Moturu Apswrs School | కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మోటూరు గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పడిపోవడం కలకలం సృష్టించింది. మోటూరు గురుకుల పాఠశాల ప్రాంగణంలో తొమ్మిది మంది బాలికలు గురువారం అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. పాఠశాల ప్రాంగణంలోనే 6,7వ తరగతుల బాలికలు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే బాలికలను హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పలువురి బాలికలకు వైద్యులు ఆక్సిజన్ అందిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో వ్యాయామం చేస్తుండగానే బాలికలు స్పృహ తప్పారంటు గురుకుల పాఠశాల(Moturu Apswrs School) అధ్యాపకులు చెబుతున్నారు. రాత్రి తిన్న ఆహారం కారణంగానే తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!