motivational story: సింహం ధైర్యానికి చిహ్నం, సాహసానికి గుర్తు, రాజసానికి మార్క్. ఇదే సింహం ఒకానొక సమయంలో గంభీరానికి, అంతకుమించి విజయానికి కూడా చిహ్నంగా చెప్పవచ్చు. సింహం ఈ భూమిపైనే రారాజు, ఎందుకంటే దానికి అపజయం తెలియదు. పరాజయం అనే పదమే దరికి చేరనీయదు. నచ్చింది చేస్తుంది. భయపడకుండా ముందుకు సాగుతుంది. చుట్టూ నక్కలు ఉన్నా, ఏనుగులు ఉన్నా సరే సింహం రాజసంలో ఎలాంటి మార్పు ఉండదు. నడకలో గంభీరం ఏమాత్రమూ మారదు.
అడవిలోని సింహాన్ని చూసి కొన్ని జంతువులు దాక్కుంటాయి. మరికొన్ని జంతువులు పరుగెడుతాయి. ఇక ఏనుగుల గుంపు ఎదురుగా వచ్చి తొండం ఊపినా సరే సింహం తన దారి మాత్రం మార్చుకోదు. అందుకే లయన్ ఆడిట్యూట్(lion Attitude) మనిషికి కూడా ఉంటే విజయం మన వెంట ఉన్నట్టే. సింహం ఆడిట్యూట్ అంటే ప్రత్యేక పంథాలో వెళ్లాలి. గొర్రెలు ఒక లీడర్ గొర్రెనే ఫాలోవుతుంటాయి కదా!. వాటికి మెదడు ఉన్నా సరే ఏ మాత్రమూ ఆలోచించవు. అందుకే గొర్రె కసాయి వాడినే నమ్ముతుందని ఒక సామెత కూడా మనకు తెలిసి ఉంటుంది. కానీ సింహం ఆడిట్యూట్ అలా ఉండదు.
విజయం వైపు తన నడకను కొనసాగిస్తుంది. మీలో సింహం కు ఉన్న ఆడిట్యూట్ మీకు ఉందా? ఉంటే విజయం మీదే. నలుగురు నడిచే దారిలో నువ్వు నడిస్తే నీకు గుర్తింపు ఎప్పటికీ ఉండదు. నీకు అంటూ ఒక ప్రత్యేక దారిని ఎంచుకోవాలి. ఆ దారిలో విజయం వైపు సాగాలి. సింహపు ద్వారంలోకి ఎవ్వరూ వెళ్లడానికి సాహసించరు. అలానే నీ గమ్యం కూడా సింహపు ద్వారంలాగా మార్చుకోవాలి. మనం వెళ్లే దారిలో ఎంతో మంది అవహేళన చేస్తుంటారు, తిడుతుంటారు కానీ సింహంకు అంత పెద్ద చెవులు ఉన్నా సరే వాటిని పట్టించుకోకుండా తన గమ్యం వైపు వెళుతుంది.
సింహం అనుకున్నదే చేస్తుంది. చేయగలిగినదే అనుకుంటుంది. సింహం ఆడిట్యూట్ మీరు కూడా అలవర్చుకోండి. అంటే ధైర్యం, గుండె నిండా బలం. భయం తెలియకూడదు. మనస్సు కూడా గట్టిగా ఉండాలి. మనం ఎంచుకున్న లక్ష్యంపై నిబ్బరంగా గురిపెట్టాలి. నీ బలమేమిటో నీకు మాత్రమే తెలుసు. నీ ధైర్యం ఏమిటో నీ మనస్సు తెలుసు, ఆ శక్తిని కూడా వినియోగించుకో. ప్రతి మనిషిలోనూ సింహంకు ఉన్న గుండె తెగింపు ఉంటుంది. కానీ దానిని సమయానికి తగ్గట్టు బయటకు తీయాలి.
ఆ సమయానికి వాడుకుంటే మీకు తిరుగు ఉండదు. దానికి బయటకు తీయండి. ఎందుకంటే మీకు కూడా సింహంకు ఉన్న తెగింపు ఉన్నది. ఆడిట్యూట్ అంటే? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో, నీ ప్రవర్తన, నీ ధైర్యం, నీ ఆలోచన, నీ సాహసం ఇలా అన్నింటినీ కలగలిపితే నిన్ను ఢీకొనే మనగాడే లేడు. ఒక చిన్న నెగిటివ్ ఆలోచన వచ్చినా, నీలో ఉన్న లైన్ ఆడిట్యూట్ చచ్చిపోతుంది. ఎప్పటికీ దానిని దరి చేరనివ్వొద్దు. చిన్న కష్టానికి వెనుకడుగు వేయవచ్చు. సాహసంతో ముందుకు సాగితే మనల్ని చూసి కష్టాలు కూడా భయపడిపోతాయి.

ముందు వచ్చే విజయం జీవితానికి సరిపడా సంతోషాన్ని తెచ్చి పెడుతుంది. ఆ లయన్ లో ఉన్న ఆడిట్యూట్ను నీలో తయారు చేసుకో. దానిని మంచిగా వాడుకుంటే మంచి జరుగుతుంది. చెడుగా వాడుకుంటే చెడ్డ మార్గమే దిక్కు అవుతుంది. ఒక పని చేసేటప్పుడు నీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఏమన్నా ఏమీ పట్టించుకోకు.(motivational story) విజయం కోసం ప్రయత్నం మొదటు పెట్టు. సాధించే వరకు వదిలి పెట్టకు. ప్రతి కొత్త విషయం నిన్ను గమ్యానికి చేర్చుతుంది. చుట్టూ ఏ శబ్ధం వచ్చినా పట్టించుకోవద్దు. విజయాన్ని ముద్దాడితే సింహపు గర్జన ప్రపంచ మంతా కంపించే విధంగా ఉండాలి నీ మజిలీ. మనల్ని చూస్తే మన వాళ్లు గర్వంగా ఫీలవ్వాలి. సింహాలా కష్టపడండి.. కష్టపడంది ఈ ప్రపంచంలో ఏదీ మన దగ్గరకు రాదు.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?