MPDO suicide attempt in Jakranpally | ఎంపిడిఓ ఆత్మహత్యాయత్నం
MPDO suicide attempt in Jakranpally | ఎంపిడిఓ ఆత్మహత్యాయత్నంNizamabad : ఎంపిడిఓ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. జక్రాన్పల్లి మండలంలో ఎంపిడిఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారతిని అధికారులు కొద్ది రోజుల క్రితం డిప్యూటేషన్ మీద సిరికొండ కు బదిలీ చేశారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా తాను సిరికొండ వెళ్లలేనని, కొన్ని రోజుల వరకు డిప్యూటేషన్ నిలిపివేయాలని ఆమె పలుమార్లు అధికారులను కోరినట్టు తెలుస్తోంది.
ఇందుకు అధికారులు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన ఎంపిడిఓ భారతి తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం నిద్ర మాత్రలు మింగారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు మొదట ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. అయితే ఎంపిడిఓ భారతి డిప్యూటేషన్ విషయంలోనే మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఇది చదవండి: కామధేను పూజలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి