Land rover series 3

MS Dhoni buys 1971 Land rover series 3: ధోనీ గ్యారేజీలో పాత కాల‌పు కారు.. దాని రేంజే వేరులే?

Special Stories

MS Dhoni buys 1971 Land rover series 3 మ‌హేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా, ఆట‌గాడిగా ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ధోనికి క్రికెట్‌తో పాటు బైక్‌ల‌న్నా, కార్లు అన్నా ఎంత పిచ్చో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌దుల సంఖ్య‌లో కార్లు త‌న గ్యారేజ్‌లో ఇప్ప‌టికే ఉన్నాయి. తాజాగా ప్ర‌పంచంలోనే అత్యున్న‌త వాహ‌నం అత‌ని కార్ల జాబితాలో చేరింది. Big boy toyz Auctions ఇటీవ‌ల త‌న ఫ్లాట్ ఫాంలో పాత కాల‌పు కార్ల ఆన్‌లైన్ వేలాన్ని వేసింది.

పాత కార్ల‌ల‌లో ఒక‌టైన 1971 land Rover Series 3 Vintage car కారుపై భార‌త్ క్రికెట్ మాజీ కెఫ్టెన్ ఎం.ఎస్ ధోనీ మ‌న‌సు ప‌డిందట‌. వేలంలో పోటీ ప‌డి మ‌రీ ఆ కారును సొంతం చేసుకున్నార‌ట‌. ఇప్ప‌టికే ధోనీ గ్యారేజ్లో ఎన్నో కొత్త కార్లు ఉన్నాయ‌ట. అందులో పాత కాల‌పు కార్లు కూడా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కార్లు అన్నా ఇతర వాహ‌నాలు అన్నా ఇష్ట‌ప‌డే ధోనీ ల్యాండ్ రోవ‌ర్‌ను కొనేశారు. ఈ కారు 1971 నుంచి 1985 కాలంలో అత్యంత ప్ర‌జాధార‌ణ పొందిన కారుల‌లో ఒక‌టిగా నిలిచింది. దాదాపు 4 ల‌క్ష‌ల కార్ల‌ను ఆ స‌మ‌యంలో కంపెనీ త‌యారు చేసింద‌ట‌. ల్యాండ్ రోవ‌ర్ వెహిక‌ల్ భార‌త్‌లో అరుదైన వాహ‌నంగా చెప్ప‌వచ్చు. ఈ మోడ‌ల్ వాహ‌నం ప‌సుపు రంగులో ఎంతో ఆక‌ట్టుకుంటుంది. ఆ స‌మ‌యంలో ఉన్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఈ వెహిక‌ల్‌ను త‌యారు చేశారంట‌. ఇందులో ఫ్యూచర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *