Multani mitti face pack | ఈ కాలంలో చర్మాన్ని హాయిగా ఉంచే పూతల్లో ముల్తానీమట్టితో చేసినవి కీలకం. చర్మాన్ని సేదదీర్చి..మెరిపించే ముల్తాన్నీ మట్టి పూతలేమిటో చూద్దాం..
Multani mitti face pack
ఓ గిన్నెలో రెండు మూడు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకోవాలి. అందులో టేబుల్ స్పూన్ చొప్పున పెరుగూ, కీరదోస తురుమూ, రెంచు చెంచాల సెనగపిండీ వేసుకుని బాగా కలపాలి. తరువాత పాలు పోసుకుంటూ మెత్తని మిశ్రమంగా చేకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకూ(face pack) పట్టించాలి. 20 నిమిషాల తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ పూత చర్మాన్ని మెరిపిస్తుంది.
బ్లాక్‌హెడ్స్ ఇబ్బంది పెడుతుంటే, రెండు టేబుల్ స్పూన్ల Multani mitti, టేబుల్ స్పూన్ పెరుగూ, ఒకటిన్నర చెంచాల నిమ్మరసం, చిటికెడు పసుపూ తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడకూ పూతలా వేసుకొని బాగా ఆరనివ్వాలి. తరువాత తడి చేత్తో రుద్దుకుంటూ కడిగేసుకుంటే చాలు.
ఎండ వల్ల చర్మం రంగు మారుతుంది. అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీమట్టితో అంతే మోతాదులో బంగాలదుంప గుజ్జును కలిపాలి. సమస్య ఉన్న చోట పూత(face pack)లా వేయాలి. ఇది బాగా ఆరాక కడిగేసుకుంటే చాలు. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కొబ్బరినీళ్లూ, పావు టేబుల్‌స్పూను చక్కెర వేసుకొని అన్నింటినీ బాగా కలపాలి. ఆ తరువాత ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే టాన్ ఇట్టే తగ్గిపోతుంది.
ఓ గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్ స్పూన్ల Multani mitti, కాసిని నీళ్లు పోసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఇరువై నుంచి 25 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మం బిగుతుగా తయారవుతుంది.
ఎండాకాలమైనా కొందరి చర్మం పొడిబారినట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీమట్టితో టేబుల్ స్పూను నిమ్మరసం, చెంచా గులాబీనీరు చేర్చి బాగా కలిపి పూతలా వేసుకోవాలి. తరువాత గంట తరువాత కడిగేసుకుంటే సరిపోతుంది.

Multani mitti face pack: మార్కెట్లో ముల్తానీ మట్టి పౌడర్ అందుబాటులో ఉంది. 50 గ్రాములు రూ.56 చొప్పున 100 గ్రాములు 117-126 చొప్పున, 150 గ్రాములు 224 చొప్పున అందుబాటులో ఉంది. నేచురల్ ముల్తాన్నీ మట్టి రూ.499 ధర ఉండగా, ఆర్గానిక్ ప్యూర్ (అమెజాన్) రూ.148 ధరకూ అందుబాటులో ఉంది. ఎలాంటి కెమికల్ కలపని మంచి ముల్తానీ మట్టిని ఎంచుకొని జాగ్రత్తగా ఉపయోగించాలి.