Motorcycle Fuel Tank: బైక్ ఇంజ‌న్ త‌యారీ ఇలా!

Motorcycle Fuel Tank: నిత్యం మ‌ధ్య త‌ర‌గతి కుటుంబాల వారు త‌మ అవ‌స‌రాల‌ను తీర్చుకునేదుకు త‌ప్ప‌నిస‌రి వాహ‌నం ద్విచ‌క్ర (Two Wheeler) వాహ‌నం. ఇప్పుడున్న కాలంలో ఏదో ఒక ద్విచ‌క్ర వాహ‌నం, బైక్ లేని ఇల్లు లేదూ, ఊరూ లేదు. పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా కింద ప‌డో మీద ప‌డో బండి లేకుండా మాత్రం బ‌య‌ట‌కు వెళ్లం. అలా Bike తో అనుబంధం ముడిప‌డి ఉంటుంది.

ఇప్పుడు మ‌నం బైక్‌ల‌కు Engine ట్యాంక్‌లు ఎలా త‌యారు చేస్తారో తెలుసుకుందాం. బైక్ ట్యాంక్ త‌యారీ వెనుక వారి క‌ష్టం ఎంత ఉందో, ఒక Tank త‌యారు చేయ‌డానికి ఎంత‌లా శ్ర‌మిస్తారో ఇప్పుడు చూడ‌వ‌చ్చు.

Motorcycle Fuel Tank: మోట‌ర్ సైకిల్ ఇంజిన్ త‌యారి ఇలా చేస్తారు!

బైక్ ఇంజిన్ ట్యాంక్ త‌యారు చేసే ముందు ఒక మందమైన ఇనుప రేకుల‌ను తీసుకుంటారు. వాటిని కొల‌త వేసి ఇంజిన్ ట్యాంకుకు స‌రిప‌డినంత క‌ట్ చేస్తారు.
అలా క‌ట్ చేసిన ఇనుప రేకుల‌ను ఒక మిష‌న్‌లో ట్యాంక్ కు కావాల్సిన ఆకారాన్ని వ‌చ్చేలా త‌యారు చేస్తారు. ఇలా అన్నీ ఒకే సైజులో వ‌చ్చేలా చేస్తారు.
Motorcycle Fuel Tank: మిష‌న్‌లో నొక్కిన త‌ర్వాత ట్యాంక్ ఆకారంలో ఇలా ఉంటుంది. వీటిని మ‌రో మిష‌న్ ద్వారా క‌ట్ చేస్తారు.
అలా క‌ట్ చేసిన త‌ర్వాత పూర్తిగా బైక్ ఇంజ‌న్ ట్యాంక్ రావ‌డానికి ఇలా మ‌రో మిష‌న‌ల్ తో నొక్కుతారు.
ఇప్పుడు అస‌లైన ట్యాంక్ రూపం వ‌చ్చింది. ఇలా ప్ర‌తి ట్యాంక్‌ను ఒకే సైజులో వ‌చ్చేలా మిష‌న్ ద్వారా త‌యారు చేస్తారు.
అలా త‌యారు చేసిన మోట‌ర్ సైకిల్ ఇంజిన్ ట్యాంక్‌కు పెట్రోల్ పోసేందుకు కావాల్సిన రంధ్రాన్ని మ‌రో మిష‌న్‌లో వేసి నొక్కుతారు. స‌రిగ్గా పెట్రోల్ గ‌న్ స‌రిప‌డేలా క‌ట్ చేస్తారు.
ఇలా పెట్రోల్ పోసేందుకు మిష‌న్ ద్వారా రంధ్రం చేస్తారు. అక్క‌డ వ‌ర‌కు ఇనుప రేకును క‌ట్ చేస్తారు.
ఇంజ‌న్ ట్యాంక్‌కు అమ‌ర్చేందుకు మూతల‌ను విడి భాగాల‌ను త‌యారు చేస్తారు. ఇలా ఒకే సైజులో త‌యారు చేస్తారు.
ఇప్పుడు పైన తెలిపిన మూత‌ల‌ను ట్యాంకుకు స‌రిపోయేలా అమ‌ర్చుతారు. అందుకు ఒక మిష‌న్‌ను ఉప‌యోగిస్తారు.
త‌ర్వాత ఇంజిన్ ట్యాంకు పెట్రోల్ స‌ప్లై అయ్యే గొట్టాన్ని అమ‌ర్చుతారు. అది కింది భాగంలో అమ‌ర్చి వెల్డింగ్ పెడ‌తారు.
50 శాతం పూర్తైన ఇంజ‌న్ ట్యాంక్‌పైన ఎలాంటి గాట్లు ఉన్నా లేకుండా స్మూత్‌గా రావడానికి, చుట్టుప్ర‌క్క‌ల ఉన్న అద‌న‌పు రేకును తొల‌గించ‌డానికి మిష‌న్‌ను ఉప‌యోగిస్తారు.
Motorcycle Fuel Tank: ఇప్పుడు ఇంజ‌న్ భాగం కింద‌న కొన్ని ప‌నిముట్ల‌ను అమ‌ర్చి వెల్డింగ్ పెడ‌తారు. ఇంజ‌న్ ట్యాంకుకు వాడే ప్ర‌తి వ‌స్తువూ ఐర‌న్‌కు సంబంధించిన‌దే.
ఇంజ‌న్ ట్యాంకుపై ఉన్న ఈ వెల్డింగ్ గీత‌ల‌ను తొల‌గించాల్సి ఉంటుంది. ఒక ర‌కంగా ట్యాంక్ మొత్తం పూర్త‌యింద‌ని చెప్ప‌వ‌చ్చు.
ఇంజ‌న్‌పై వెల్డింగ్ గాట్లు తొల‌గించ‌డంతో పాటు చుట్టూ ఇలా ఆకారం రావ‌డానికి మిష‌న్ ద్వారా ట్యాంక్‌ను క‌ట్ చేస్తారు.
చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఇంజ‌న్ ట్యాంక్ త‌యారీలో స్మూత్‌గా వ‌చ్చేందుకు మ‌రో మిష‌న్ ద్వారా ర‌ఫ్ చేస్తారు.
అలా పూర్తైన త‌ర్వాత ఒక్క‌సారి ట్యాంక్‌కు ఏమైనా రంధ్రాలు ఉన్నాయా, ఏమైనా కారుతుందా అనేది వాట‌ర్ ద్వారా చెక్ చేస్తారు.
చెక్ చేసిన అనంత‌రం మంచిగా ఉన్న‌వాటిని పూర్తి ఇంజ‌న్ అయిన త‌ర్వాత ఇలా రంగులు వేయ‌డానికి సిద్ధం చేస్తారు.
చివ‌ర‌గా మ‌నం వాడే Bike Engine త‌యార‌య్యింది. వీటిని బాక్సుల్లో పెట్టి కంపెనీకి త‌ర‌లిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *