Money Problem | ఆర్థిక చికాకుల్లో ఉన్నవాళ్లకు భౌతికమైన నొప్పుల బాధ కూడా ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్థికంగా ఎలాంటి చికాకులు లేనివారి కన్నా చికాకుల్లో ఉన్నవాళ్లకు నొప్పి ఫీలింగ్ ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆర్థికపరమైన అభద్రతా భావం(Money Problem) ఫీలయ్యేవాళ్లు భౌతికపరమైన నొప్పిని ఎక్కువుగా అనుభవిస్తారని వర్జీనియా యూనివర్శిటీలో అధ్యయనం నిర్వహించిన ఈలెన్చూ చెబుతున్నారు.
ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారు, తలనొప్పి, కాళ్ల నొప్పులు, లేదా దెబ్బల కారణంగా వచ్చే నొప్పిని తట్టుకోలేక పోవడం, ఎక్కువ నొప్పిని అనుభూతి చెందడం, అధికంగా Pain Killers వాడటం జరుగుతుందని చెప్పారు. అధ్యయన బృందంలో భారత్‌కు చెందిన సైంటిస్ట్ కూడా ఉన్నారట. ఒక్కరికైనా ఉద్యోగమున్న కుటుంబాలతో పోలిస్తే అందరూ నిరుద్యోగులే ఉన్న కుటుంబాల్లో పెయిన్ కిల్లర్స్ వాడకం 20 శాతం ఎక్కువని సర్వేలో తేలింది.
Money Problem: బెగ్గింగే బెటరట
వండినమ్మకు ఒకటే కూర..అడుకున్నమ్మకు అరవై కూరలు అని ఊరికే అన్నారా? అచ్చం అలంటి సామెతను గుర్తుకు తెచ్చాడో వ్యక్తి. ఉద్యోగం చేస్తే వచ్చే సంపాదన కంటే అడుక్కుంటేనే ఎక్కువ డబ్బులొస్తాయనేది ఆయన నమ్మే సిద్ధాంతం. ఆశ్చర్యమనిపించినా ఇదే ఆయన జీవిత సత్యమని బహిరంగంగానే చెప్పాడు. లండన్‌కు చెందిన్ క్రెయింగ్ అట్కిన్ సన్ నటింగ్ హామ్లో బిచ్చం(begging) ఎత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.


అయితే ఉన్నటుంటి అతడిని పోలీసులు అరెస్టు చేసి బిచ్చమెత్తుకోవడం మానేయమన్నారు. ఎంతకూ వినకపోవడంతో న్యాయ స్థానం ఎదుట హాజరుపరిచారు. భిక్షాటన ఎందుకు చేస్తున్నావని న్యాయమూర్తి కూడా ప్రశ్నించగా నేను ఉద్యోగం చేస్తే వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించలేకపోతన్నా(Money Problem). బిక్షం ఎత్తకుంటేనే తగినంత ఆదాయం వస్తుంది. దీంతో పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నా. నేను అడుక్కోవడం వల్ల ఎవరికీ నష్టం లేదు అని సమాధానమిచ్చాడు. Courtలోని వారంతా అతడి మాటలకు అవాక్కయ్యారు.!