Mudiraj Sangam : మంత్రి ఈటెల రాజేందర్‌పై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని ఖమ్మంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముదిరాజ్ బిడ్డలను అణగద్రొక్కే కుట్రలో భాగంగా ఈటెలపై లేనిపోని అసత్య ప్రచారాలు కల్పిస్తున్నారని వారు ఆరోపించారు.
Mudiraj Sangam : khammam : తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌పై అసత్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఖమ్మం జిల్లా ముదిరాజ్ సంఘం తెలిపింది. ఆదివారం ఖమ్మం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో జోత్యిరావు పూలే విగ్రహం ఎదుట తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు డాక్టర్ పాపారావు ముదిరాజ్ , జిల్లా అధ్యక్షులు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్ ముదిరాజ్, ముదిరాజ్ మురళి, జిల్లా నాయకులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈటెల రాజేందర్‌పై వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు భూదందా విషయాలను ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేని యెడల రానున్న రోజుల్లో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మదిరాజులను అణగదొక్కాలనే నెపంతో జరుగుతున్న కుట్రలో భాగంగా భావిస్తూ దీనిని యావత్ తెలంగాణ మొత్తం ఖండిస్తుందన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా ఈటెల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.


జనవేదిక ఆధ్వర్యంలో నిరసన
మరోవైపు ఖమ్మం నగరంలోని తెలంగాణ జనవేదిక ఆధ్వర్యంలో జెడ్పీ అంబేద్కర్ సెంటర్లో నల్లజెండాలు, ప్లకార్డులతో నిరన ప్రదర్శన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజంగా నిజాయితీ ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులు అందరిపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ జన వేదిక రాష్ట్ర కన్వీనర్ వెంకన్న డిమాండ్ చేశారు. పథకం ప్రకారమే లీడర్లను దెబ్బ తీసేందుకు అంశాన్ని అవకాశంగా తీసుకున్నారని ఆరోపించారు. నిజాయతీ పరుడు, నీతిమంతుడు మంత్రి ఈటల రాజేందర్ ప్రాచుర్యం పొందారని అన్నారు.


ఖమ్మం జిల్లా నుంచే చర్యలకు ఉపక్రమించాలి
మరో వైపు జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పైనా అనేక ఆరోపణలు వినిపించాయని, అవినీతిని రూపుమాపాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి లో నిజంగా ఉంటే ఖమ్మం జిల్లా నుంచే చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కావాలని ఈటలను బలిపశువుగా మార్చారని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. నిజాయతీగా ఉన్న మంత్రి ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించడం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కూడా సిగ్గు చేటుగా ఉందని దుయ్యబట్టారు.


తొలుత తెలంగాన జన వేదిక ఆధ్వర్యంలో పాత బస్టాంట్ ప్రాంత నుంచి వైరా రోడ్డు మీదుగా జిల్లా పరిషత్ సెంటర్‌కు చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో బానోతు బద్రూ నాయక్, పల్లెపు సోమరాజు, నకిరేకంటి సంజీవయ్య, నాగేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, రాజు, వీరన్న, అఖిల్, గోపాల్, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం