OTT Movies of 2021: ఈ ఏడాది సినిమాలన్నీ దాదాపుగా OTT platform మీదనే విడుదల కానున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఓటీటీ మీదనే రిలీజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదలై ఆడియన్స్‌లో ఒక కొత్త ఆలోచనను పుట్టించే సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం!
బిగ్ బడ్జెట్‌తో బిగ్ experienceతో తీసిన R.R.R, kGF Chapter-2, Pushpa ఇలాంటి సినిమాలన్నీ కచ్చితంగా థియేటర్లనే టార్గెట్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి పెద్ద సినిమాలు కాకుండా కొంచెం కాన్పెప్ట్‌తో ఆడియన్స్‌లో ఇంట్రస్టన్ను క్రియేట్ చేసిన మూవీస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చెప్పబోయే సినిమాలు కేవలం ఓటీటీలోనే విడుదలవుతాయనేది నా ఉద్ధేశ్యం కాదు. పరిస్థితులు బాగుంటే తప్పకుండా వీటిని కూడా థియేటర్లలో చూసే అవకాశం లేకపోలేదు.
1.Koozhangal(pebbles)

ఇటీవల film festival ల్లో సెలక్ట్ మంచి రివ్యూస్‌తో బర్న్‌ను క్రియోట్ చేస్తున్న సినిమా ఇది. ఇంగ్లీష్ లో పెబల్స్ అనే ఈ సినిమాను తమిళ్ ఫిల్మ్ మేకర్ విగ్నేష్ శివన్ ప్రొడ్యూస్ చేశారు. డైరెక్టర్ వినోద్ రాజ్‌కు ఇది తొలి సినిమా. అయినా సరే ఒక ఎక్స్పీరియన్స్ స్టోరీలాగా ఈ సినిమాను తీశారు. ట్రైలర్‌ను, రివ్యూను ఒకసారి పరిశీలన చేస్తే, ఇది ఒక యదార్థ కథగా అనిపిస్తోంది. 2015లో కాకముట్టయ్య అనే తమిళ సినిమా కూడా ఇలాంటి స్టోరీతో ఆడియన్స్‌కు ఒక మంచి కథను పరిచయం చేసింది. కాబట్టి Koozhangal సినిమా కూడా అదే సీన్‌ను రిపీట్ చేస్తుందని అనుకోవచ్చు. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ సెన్సేషన్ మాత్రం క్రియేట్ చేయనుందని తమిళ అభిమానులు చెబుతున్నారు.
- Rocky

మీకు వీలైతే ఒక్కసారి యూట్యూబ్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను చూడండి. అది చూసినప్పుడు నిజంగా మీకు ఒక డిఫరెంట్ ఎమోషనల్ ఫీలింగ్ ఒకటి కలుగుతుంది. ఎందుకంటే కొరియన్ సినిమాల్లోనూ, ఇంటర్నేషనల్ మూవీస్‌లో మనం చూసే సినిమాటిక్స్ బాగుంటాయి. ఈ ట్రైలర్ లో కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఈ సినిమా డైరక్టర్Arun Matheswaran కు తొలి మూవీ. సూపర్ డీలక్స్ త్యాగరాజ్ కుమార్ రాజా వద్ద పనిచేసిన ఈ డైరక్టర్ తర్వాత సినిమా ఒకటి విడుదల కాబోతుంది. కాబట్టి తమిళ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ కాకండి.
3. M.Manikandan

ఈ సినిమాకు డైరక్టర్. ఎంటైరన్మెంట్ మరియు సెన్సబుల్గా ఉండే Kadaisi Vivasayi సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీశారు. తొలుత ఈ సినిమాకు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అనుకున్నారట. కానీ కమర్షయల్ హీరో కాబట్టి ఇలాంటి కథను ఎక్సప్ట్ చేయడం కష్టం. కాబట్టి మెయిన్ రోల్లో ఒక వృద్ధుడితో పాటు హీరో విజయసేతుపతిని పెట్టి ఈ సినిమా తీశారు. ట్రైలర్‌ను చూస్తే మాత్రం ఈ సినిమా ప్రేక్షకులకు మంచి సందేశం అందించేలా ఉంది. కావున ఈ సినిమా ఓటిటిలో వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ నేపథ్యం కలిగిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన సినిమా కాబట్టి తప్పకుండా చూడండి.
4. Kurup

మలయాళం హీరో Dulquer Salmaan డైరెక్టర్ చేసి, హీరో నటించిన సినిమా ఇది. ఈ సినిమాను కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ కథను అనుసరించి చేశారు. Sukumara Kurup అనే క్రిమినల్ లైఫ్ స్టోరీ ఈ సినిమాకు మెయిన్ ఇన్సర్మేషన్. ఈ ట్రైలర్‌ను ఒకసారి చూస్తే ఇండియా నుంచి తప్పించుకున్న ఓ మోసగాడి జీవితం కథ చూడటానికి చాలా ఇంట్రరెస్ట్గా ఉంది. ఈ రియల్ కథకు సంబంధించి ప్రస్తుతం రకరకాల వార్తలు వస్తున్నాయి. కాబట్టి అసలు క్రైం ఎలా జరిగింది? Kurup ఎలా తప్పించుకున్నాడు. అనే అంశం ఆడియన్స్‌కు ఈ సినిమాలో పిచ్చ ఇంట్రరెస్ట్గా ఉండబోతుంది. ఈ సినిమా థియేటర్లో విడుదల కానుందా? ఓటీటీలో విడుదల కానుందా అనే అంశం తెలియదు కానీ, ఈ సినిమా కూడా అందరూ చూడాల్సిందే.