Munugode By Elections 2022

Munugode By Elections 2022: నా త్యాగం మున‌గోడు అభివృద్ధికి శ్రీ‌కారమంటున్న రాజ‌గోపాల్ రెడ్డి!

Telangana
Share link

Munugode By Elections 2022: నేను మున‌గోడు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నాను. నేను చేసిన త్యాగం వ‌ల్లే మున‌గోడు అభివృద్ధి జ‌ర‌గ‌నుంది. అంటూ కాంగ్రెస్ పార్టీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన మున‌గోడు ప‌ట్ట‌ణ కేంద్రంలో మీడియా స‌మావేశంలో టిఆర్ఎస్ పార్టీపైన‌, కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు.

మునుగోడు ప్ర‌జ‌ల కోస‌మే తాను పోరాడుతున్నాన‌ని చెప్పారు. Munugode ప్ర‌జ‌ల అభిప్రాయం, అంగీకారంతోనే రాజీనామా చేశాన‌ని మీడియా ఎదుట Komatireddy Raj Gopal Reddy అన్నారు. ఈ నెల (ఆగ‌ష్టు 2022) 21న మున‌గోడు లో భారీ బ‌హిరంగ స‌భ పెట్టి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స‌మ‌క్షంలో BJP లో చేర‌బోతున్న‌ట్టు బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.

Munugode By Elections 2022 | మునుగోడుకు కేసీఆర్ ఏం చేశారు?

మీడియా స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మున‌గోడుకు సీఎం కేసీఆర్ ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మునుగోడు ఉపఎన్నిక చారిత్ర‌క తీర్పుతో సీఎం కేసీఆర్ ప‌త‌నం ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆరోపించారు. మున‌గోడుకు ఉపఎన్నిక వ‌చ్చింది కాబ‌ట్టి సీఎం కేసీఆర్ 20వ తేదీన‌ ఇక్క‌డ‌కు వ‌స్తున్నార‌ని, లేక‌పోతే వ‌చ్చే వారేనా? అస‌లు ఎప్పుడైనా మునుగోడు గురించి ఏ స‌భ‌లోనైనా సీఎం మాట్లాడారా? అంటూ రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గానికి సీఎం KCR వెళ్లిన దాఖ‌లాలు లేవ‌ని, కానీ ఇప్పుడు ఇక్క‌డ‌కు వ‌స్తున్నార‌ని అన్నారు. తాను రాజీనామా చేయ‌డం వ‌ల్లే కేసీఆర్ ఫామ్‌హౌస్ నుండి బ‌య‌ట‌కు వస్తున్నార‌ని ఆరోపించారు.

డ‌బ్బుల కోసం అమ్ముడు పోలేదు!

రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజ‌కీయాల‌ను అడ్డం పెట్టుకుని కాంట్రాక్టుల కోసం, డ‌బ్బుల కోసం అమ్ముడు పోలేద‌ని ఈ విష‌యం మునుగోడు ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని అన్నారు. రాజ‌కీయాల్లోకి తాను రాక ముందు వ్యాపార‌వేత్త‌ను అని, రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి పేద‌ల‌కు సాయం చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. మునుగోడు అభివృద్ధి జ‌ర‌గాలంటే తాను రాజీనామా చేయాల‌న్న చ‌ర్చ మునుగోడు ప్ర‌జ‌ల్లో జ‌రిగిన త‌ర్వాత‌నే మెజార్టీ ప్ర‌జ‌ల అభిప్రాయం తీసుకుని రాజీనామా చేశాన‌ని అన్నారు. తాను గెలిస్తే పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు వ‌స్తాయ‌ని, రోడ్డు వేస్తార‌ని, అభివృద్ధి కోసం స‌ర్పంచ్‌ల‌కు నిధులు వ‌స్తాయ‌ని అన్నారు.

See also  new districts updates: రాయ‌ల‌సీమ‌లోకి వ‌చ్చిన స‌ముద్రం! కొత్త జిల్లాల‌ ఏర్పాటులో మారిన లెక్క‌లు!

Leave a Reply

Your email address will not be published.