mp raghu rama krishna raju: జైభీమ్ సినిమాలో వేధించిన‌ట్టే న‌న్ను కూడా వేధించారు!

mp raghu rama krishna raju న్యూఢిల్లీ: క‌స్ట‌డీలో త‌న‌ను హింసించ‌డంపై ద‌ర్యాప్తు కోరినా ఇప్ప‌టి వ‌ర‌కు దిక్కులేద‌ని న‌ర‌సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణరాజు అన్నారు. జైభీమ్ సినిమాలో చూపించినట్టే త‌న‌ను కూడా పోలీసులు హింసించార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌స్ట‌డీలో త‌న‌ను హింసించ‌డంపై ద‌ర్యాప్తు కోరినా ఇప్ప‌టి వ‌ర‌కు దిక్కులేద‌ని వాపోయారు. ఎంపీకే దిక్కు లేదంటే లోపం ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు. కేంద్రం పిలుపుతో చాలా రాష్ట్రాలు పెట్రో ప‌న్నుల‌ను త‌గ్గించాయ‌ని, ఆ దిశ‌గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చ‌ర్య‌లు (mp raghu rama krishna raju) తీసుకోక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.

ప‌క్క రాష్ట్రాల‌తో పోలిస్తే ఇంధ‌నం రేట్లు, స్కూలు ఫీజులు, ఇంటి ప‌న్నులు మ‌న రాష్ట్రంలోనే ఎక్కువుగా ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్ష నేత హోదాలో జ‌గ‌న్ మాట్లాడార‌ని గుర్తు చేశారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చెప్పిన మాట‌లు ఇప్పుడు అమ‌లువుతున్నాయ‌ని ఎద్దేవా చేశారు. గ‌తంలో ఆయ‌న చెప్పిన‌ట్టు యానాం, క‌ర్ణాట‌క‌, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా ఏపీ కంటే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌క్కువుగా ఉన్నాయ‌న్నారు. అప్పుడు ప్ర‌జ‌ల కోసం ధ‌ర‌లు త‌గ్గించాల‌ని కోరామ‌న్నారు. ఇప్పుడు అమ‌లు చేసేందుకు వెనుకాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

ఇంధ‌న ధ‌ర‌ల త‌గ్గింపు విష‌యంలో క‌ర్ణాట‌క సీఎం బొమ్మై గురించి అంద‌రూ గొప్ప‌గా చెప్పుకుంటున్నార‌ని, అదే త‌ర‌హాలో ఏపీలో కూడా రేట్లు త‌గ్గించి దేశ‌వ్యాప్తంగా జ‌గ‌న్ గురించి అంద‌రూ గొప్ప‌గా చెప్పుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. మ‌ద్యం షాపులో డిజిట‌ల్ చెల్లింపులు ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని ర‌ఘురామ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం న‌డిపే మ‌ద్యం షాపుల్లో డిజిట‌ల్ చెల్లింపుల విష‌యంపై ప్ర‌ధానికి లేఖ రాశాన‌ని వెల్ల‌డించారు. మ‌ద్యం షాపుల నుంచి వ‌చ్చే డ‌బ్బులు ఎప్ప‌టిక‌ప్పుడు ఎవ‌రి జేబుల్లోకి వెళ్తున్నాయ‌ని ఆ డ‌బ్బు ఎవ‌రికో ఇస్తున్నార‌ని విమ‌ర్శించారు. మ‌ద్యం షాపుల నుంచి న‌గ‌దు రూపేణా వ‌సూలు చేస్తున్న దానిలో ప్ర‌భుత్వానికి ఎంత జ‌మ చేస్తున్నారో లెక్క తేల‌డం లేద‌న్నారు. త‌క్ష‌ణ‌మే న‌గ‌దు వ‌సూలు ఆపి డిజిట‌ల్ ప‌ద్థ‌తిని ప్ర‌వేశ‌పెట్టాల‌న్నారు.

Share link

Leave a Comment