motivational story: ఒక వ్యక్తి భగవంతుడా నా జీవిత విలువ ఎంతో తెలుపగలవా? అని అడిగాడు. అప్పుడు భగవంతుడు ఆ వ్యక్తికి ఒక రాయిని ఇచ్చాడు. ఈ రాయి విలువ ఎంతో తెలుసుకొని రా. కానీ దీనికి ఎక్కడా కూడా అమ్మకూడదు అని భగవంతుడు చెప్పి అతన్ని పంపించాడు. ఆ వ్యక్తి ఓ పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్లి ఆ రాయిని తీసుకొని వెళ్లి దీని విలువ ఎంత అని అడిగాడు.
motivational story: నీ విలువ తెలుసుకో!
అయితే ఆ పండ్ల వ్యాపారి ఈ రాయిని తీసుకొని అయ్యా! ఈ రాయికి నేను ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా? అని అడిగాడు. కానీ ఆ వ్యక్తికి దేవుడు చెప్పిన షరతు ఎక్కడా అమ్మకూడదు ఈ రాయిని, అనే విషయం గుర్తుకు వచ్చి ఆ వ్యక్తి పండ్ల వ్యాపారి దగ్గరి నుండి ఏ విషయం చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆ తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరి వెళ్లి ఈ రాయి విలువ ఎంత ఉంటుంది బాబాయ్! అని అడిగాడు.
ఆ రాయి తీసుకున్న కూరగాయల వ్యాపారి, ఈ రాయికి నేను పది కేజీల కూరగాయలు ఇస్తాను బాబూ, నాకు అమ్ముతావా అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు. అమ్మమ నలేదు కదా!. అని ఆ వ్యక్తి కూరగాయల వ్యాపారి దగ్గర నుండి వెళ్లిపోయాడు. తరువాత ఒక బంగారు నగర వ్యాపారి దగ్గరికి వెళ్లాడు. సేటు ఈ రాయి విలువ (Stone Value) ఎంత ఉంటుంది? అని ఆ వ్యక్తి అడిగాడు.
అప్పుడు ఆ బంగారు నగల వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. నేను రూ.50 లక్షలు ఇస్తాను, నాకు అమ్ముతావా? అని అడిగాడు. దేవుడు చెప్పిన విషయం గుర్తు చేసుకొని మళ్లీ ఆ వ్యక్తి నగర వ్యాపారి దగ్గర నుండి వెళ్లిపోసాగాడు. వెంటనే నగల (Jeweler) వ్యాపారి రూ.3 కోట్లు ఇస్తాను అని నాకు ఆ రాయిని అమ్ము అన్నాడు. నగల వ్యాపారి ఆ మాట అన్నాడో లేదో! ఆ వ్యక్తికి కొంచెం లోపల ఆశ కలిగింది.
కానీ ఆ రాయిని అమ్మకూడదు, అని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి ఆ బంగారు నగల వ్యాపారి వద్ద నుండి కూడా వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆ వ్యక్తి ఒక వజ్రాల (Diamonds) వ్యాపారి దగ్గరికి రాయిని తీసుకొని వెళ్లి దీని విలువ ఎంత ఉంటుందని అడిగాడు. అప్పుడు ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి మీకు ఎక్కడిది అండీ ఇంత విలువైన రాయి అని ఆ వ్యక్తిని అడిగాడు.

ఈ రాయిని నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్నా, మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనడం నా వల్ల కాదు అండి, చివరకు ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువ సరిపోదు. అని ఆ వజ్రాల వ్యాపారి ఆ వ్యక్తితో అన్నాడు. ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. నేరుగా ఇక దేవుడి (god) దగ్గరి వచ్చేశాడు. అప్పుడు ఆ రాయిని చూసిన భగవంతుడు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు.
నీ విలువ ఇదే!
motivational story:నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా!. ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారి (Fruit Merchant) దగ్గరికి, కూరగాయల వ్యాపారి, బంగారు నగల వ్యాపారి దగ్గరకు వెళ్లి చూపావు. కానీ వాళ్లు ఇచ్చిన విలువ చూశావా. ఆ విలువ అనేది వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు. కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేక పోయాడు.
నువ్వు కూడా అంతే నాయినా!. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే. నీ జీవితం కూడా వెలకట్టలేనిది, కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు. నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే, అది వారి స్థాయి. కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి. మిత్రమా! నువ్వు కూడా అంతే. నీ విలువ నీదే, ఎందరిలో ఉన్నా నీ విలువ నీకు ఉంటుంది.