mulberry

Mulberry : మ‌ల్బ‌రీ పండ్ల ఉప‌యోగాలు తెలుసుకుంటే తిన‌కుండా ఉండ‌లేరు!

Health Tips

Mulberry : రుతువుల‌ను బ‌ట్టి ల‌భించే పండ్ల‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిది. అందులో ముఖ్యంగా బెర్రీ ఒక‌టి. బెర్రీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని అంటారు. ఈ పండ్లు కేన్స‌ర్ల‌ను సైతం అడ్డుకుంటాయ‌ని చెబుతుంటారు. వీటిల్లో ల‌భించే అన్ని ర‌కాలుమ‌న ద‌గ్గ‌ర పెర‌గ‌వు. కానీ మ‌ల్బ‌రీ చ‌క్క‌గా పెరుగుతుంది. అయితే వీటి గురించి అంద‌రికీ తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ పండ్ల గురించి అంత శ్ర‌ద్ధ తీసుకోరు.

Mulberry పండ్ల‌లో పోష‌క విలువ‌ల‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. మ‌ల్బ‌రీ పండ్ల‌లో ఐర‌న్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. క‌నుక ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారికి ఇవి మంచి ఔష‌ధంలా ప‌ని చేస్తాయి. ఈ చెట్లు వేగంగా పెరుగుతాయి. క‌నుక బాల్కానీల్లో, మిద్దె తోట‌లుగా పెంచుకోవ‌చ్చు. పుల్ల‌పుల్ల‌గా, తియ్య తియ్య‌ని రుచి క‌లిగి ఉండే మ‌ల్బ‌రీ పండ్ల‌ను నేరుగా తిన‌వ‌చ్చు.

వీటితో పండ్ల ర‌సాలు, జామ్‌లు త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పండ్ల‌ను మ‌రిగించి టీ రూపంలో కొంద‌రు తాగుతారు. పెరుగులో వేసుకుని కూడా తింటారు. ఐస్‌క్రీమ్స్ Ice creams, త‌యారీలోనూ మ‌ల్బ‌రీ పండ్ల‌ను వాడ‌తారు. దోర‌గా ఉన్న‌వాటితో ప‌చ్చ‌డి చేస్తారు కొంత మంది.

Mulberry : మ‌ల్బ‌రీ పండ్ల ప్ర‌యోజ‌నాలు

మ‌ల్బ‌రీ పండ్లు మోర‌స్ Mores, జాతికి చెందిన‌వి. తెలుగులో ఈ పండ్ల‌ను కంబాలి పండు అంటారు. కాయ‌లు ప‌క్వానికి వ‌చ్చే స‌మ‌యంలో తెలుపు, ఎరుపు, న‌లుపూ, నీలం, ఊదా..ఇలా ప‌లు రంగులు క‌లిగి ఉంటాయి. న‌లుపు, తెలుపు ర‌కాలు మ‌న ద‌గ్గ‌ర ఎక్కువ‌గా పండుతాయి. న‌లుపూ, తెలుపూ రంగుల్లో పొడ‌వాటి కాయ‌లు కూడా ఉంటాయి.

ఇవి ఎక్కువుగా హిమాల‌య ప్రాంతంలో పెరుగుతాయి. తెల్ల‌ని పండ్లు కాసే చెట్లు ఎక్కువ‌గా ప‌ట్టు పురుగుల కోసం పెంచుతారు. ఈ పండ్లు తిన తిన‌వ‌చ్చు. ఆకుల్ని ప‌శువుల దాణాగా వాడుకోవ‌చ్చు. బెర‌డుని, వేళ్ల‌ను సంప్ర‌దాయ వైద్యంలో ఉప‌యోగిస్తారు.

Mulberry పండ్లు ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించ‌డం ద్వారా కేన్స‌ర్ Cancer, క‌ణాల పెరుగుద‌ల‌ని నియంత్రిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లూవ‌నాయిడ్లు, ఆల్క‌లాయిడ్లు, ఫినాలిక్ ఆమ్లాలు, విట‌మిన్ సి, ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్‌, విట‌మిన్ ఇ, కెలు కూడా ల‌భిస్తాయి. వీటి ఔష‌ధ గుణాలు ర‌క్తంలో గ్లూకోజ్ నిల్వ‌ల్నీ, కొలెస్ట్రాల్ నిల్వ‌ల్నీ త‌గ్గిస్తాయి.

అందువ‌ల్ల ఈ పండ్లు స‌ప్లిమెంట్ల రూపంలోనూ ల‌భిస్తాయి.వీటి ఆకుల్ని టీ రూపంలో తీసుకుంటే కొలెస్ట్రాల్ త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. క‌మ‌లా పండ్ల‌లో కంటే మ‌ల్జ‌రీ పండ్ల‌లో విట‌మిన్ సి ఎక్కువ‌. ప్రోటీన్ శాతం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. వీటిలో ఉండే ప్లేవ‌నాయిడ్లు వ‌య‌సుతో పాటు వ‌చ్చే మెద‌డు, కంటి న‌రాల క్షీణ‌త‌ను త‌గ్గిస్తాయి. అల్జీమ‌ర్స్‌ని నిరోధించే అద్భుత మెడిసిన్ మ‌ల్బ‌రీ అంటున్నారు ప‌రిశోధ‌కులు.

mulberry
తెల్ల‌ని మ‌ల్బ‌రీ పండ్లు

చిన్న‌వ‌య‌సులో జుట్టు తెల్ల‌బడుతున్నా, చ‌ర్మం skin, ముడ‌త‌లు ప‌డుతున్నా Mulberry ర‌సం తాగితే మంచి ఫ‌లితాలుంటాయి. ఈ పండ్ల ర‌సం తాగితే విట‌మిన్ ఎ, ఇ లోపంతో బాధ‌ప‌డే వారికి ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది. త‌ద్వారా చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఎన్నో విట‌మిన్లు, ఔష‌ధ విలువ‌లున్న మ‌ల్బ‌రీ చెట్ల‌ను ఇంటి పెరిటిలో సుల‌భంగా పెంచుకోవ‌చ్చు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *