎమ్మెల్యేలు అబ్ధుల్ హ‌ఫీజ్ ఖాన్ (క‌ర్నూలు), మొహ‌మ్మ‌ద్ ముస్తాఫా (గుంటూరు), మొహ‌మ్మ‌ద్ న‌వాజ్ బాషా (మ‌ద‌న‌ప‌ల్లి), ఎమ్మెల్సీలు క‌రీమున్నీసా, మ‌హ‌మ్మ‌ద్ ఇక్బ‌ల్‌, ఇత‌ర రాజ‌కీయ ప్ర‌ముఖులు త‌మ విచారాన్ని వెల‌బుచ్చారు. కొండ‌ప‌ల్లి ఆస్థాన పీఠాధిప‌తులు హ‌జ‌ర‌త్ అల్తాఫ్ అలీ ర‌జా బాబా ఒక ప్ర‌క‌ట‌న‌తో ముప్తి హ‌లీం సాహెబ్ సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటూ, ముస్లిం స‌మాజం ఒక ప్ర‌ముఖుడ్ని కోల్పోయింద‌ని వెల్ల‌డించారు. ముఫ్తీ హ‌లీమ్ సాహెబ్ అంత్య‌క్రియ‌ల్లో అంద‌రు అభిమానులు పాల్గొనాల‌ని కోరారు.

చ‌ద‌వండి :  grama ward Sachivalayam : రెవెన్యూ చేతికి స‌చివాల‌యం వ్య‌వ‌స్థ ప‌గ్గాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *