Mouth bad Smell Problem | పైకి చాలా నీట్ గా కనిపిస్తారు. కానీ నోరు తెరిస్తే పక్కవాళ్లు పారిపోయే పరిస్థితి. నోటి దుర్వాసన ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీనివల్ల నలుగురిలో తిరగాలన్నా, మాట్లాడాలన్నా ఇబ్బందే. పరువు సమస్యగా మారుతున్న నోటి దుర్వాసన నుంచి ఇలా విముక్తి పొందండి!
Mouth bad Smell Problem
ప్రతి 100 మందిలో 25 శాతం మందికి ఇన్ఫెక్షన్ల కారణంగా నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. టాన్సిల్స్ వద్ద ఉండే స్టోన్‌లో బాక్టీరియా, ఇతర వ్యర్థాలు పేరుకుపోయి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కాబట్టి ఇన్ఫెక్షన్ల గురించి తెలుసుకునేందుకు డెంటిస్ట్‌ను సంప్రదించాలి. దంతాలను నాణ్యమైన టూత్‌పేస్ట్‌తోనే శుభ్రపరచుకోవాలి. మౌత్ వాష్ వాడటం, నాలుకను శుభ్రం ఉంచుకోవడం వంటివి రెగ్యులర్‌గా ఫాలో అయితే దుర్వాసన సులువుగా తగ్గుతుంది.
శుభ్రంగా ఉన్న బట్ట ముక్కతో టాన్సిల్స్, స్టోన్స్‌ను తొలగించుకోవాలి. దగ్గినా, తుమ్మినా టాన్సిల్ స్టోన్స్ బయటకు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి దగ్గు, తుమ్ములను ఆపుకోవద్దు. పచ్చి వెల్లుల్లి రేకుల్ని తినడం ద్వారా నోటి దుర్వాసన తగ్గించుకోవచ్చు. ఇవి నోటిలోని హానికర బ్యాక్టీరియాలను బయటకు పంపిస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటిని పుక్కిలిస్తే టాన్సిల్స్ స్టోన్స్ బాధ తగ్గిపోతుంది. ఫలితంగా నోటి దుర్వాసన తొలగిపోతుంది.