Mothers Day 2022 | మే 8, 2022 మదర్స్‌డే దినోత్సవం. మన అమ్మలకు శుభాకాంక్షలు తెలిపి, వారి ప్రేమను పొందే రోజు. ప్రతి ఒక్కరూ Mothers Day సందర్భంగా Wishes తెలుపుతుంటారు వారి తల్లులకు. నవమాసాలు మోసి మనల్ని కని, పెంచి పెద్దవాళ్లను చేసిన మన తల్లుల రుణం మనం ఎప్పటికీ తీర్చలేనిది. తీర్చలేము కూడా. Ammaకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలపండి. అమ్మపై నీకు ఉన్న ప్రేమను తెలపండి. ఆమెకు ఇష్టమైనది కొనివ్వండి. ఇష్టమైన ఆహారం మీరే స్వయంగా వండి పెట్టండి. ఈ సందర్భంగా మదర్సడే శుభాకాంక్షలు తెలపాలనుకునే వారికి కింద Mothers Day 2022 పోస్టర్లు అందించాము. షేర్ చేసుకోగలరు.
Mothers Day 2022 Wishes Telugu
నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే. భగవంతుడు అనునిత్యం మన తోడు ఉండేందుకై అవతరించిన అవతారమే అమ్మ.ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా.. మాతృ ప్రేమలో ఉన్న అనుభూతి ఎక్కడా దక్కదు ఎంతో గొప్ప బంధం అమ్మ.అమ్మ రెండు అక్షరాల పదం, ప్రపంచానికి నిజమైన ప్రేమని పరిచయం చేసి ఒక రూపం, నిన్ను జన్మించడం కోసం తను మరణం వరకు వెళ్లి పునర్జన్మంచే దైవం అమ్మ అనే పదానికి అర్థం చెప్పడానికి మనం నేర్చుకునే ఈ పదాలు సరిపోవు. సృష్టిలో అందమైనది పువ్వు నా దృష్టిలో అందమైనది మా అమ్మ నవ్వు.తన ఆయువునే ఆరో ప్రాణంగా మలచి, జన్మనిచ్చి నీ రూపంలో ముసిముసి నవ్వులు చూసి మైమరచేను అమ్మ.సృష్టిలో మనకు తొలి గురువు అమ్మ. తల్లిని మించిన దైవం లేదు. ఆమె త్యాగాలకు అంతులేదు. అందుకే అమ్మకు శతకోటి వందనాలు.
అమృతం లాంటి ప్రేమను చూపించేది అమ్మ. ఆప్యాయత, అనురాగం పంచేది అమ్మ.అమ్మ ను నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే. అమ్మ నా రేపటి భవిష్యత్కై నిత్యం శ్రమించే శ్రామికురాలు. కాబట్టి అమ్మను ప్రేమించుదాం. అమ్మను గౌరవిద్ధాం. అమ్మను మంచిగా చూసుకుందాం. ఆమె బ్రతికి ఉన్నంత వరకూ..మనం బ్రతికి ఉన్నంత వరకూ ఆమె చేయిని విడవకుండా ఉందాం. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.





















