money quotes Telugu 2022

money quotes Telugu 2022

motivation-Telugu
Share link

money quotes telugu 2022: డ‌బ్బు మ‌నిషికి అత్యంత ముఖ్యం. డ‌బ్బుని మ‌నిషి సృష్టించాడు. ప్ర‌స్తుతం ఆ డ‌బ్బు మ‌నిషి ఏలుతుంది. డ‌బ్బు ఉన్న‌వారు ధ‌న‌వంతులు. Money లేనివారు పేద‌వారు. డ‌బ్బుతో మ‌నిషి విలువ పెరుగుతుంది. డ‌బ్బుతోనే అన్నీ చేయ‌వ‌చ్చు. ఈ డ‌బ్బుకు ఉన్న విలువ లోకంలో మ‌నిషి లేదు. అలాంటి డ‌బ్బుకు సంబంధించిన కొన్ని కొటేష‌న్లు కింద ఇవ్వ‌డం జ‌రిగింది. మీరు ఒక‌సారి పోస్టు కింద ఉన్న Quotes ను చ‌ద‌వగ‌ల‌రు. జీవితంలో మీకు స‌హాయ‌ప‌డ‌తాయి కూడా.

money quotes telugu 2022

డ‌బ్బు ఉన్న‌ప్పుడు ఎడాపెడా ఖ‌ర్చు చేయ‌డం
లేన‌ప్పుడు ఇత‌రుల ద‌గ్గ‌ర చేతులు చాచ‌టం
వ‌ల్ల మ‌న వ్య‌క్తిత్వం దెబ్బ తింటుంది- గాంధీ

money quotes telugu 2022

కొంద‌రికి జీవితంలో డ‌బ్బు కావాలి
కొంద‌రికీ డ‌బ్బే జీవితం కావాలి

త‌క్కువ సంపాదించే వారి క‌న్నా
త‌క్కువ పొదుపు చేసేవారికే
ఆర్థిక ఇబ్బందులు వ‌స్తాయి.

ధ‌నాన్ని చూసి ద‌రిచేరే బంధువులు
అందాన్ని చూసి క‌లిగే ప్రేమ‌
అవ‌స‌రం కోసం క‌లుపుకునే స్నేహం
ఎన్న‌టికీ శాశ్వ‌తం కావు.

ఆక‌లితో ఉన్న క‌డుపు
ఖాళీగా ఉన్న జేబు
ముక్క‌లైన మ‌న‌సు
ఈ మూడు జీవితంలో
ఎన్నో పాఠాలు నేర్పుతాయి.

money quotes telugu 2022

అభివృద్ధి అనేది భ‌విష్య‌త్తుకు
కొత్త అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే కాదు.
కొత్త నిబంధ‌న‌లు కూడా పెడుతుంది.

నోరు లేకుండా ప‌లికిస్తుంది.
క‌ళ్లు లేకుండానే శాసిస్తుంది.
చేతులు లేకుండానే ఆడిస్తుంది.
కాళ్లు లేకుండానే న‌డిపిస్తుంది.
లేని బంధాల‌ను క‌లిపేస్తుంది.
ఉన్న బంధాల‌ను తుడిపేస్తుంది.
మ‌న‌సు లేని మ‌నీ
మ‌నిషి చేసిన మ‌నీ

డ‌బ్బు మ‌నిషిని మార్చ‌దు
డ‌బ్బు మ‌నిషి నిజ‌స్వ‌రూపాన్ని
బ‌య‌ట‌పెడుతుంది.

నీ చుట్టూ ధ‌న‌ధాన్య‌రాసులు
ఉన్నాయ‌ని మ‌రువ‌కు
ఎంత ధ‌నం ఉన్నా తినేది
పిడికెడు మెతుకులే అని మ‌రువ‌కు

రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే
హ‌రి చంద్రుని చేత అబ‌ద్ధం ఆడిస్తాను
భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య చిచ్చుపెడ‌తాను
తండ్రీ బిడ్డ‌ల‌ని విడ‌దీస్తాను
అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వైరం పెంచుతాను
ఆఖ‌రికి ప్రాణ స్నేహితుల‌ను కూడా
విడ‌గొడ‌తాను అంద‌ట‌.

త‌న భ‌ర్త ఆదాయం ఖ‌ర్చుల‌ను గ‌మ‌నిస్తూ
త‌న‌కు సంబంధించిన ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునే
భార్య నిజంగా ఓ వ‌ర‌మే.

ధ‌నం వ‌ల్ల సుఖం పొంద‌వ‌చ్చ‌ని
అంద‌రూ పిచ్చిగా సంపాదిస్తుంటారు
అధిక‌మైన సొమ్ము ఎప్ప‌టికైనా దుఃఖాన్నే క‌లిగిస్తుంది
సంపాదించిన సొమ్మును కాపాడుకోవాల‌నే
అశాంతితోనే అల్లాడుతుంటారు.
అత్యంత ప్రేమానురాగాల్లో ఉండే
త‌ల్లికి పిల్ల‌ల‌కు మ‌ధ్య కూడా ధ‌నం విరోధం తెస్తుంది.

money quotes telugu 2022

డ‌బ్బు లేని పురుషుణ్ణి వేశ్య విస‌ర్జిస్తుంది.
ఓడిపోయిన రాజును ప్ర‌జ‌లు విస‌ర్జిస్తారు
ప‌ళ్లు ఇవ్వ‌ని చెట్టును ప‌క్షులు విస‌ర్జిస్తాయి.
ప్ర‌పంచంలో అంద‌రూ వారి వారి స్వ‌లాభానే చూస్తారు.
ఎప్ప‌టి వ‌ర‌కూ మ‌న నుండి జ‌నానికి లాభం
ఉంటుందో అప్ప‌టి వ‌ర‌కే మ‌న‌కు విలువ ఉంటుంది.

ఈ రోజుల్లో మ‌నిషి సృష్టించిన‌
మ‌నీకి ఉన్న విలువ
దేవుడు సృష్టించిన మ‌నిషికి లేదు.

డ‌బ్బు మ‌నిషిని పైకి తీసుకెళ్ల‌గ‌ల‌దు
అందులో ఎటువంటి అనుమానం లేదు
కానీ, మ‌నిషి పైకి వెళ్లిపోయేట‌ప్పుడు డ‌బ్బుని
తీసుకెళ్ల‌లేడు ఇందులోనూ ఎటువంటి అనుమానం లేదు.

డ‌బ్బు..దీన్ని త‌క్కువుగా వాడుకుంటే
మిమ్మ‌ల్ని క‌ష్ట‌కాలంలో ఆదుకుంటుంది.
అదే విచ్చ‌ల‌విడిగా వాడితే
మీ జీవితంతో ఆడుకుంటుంది.

న‌లిగినంత మాత్రాన క‌రెన్సీ నోటు
విలువ త‌గ్గ‌దు.
మ‌నిషి ఓడిపోయినంత మాత్రాన‌
జీవితం ఆగిపోదు.

మ‌నిషికి న‌కిలీ డ‌బ్బు
త‌యారు చేయ‌గ‌లిగే తెలివే ఉంది.
కానీ డ‌బ్బుకి మ‌నిషినే
న‌కిలీ మ‌నిషిగా మార్చే శ‌క్తి ఉంది.

నేను అధిక‌మైతే నీ క‌ళ్లు నెత్త‌కెక్కి
నీళ్ల‌లా న‌న్ను వాడేస్తూ
అప్పుల‌పాలై తిప్ప‌లు ప‌డుతుంటావు!

ఎంత మంది ఎంగిలితో త‌డిసినా
మ‌నం అప‌విత్రంగా భావించ‌ని
ఒకే ఒక వ‌స్తువు డ‌బ్బులు మాత్ర‌మే!

See also  Earn Money Motivation: ఇవే కార‌ణాలు సోద‌రా! నువ్వు డ‌బ్బు సంపాదించ‌లేక‌పోవ‌డానికి!

Leave a Reply

Your email address will not be published.