Nagarjuna Sagar by election : టిఆర్ఎస్ కారొచ్చింది కూడా జానారెడ్డి వేసిన రోడ్డుపైనే!
Nagarjuna Sagar by election : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతుంది. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రచారాలు నియోజకవర్గంలో హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి ఎంపి రేవంత్ రెడ్డి గురువారం వచ్చారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్పై విమర్శలు చేశారు. రోడ్ షోలో ఆయన ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు ఒక సారి ఆలోచించాలని, టిఆర్ఎస్ కు ఓటేస్తే అమ్ముడుపోయి నోళ్లమవుతామని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సీనియర్ నాయకులు జానా రెడ్డి తరపున ప్రచారానికి హాజరయ్యారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్కు ఓటేస్తే అభివృద్ధికి పట్టం కట్టిన వాళ్లం కాదని తెలిపారు. జానా రెడ్డి గెలుపు తెలంగాణ సమాజానికి అవసరం ఉందని అన్నారు. జానారెడ్డికి పదవులు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. ఇప్పటికే తన జీవిత కాలంలో ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించారని, అలా ప్రజలకు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు.


జానా రెడ్డి మొదటి సమితి ప్రెసిడెంట్‌గా, 7 సార్లు ఎమ్మెల్యేగా, 17 సంవత్సరాలు మంత్రిగా, 30 సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా అని పదువులు చూశారని అన్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ జానారెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెబితే అప్పట్లో నాకు వద్దని అన్నారని గుర్తు చేశారు. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దూ..సచ్చిపోతున్న అమరవీరులకు, నా తెలంగాణ బిడ్డలకు నాకు తెలంగాణ రాష్ట్రం కావాలి. అని గొప్ప త్యాగం చేసిన నాయకుడు జానా రెడ్డి అని పేర్కొన్నారు. ఈ రోజు అందరికీ కనిపించే జానారెడ్డి విలువ మనకు తెలియకపోవచ్చని కానీ, ఈ రోజు తెలంగాణలో తండాల్లోనూ, గూడెల్లాలోనూ, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి మా నాయకుడు జానారెడ్డి అని ఒక్కసారి చెబితే, కూర్చోబెట్టి చాయ్ అందిస్తారని తెలిపారు.
ఇవాళ కేసీఆర్ ఒక దొంగ అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ నాయుకుడును ఎవరూ నమ్మే పరిస్థితులోల్లేరని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే బాల్క్ సుమన్ పై ఫైర్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు జానారెడ్డి నీళ్లు ఇచ్చారని తెలిపారు. 35 వేల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారని, 1000 కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో రోడ్లు వేశారని, చదువుకునే బడులను, గుడులను జానారెడ్డి హయాంలో నిర్మించినవేనని తెలిపారు. అంతెందుకు ఆ టిఆర్ఎస్ నాయకుడు వేసుకొచ్చిన కారు వచ్చిన రోడ్డు జానారెడ్డి వేసిందనేని పేర్కొన్నారు.


నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి చేసిన అభివృద్ధిపై తాము చర్చలకు సిద్ధమని, బాల్క సుమన్, టిఆర్ఎస్ నాయకులు సిద్ధమేనా అని ప్రశ్నించారు. జానారెడ్డిని విమర్శించే స్థాయి బాల్క సుమన్‌కు లేదని హెచ్చరించారు. బాల్క సుమన్ తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు ఏం చేశారో తెలపాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చారా? పింఛన్లు ఇచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా? రుణమాఫీ చేశారా? లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ సమస్యలపై బాల్క సుమన్‌ను తన నియోజకవర్గంలో అంగీ పట్టి నిలదీస్తామని ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం