MP Raghu Rama Krishna Raju Tweet: ఎంపీ రఘు రామకృష్ణ రాజు పందెం కోడి ఫొటో వైరల్
MP Raghu Rama Krishna Raju Tweet: ఎంపీ రఘు రామకృష్ణ రాజు పందెం కోడి ఫొటో వైరల్Narsapuram : నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణ రాజు సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త లుక్లో కనిపించారు. ఈ సందర్భంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఒక పందెం కోడిని పట్టుకొని ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఎప్పుడూ సోషల్మీడియాలో రాజకీయ పార్టీల గొడవల వల్ల అనేక సార్లు సెల్ఫీ వీడియోల ద్వారా ముందుకు వచ్చే ఎంపి రఘురామ కృష్ణ రాజు ఈ సారి సంక్రాంతి పండుగకు ట్విట్టర్ ద్వారా చాలా సంతోషంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ట్విట్టర్లో ఒక పందెం కోడిని పట్టుకొని ఫొటో దిగి షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. రఘు రామ కృష్ణ రాజు షేర్ చేసిన తన ఫొటోకు నెటిజన్లు, అభిమానులు ఫన్నీగా ర్వీట్విట్ చేస్తున్నారు.
అందులో ఫన్నీ ట్విట్లు ఇలా..
– రాజు గారి పుంజు మీద ఒక ఎంపీ సీట్ పందెం.. బరిలో దిగే వాళ్లు రావాలి.
– తగ్గేటట్టు లేరుగా సార్, కానీవ్వండి ఏది అయితే అది అవుతుంది. ఆగేదే లేదు పండగ సంబురాలు.
– కోడి ముఖ్యం కాదు సార్..కోడి కత్తి ముఖ్యం.
-ఏదురొచ్చే పుంజే లేదు.
-సిత్తరాల సిరపడు
– రండి రాజుగారు మా పందెం 6093 రూపాయలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలను ప్రభుత్వం నిషేధించింది. కరోనా ప్రభావంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కోడి పందాలను నిర్వహించడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోడి పందాలు ఎలాగైనా వేయాలని నిర్ణయించుకున్న కొందరు ఆటగాళ్లు కోడి పందాల బరులు తయారు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు నిర్వహించేందుకు వీలు లేదంటూ పోలీసులు ఆ కోడి పందాల బరులను ట్రాక్టర్ల ద్వారా దున్నించిన ఘటనలు గత రెండ్రోజులుగా జరిగాయి. సాంప్రదాయపద్ధంగా నిర్వహించుకునే కోడి పందాలను నిషేధించడంతో బెట్టింగు రాయుళ్లు నిరాశ చెందారు. ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల బెట్టింగ్ లలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా కోడి పందాలలో బెట్టింగ్ లు వేసేందుకు సుదూర ప్రయాణం చేసి వస్తుంటారు. ఈ ఏడాది మాత్రం కరోనా ప్రభావం అందరిపైనా చూపించడంతో పాటు కోడి పందాలను కూడా ప్రభుత్వం నిషేధించడంతో పండుగ వాతావరణం ఇళ్లకే పరిమితమైంది.
ఇది చదవండి : క్షమించమని ప్రజలను కోరిన చంద్రబాబు నాయుడు