Motivational Dialogue

Motivational Dialogue : మోటివేష‌న‌ల్ తెలుగు సినిమా డైలాగ్స్‌

motivation-Telugu

Motivational Dialogue : మోటివేష‌న‌ల్ డైలాగ్స్ ప్ర‌తి ఒక్కరికీ న‌చ్చుతాయి. ఈ మోటివేష‌న‌ల్ డైలాగ్స్ మ‌న జీవితంలో జ‌రిగే స‌న్నివేశాల‌ను గుర్తు చేస్తాయి. ప్ర‌తి ఒక్క‌రూ ఈ మోటివేష‌న‌ల్ డైలాగ్స్‌ను చ‌ద‌వండి!


Motivational Dialogue : మోటివేష‌న‌ల్ తెలుగు సినిమా డైలాగ్స్‌

Movie Name : Gaddalakonda Ganesh

ప్ర‌తి అవ‌కాశంలోనూ క‌ష్టం ఉంటుంది.
మ‌నం క‌ష్టం దూరం చేయాల‌నుకుంటాం!
కానీ.. మ‌న‌కు తెలియ‌కుండానే అవ‌కాశం దూర‌మైపోతుంది!
అయినా క‌ష్ట‌ప‌డని డైరెక్ట‌ర్ ఏవ‌ర్రా!
మీ సినిమా జ‌నం చూడాలి..
న‌వ్వాలి…ఏడ‌వాలి..చ‌ప్ప‌ట్టు కొట్టాలి.. విజిలేయాలి!
అంటే.. నీ గుండె త‌డ‌వాలి.
నేను చేసిన త‌ప్పు నువ్వు చేయ‌కు నాన్న‌!
నా మాట విను.
ఈ సారికి అడ్జెస్ట్ అయ్యిపో!

మీరు కాంప్ర‌మైజ్ అవ్వ‌లేదు కాబ‌ట్టి
న‌న్ను కాంప్ర‌మైజ్ అవ్వ‌మంటున్నారు.
అహ‌..అంతేగా బాబాయ్!
నేను కంప్ర‌మైజ్ అవ్వ‌మ‌న‌ట్లేదు.
అడ్జెట్ అవ్వ‌మంటున్నాను.
ఈ ప‌ని మానేసి ఇంకో ప‌ని చేసి బ్ర‌త‌క‌డం కాంప్ర‌మైజ్‌!
ఇదే ప‌నిని ఇంకోలా చేయ‌డం అడ్జెస్మైంట్.


Movie Name : Julai

ఆ రోజు నువ్వు 10,000 వేలు తీసుకు వెళ్ల‌క‌పోయి ఉంటే
ఈ రోజు ఇంట్లో అంద‌రం టీవీలో సినిమా చూస్తూ ఉండే వాళ్లం!
మీ అమ్మ నీకు ఇష్ట‌మైన ప‌కోడీలు చేసి పెడుతూ ఉండేది.
నీ చెల్లెలు అల్ల‌రి చేస్తూ ఉండేది
అదిరా ఐశ్వ‌ర్యం అంటే!
అది నువ్వు తెచ్చే ల‌క్ష క‌న్నా
కోటి రెట్లు గొప్ప‌ది!

60 కి.మీ స్పీడ్‌తో వెళ్లే ట్రైన్
ప్టాట్ ఫారం మీద ఆగ‌దు అన్న లాజిక్ తెలిసిన నీకు
2 గంట‌ల్లో ప‌దివేల‌కు ల‌క్ష రూపాయ‌ల వ‌డ్డీ
ఏ బ్యాంకూ ఇవ్వ‌ద‌ని తెలియ‌దురా!
అలా రెండు గంట‌ల్లో నిజంగా ల‌క్షే వ‌స్తే
80 ఏళ్ల‌కు రావాల్సిన మీ నాన్న
ఇలా 50 ఏళ్ల‌కే హాస్పిట‌ల్‌కు వ‌స్తాడు.
అది స్పీడ్‌గా వ‌స్తే ఇదీ స్పీడగానే వ‌స్తుందిరా!
ఆలోచిస్తుంటే నీకు బిట్టుకి పెద్ద తేడా లేద‌నిపిస్తోంది.
నీకు ల‌క్ష‌లు కావాలి..వాడికి కోట్లు కావాలి
అంకెల్లోనే తేడా.. ఆలోచ‌న‌ల్లో కాదు.


Movie Name : Nedi Naadi Oke Katha

సాఫ్ట్‌వేర్‌ ఇంజ‌నీరో..డాక్ట‌రో
మీ లాగ లెక్చిర‌రో అయ్యే అంత తెలివితేట‌లు నాకు లే..!
నా మ్యాట‌ర్ ఇంతే..
ఏం చేసెది చెప్పు నాన్న‌..!
మిమ్మ‌ల్ని ఎవ‌రైనా
మీ పిల్లోడు ఎందుకు క్యాబ్‌
తోలుకుంటున్నాడు అని అడిగితే!
మా పిల్లోడికి చ‌దువు అబ్బ‌లేదు
మ‌రి ఏదో ఒక‌టి చేసుకోవాలిగా అని చెప్పండి నాన్న!

మీరు సిగ్గుప‌డ‌టానికి నేను దొంగ‌త‌నాలు,
జేబు క‌త్తిరించ‌టాలు చేయ‌లేదు నాన్న‌!
నిన్న పేప‌ర్‌లో ఒక న్యూస్ చూశాను..
మీ పిల్ల‌లు ఎలా ఉండాలని ఆశిస్తున్నారు
అని పేరెంట్స్‌ను క్వ‌శ్చ‌న్ అడిగితే..!
78 శాతం మంది కెన‌డాలో..
78 శాతం మంది యూకేలో ..
ఆనందంగా ఉండాలి అని అన్నార‌ట‌
లైఫ్‌లో సెటిల్ అవ్వాలి
డ‌బ్బు బాగా సంపాదించాలి అని
మాత్రం మ‌న దేశంలో పేరెంట్స్ అన్నారండి!

అస‌లు మీరంతా సంపాద‌న‌లో ఆనందం చూస్తున్నారు
కానీ..డ‌బ్బు సంపాద‌న‌కు, ఆనందానికి సంబంధం ఏడుంది నాన్న‌!
స‌రే ఒక వేళ సంపాద‌న‌లోనే ఆనందం ఉంటే
ల‌క్ష‌లు ల‌క్ష‌లు సంపాదించే డాక్ట‌ర్లు, సాఫ్ట్వేర్ ఇంజ‌నీరులు
డిప్రెష‌న్‌కు గురై ఎదుకు నాన్న
ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు.
ఆనందం డ‌బ్బు సంపాదించ‌డంలో లేదు నాన్న‌!
మ‌న‌కు న‌చ్చిన ప‌ని చేయ‌డంలో ఉంది!
ఇక సెటిల్‌మెంట్ గురించి అంటారా!
లైఫ్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు నాన్నా!
మెకానికి్ షెడ్డులో ప‌నిచేసే వారు కాంట్రాక్ట‌ర్లు అయిన వాళ్లు ఉన్నారు
ఆటోలు తోలుకునే వారు న‌లుగురికి ప‌ని ఇచ్చే స్టేజీలో ఉన్నారు

ఏమో రేపు ఈ టాక్సీకి ఓన‌ర్ అవుతానేమో!
న‌లుగురికి ప‌నిచ్చే స్టేజీకి ఎదుగుతానేమో
ఎవ‌రికి తెలుసు నాన్నా!
జీవితం ఎవ‌రిని ఎప్పుడు ఎలా మారుస్తుందో!


Movie Name : Soli Brathuke so Better

ఆడోళ్లు..చాలా తెలివైన మంచోళ్లు రా!
మ‌న అవ‌స‌రం తెలుసుకుని
ముందే అన్నీ చేసేస్తారు!
వాళ్లు లేన‌ప్పుడు!
వాళ్ల అవ‌స‌రం మ‌న‌కెంతో తెలియ‌జేస్తారు!
అయిపోయింది రా!
రేయ్‌..నువ్వు సోలో బ‌తుకే సో బెట‌ర్ అంటుంటే
నేను కూడా ఎంక‌రేజ్ చేశాను
సారీరా క‌రెక్టు కాదురా!
ఎందుకంటే..ఒక్కోసారి
మ‌న క‌న్నీళ్లు తుడుచుకోడానికి
మ‌న రెండు చేతులూ స‌రిపోవురా!
స‌రిపోవు.. ఆలోచించు!


Movie Name : 7g brindavan colony

మంచి ఉద్యోగమా!
కాక‌పోతే..హీరో హోండా కంపెనీలో
ఉద్యోగం అంటే మాట‌లా!
ఎంత మంది త‌ప‌స్సు చేస్తున్నారో తెలుసా!
ప‌డుకున్నాడా! హా!
భోజ‌నం కూడా చేయ‌లేదు
కాస్త ప్రేమ‌గా మాట్లాడి ఉంచొచ్చు క‌దండీ!
ఏం మాట్లాడ‌మంటావ్‌..ఊ..
ఇన్నాళ్లు వాడ్ని తిట్టాను..కొట్టాను
ఇప్పుడు ఉద్యోగం రాగానే ప్రేమగా మాట్లాడాన‌నుకో
ఛీ.. మా నాన్న డ‌బ్బు కోసం
యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటాడు.

అదేంటండీ..అలా మాట్లాడ‌తారు
ఏవండీ ఏంటండీ చిన్న పిల్లాడి లాగా!
వాడిలో ఎంతుందో చూసావే
ఆర్డ‌ర్ నాచేతికి ఇచ్చేసి
నా వంక చూశాడు చూడు!
ఇక మీద‌ట నా కొడుకు ఎందుకు ప‌నికి రాడ‌ని
ఎవ‌రైనా అంటే!
పోవే.. నా కొడుకు హీరో హోండాలో ఉద్యోగ‌స్తుడు అయ్యాడు
ఊ..పెద్ద గొప్ప‌..గొప్ప‌కాక‌పోతే మ‌రేంటే!
వాడు పుట్టిన‌ప్పుడే అనుకున్నాను
ఏదో ఒక రోజు వాడంత గొప్ప‌వాడు అవుతాడ‌ని
అలాంట‌ప్పుడు ఎందుకు వాడ్ని కొడ‌తారు
ఎప్పుడు చూసినా వాడిని తిడుతూనే ఉంటారు!
తిట్ట‌క‌పోతే ఎలాగే..!
ఎదురుగా పొగిడామ‌నుకో
ఎందుకు ప‌నికి రాకుండా పోతాడు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *