Money Motivation: డబ్బు సంపాదించాలనే మీ కలకు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆగిపోవద్దు. ప్రతి ఒక్కరం సంపాదిస్తేనే పేరు, ప్రఖ్యాతలు ఉంటాయి. కుటుంబం కూడా బాగుంటుంది. డబ్బుకు ఉన్న ఫవర్ ఈ లోకంలో దేనికీ లేదు. కాబట్టి డబ్బును ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి. ఎలా బ్రతకాలో కలలు కనాలి.
Money Motivation | డబ్బుపై నమ్మకం ఉంచండి. మన చుట్టూ ఉన్న ఈ వాతావరణంలో మనకి కనబడకుండా చాలా డబ్బు దాగి ఉంది. మనం చెయ్యవలసింది ఆ డబ్బుని వెతికిపట్టుకోవడమే. బిల్ గేట్స్ కంప్యూటర్లలో చాలా డబ్బు ఉందని నమ్మాడు. సచిన్ టెండ్కూలర్ క్రికెట్‌లో చాలా డబ్బు, పాపులారిటీ ఉందని గ్రహించాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో విపరీతమైన డబ్బు దాగి ఉందని ఊహించాడు మెక్ డొనాల్డ్ అధినేత రేక్రాక్. వస్త్రాలయంలో మనీ ఉందని ఊహించగలిగాడు ధీరుబాయ్ అంబాని.
Money Motivation | డబ్బుపై నమ్మకం ఉండాలి!
పైన ఉదహరించిన వారికి వ్యక్తిగత ప్రతిభ ఉందని మీకనిపించవచ్చు. కానీ మీ ఇంటి వెనుక గల కొండను చూస్తే మీనేకనిపిస్తుంది. అని ఎవరైనా అడిగితే సీనరీ బాగుందనో లేదా వర్షం వచ్చినప్పుడు బురద నీళ్లు ఇంట్లోకి ప్రవేశిస్తాయనో చెప్తాము. అదే ఒక క్వారీ కాంట్రాక్టర్ అయితే నాకు 500 కోట్ల రూపాయల క్వారీ కనబడుతోంది అని అంటాడు. మనందరికీ సినిమాల్లో చాలా ఐశ్వర్యం ఉందని నమ్మకంగా తెలుసు, అలాగే బ్రాందీ షాపుల్లో, రాజకీయాల్లో, టూరిజంలో, విద్యా సంస్థలలో, హాస్పిటళ్లలో బట్టల వ్యాపారంలో చాలా డబ్బు దాగి ఉందని తెలుసు.


మనం కొన్ని విభాగాలలో మాత్రమే Money ఉందని నమ్ముతాం. మన చుట్టంతా డబ్బు ఉందని తెలుసుకోకుండా డబ్బు ఉన్న కొన్ని విభాగాలని మాత్రమే చూడటం అలవాటు చేసుకున్నాం. దినేష్‌కి నది ఒడ్డున ఓ పెద్ద ఫాం హౌస్ ఉంది. అక్కడ హాయిగా నివసిస్తున్న దినేష్‌కి అతని స్నేహితుడు వచ్చి, ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రాలని, అవి ఉత్తరాన ఉన్న భూముల్లో దొరుకుతాయి అని చెప్పాడు. వజ్రాలు అమ్మి, తాను మరింత ధనవంతుడనివుదామని దినేష్ తన ఫాంహౌస్‌ని ఆ స్నేహితుడికి అమ్మి, ఆ డబ్బుతో ఉత్తర దేశానికి బయలు దేరాడు.
Money Motivation: ధనవంతుడైన స్నేహితుడు


అక్కడ భూములు కొన్ని, Diamonds కోసం తవ్వి, అవి దొరకక భూమిని తిరిగి తక్కువ ధరకు అమ్మసాగాడు. ఓ పది సంవత్సరాలో దినేష్ దగ్గర డబ్బు అయిపోయింది. విరక్తి చెందిన దినేష్ ఓ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫాంహౌస్ కొనుకున్న స్నేహితుడు ఓ రోజు నదిలో చేపలు పడుతుండగా నీళ్లలో ఏదో మెరుస్తున్నట్టుగా కనబడి, తీసి చూస్తే అది వ్రజం అని తేలింది. వెంటనే ఫాంహౌస్‌ని తవ్వితే చాలా వజ్రాలు బయటపడ్డాయి. వాటిని అమ్మి ఆ స్నేహితుడు చాలా ధనవంతుడయ్యాడు.
నీతి: ఎక్కడో మనకి అందని చోట మాత్రమే డబ్బు(Money Motivation) లేదు, మన కాళ్ల కింద కూడా డబ్బు ఉంటుంది. సరైన రీతిలో బయటకు తియ్యాలి. అందుకే ఓ చైనీస్ సామెత ఇలా చెబుతుంది. మన ఇంటి చుట్టూ అనేక తలుపులు ఉన్నాయి. అదృష్టదేవత ఎల్లప్పుడూ ఏదో ఒక తలుపు తడుతూనే ఉంటుంది.