Seethakka | ములుగు MLA సీతక్క గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోవిందారావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో 42 మందికి కళ్యాణ Laxmi చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేద ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని సూచించారు. ప్రతి ఒక్క రూపాయ వృథా చెయ్యకూడదని లబ్ధిదారులను ఉద్ధేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు-మన బడిలో Seethakka
Mulugu మండలం అబ్బాపూర్ గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మన ఊరు-మన badu ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు Seethakka. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తే విద్యార్థులు ప్రైవేటు పాఠశాల వైపు వెళ్లకుండా చూడొచ్చని, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజల మీద ఉందని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ ప్రభుత్వ ఉపాధ్యాయులు తో పాటు స్థానిక సర్పంచ్ గండి కల్పన కూమార్, సహకార సంఘం ఛైర్మన్ బొక్క సత్తి రెడ్డి, వైస్ చైర్మన్ మర్రి రాజు, ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

