Moral Story: తండ్రి-కొడుకు చెప్పిన జీవితం క‌థ‌!

Moral Story: ఓ ధ‌నికుడైన తండ్రి త‌న కుమారుడికి పేద‌వారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో చూపించ‌డం కోసం ఒక గ్రామానికి తీసుకెళ్లాడు. ఆ గ్రామంలోని ఓ పేద కుటుంబంతో కొంత స‌మ‌యం గ‌డిపారు. తిరుగు ప్ర‌యాణంలో తండ్రి త‌న కొడుకుని ఇలా అడిగాడు. చూసావు క‌దా! పేద‌వారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో! దీని బ‌ట్టి నువ్వు ఏం (Moral Story) నేర్చుకున్నావు?.

తండ్రి అడిగిన స‌మాధానానికి కొడుకు ఇలా అన్నాడు. మ‌న‌కి ఒక కుక్క మాత్ర‌మే ఉంది. వారికి నాలుగు కుక్క‌లు ఉన్నాయి. మ‌న‌కి ఒక స్విమ్మింగ్ ఫూల్ మాత్ర‌మే ఉంది. వారికి న‌ది ఉంది. మ‌న‌కు చీక‌టి ప‌డితే ట్యూబ్ లైట్లు ఉన్నాయి. వారికి న‌క్ష‌త్రాలే ఉన్నాయి. మ‌నం ఆహారాన్ని కొంటున్నాము.

కానీ వాళ్లు వారికి కావాల్సిన ఆహారాన్ని వాళ్లే పండించుకుంటున్నారు. మ‌న‌కు ర‌క్ష‌ణ గోడ‌లు ఉన్ఆన‌యి. వారికి ర‌క్ష‌ణ‌గా స్నేహితులు ఉన్నారు. మ‌న‌కు టీవీ, సెల్ ఫోన్స్ ఉన్నాయి. కానీ వాల్లు వారి కుటుంబంలో, బంధువుల‌తో ఆనందంగా గడుపుతున్నారు. మ‌నము ఎంత పేద‌వాళ్ల‌మో నాకు చూపించినంద‌కు చాలా థాంక్స్ డాడీ.

Moral Story: విలువ ఉన్న‌చోట‌నే ఉండు!

ఒక తండ్రి చ‌నిపోయే ముందు కొడుకుని పిలిచి ఈ చేతి గ‌డియారం 200 సంవ‌త్స‌రాల పూర్వం మీ ముత్తాత వాడిన‌ది. ఒక‌సారి న‌గ‌ల (jewellry) దుకాణం ద‌గ్గ‌ర‌కు వెళ్లి అమ్మ‌టానికి ప్ర‌య‌త్నించు, ఎంత ఇస్తారో అడుగు అంటాడు. కొడుకు న‌గ‌ల దుకాణంకు వెళ్లి అడిగితే చాలా పాత‌ది కాబ‌ట్టి 150 రూపాయ‌లు ఇవ్వ‌గ‌లం అంటారు.

అదే విష‌యం తండ్రికి చెప్ఏ ఒక‌సారి పాన్ షాప్ ద‌గ్గ‌ర అడిగి చూడు అంటాడు. Panshop ద‌గ్గ‌రికి వెళ్లి అడిగితే బాగా తుప్పు ప‌ట్టి ఉంది10 రూపాయ‌ల‌కు కొన‌గ‌ల‌ను అని చెప్తాడు. ఈ సారి తండ్రి కొడుకుతో మ్యూజియం ద‌గ్గ‌రికి వెళ్లి అడుగు చూడు అంటాడు. వాళ్లు అది చూసి ఇది చాలా పురాత‌న‌మైన‌ది మ‌రియూ అత్యంత అరుదైన‌ది. రూ.5 ల‌క్ష‌లు ఇవ్వ‌గ‌లం అంటారు.

గ‌డియారం

Moral Story: అప్పుడు తండ్రి కొడుకుతో, ఈ ప్ర‌పంచం చాలా వైవిధ్య‌మైన‌ది. నీకు ఎక్క‌డ విలువ ఉండ‌దో అక్క‌డ ఉండ‌కు, నీకు త‌గిన విలువ దొరికిన చోట ఉండు అని చెప్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *