Money Investment Ideas: నిజ‌జీవితంలో లాభాల దీపాలు వెలిగిద్ధాం!

Money Investment Ideas: చాలా సంద‌ర్భాల్లో మ‌నం హేతుబ‌ద్ధంగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని భావిస్తాం. అయితే అది నిజం కాదు. మ‌నం భావోద్వేగ మ‌నుషులం. కొన్ని సార్లు మాత్ర‌మే తార్కికంగా ఆలోచిస్తాం. ఉదాహ‌ర‌ణ‌కు ఇటీవ‌ల కాలంలో ఏదైనా Share మంచి ప‌నితీరు క‌న‌బ‌ర‌చింద‌ని తెలిస్తే, ముందుగా మ‌న‌కూ ఆ ప్ర‌తిఫ‌లాలు ద‌క్కిఉంటే బాగుండేద‌న్న ఆశ మ‌న మ‌న‌సులో మెదులుతుంది. ఆ ఆశ‌తోనే ఏదో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేస్తాం. ఇల్లు కొనాలా.. పిల్ల‌ల చ‌దువుకు డ‌బ్బులు ఖ‌ర్చు చేయాలా అన్న‌ప్పుడు భావోద్వేగ నిర్ణ‌య‌మే మ‌న‌ల్ని న‌డిపిస్తుంది. ఈ భావోద్వేగాల‌నూ అదుపులో పెట్టుకున్నప్పుడే ఆర్థిక విజ‌యం సాధించ‌వ‌చ్చు.

Money Investment Ideas: మీ నిశ్శ‌బ్ధ శ‌త్రువు తెలుసా?

ముందుగా ఏదైనా పెట్టుబ‌డులు పెట్టే స‌మ‌యంలో అది ఎందుకు? అని ప్ర‌శ్నించుకోవాలి. అంటే ఆ పెట్టుబ‌డుల ప్ర‌తిఫ‌లాల‌ను దేనికి ఉప‌యోగించుకోవాల‌ని అనుకుంటున్నారో ముందుగానే నిర్వ‌హించుకోవాలి. రాసి పెట్టుకోవాలి. చాలా మంది ల‌క్ష్యాన్ని ప‌క్క‌న పెట్టి, కేవ‌లం ప్ర‌తిఫ‌లాల‌ను మాత్ర‌మే లెక్కిస్తూ కూర్చుంటారు. తొలి ల‌క్ష్యం ఎవ‌రికైనా ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళికే అయి ఉండాలి. చాలా మంది 50 ఏళ్లు వ‌చ్చాక కానీ ఆ దిశ‌గా అడుగులు వేయ‌రు. అప్ప‌టికీ చాలా ముందుగానే ఆలోచించిన‌ట్టు భావిస్తుంటారు. అంతే కాదు Inflation సైతం లెక్క‌వేయ‌డం మ‌రిచిపోతుంటారు. నిశ్శ‌బ్ధ శ‌త్రువు ద్ర‌వ్యోల్భ‌ణ‌మేన‌ని, అది తుది ల‌క్ష్యం చేర‌డంలో విఫ‌లం అయ్యేలా చేస్తుంద‌ని మ‌రిచిపోకూడ‌దు.

ఒక ఏడాది..రెండేళ్లు

మీకు ఏది కావాలి? ఏది అవ‌స‌రం? ఈ రెండు విష‌యాల‌పై స్ప‌ష్ట‌త ఉండాలి. ఎవ‌రికైనా ప్ర‌యాణాల్లో ఆనందం దొర‌కుతుందంటే ప్ర‌యాణ ప్ర‌ణాళిక‌ల్లో కొంత ఎక్కువ Money వెచ్చించినా ప‌ర్వాలేదు. అయితే త‌మ‌కు అన‌వ‌స‌ర‌మైన ఇత‌ర విష‌యాల్లో డ‌బ్బులు పెట్ట‌కుండా ఉండాలి. అదే స‌మ‌యంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఏడాది ఆల‌స్య‌మైతే, రెండేళ్ల పాటు అద‌నంగా జీవితంలో క‌ష్ట‌ప‌డాల‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి.

Money Investment Ideas: చ‌క్ర‌వ‌డ్డీ మ‌హిమ‌

మ‌న మెద‌డు చాలా క‌ష్ట‌మైన విష‌యాల‌ను సైతం అర్థం చేసుకుంటుంది. అయితే ఒక్కోసారి చాలా సులువైన విష‌యాల‌ను మ‌రిచిపోతుంటుంది. రూపాయిని వందేళ్ల పాటు పెట్టుబ‌డి పెడితే 12 శాతం వ‌డ్డీ రేటు అంచ‌నాతో రూ.83,522 ల‌భిస్తుంది. ఈ చిన్న త‌ర్కాన్ని అర్థం చేసుకుంటే ఎవ‌రైనా స‌రే త‌మ ఆర్థిక ప్ర‌య‌ణాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మొద‌లు పెడ‌తారు. సాధ్య‌మైనంత ఎక్కువ కాలం పెట్టుబడులు పెడ‌తారు. అయితే చాలా మంది మ‌దుప‌ర్లు స్వ‌ల్ప‌కాలానికి క‌ట్టుబ‌డి ఉంటారు. Stock Market ఎప్పుడూ ఊగిస‌లాట‌లోనే ఉంటుంది. లాభ‌ప‌డాల‌న్నా, న‌ష్ట‌పోవాల‌న్నా 50 శాతం అవ‌కాశాలుంటాయి. కాబ‌ట్టి దీర్ఘ‌కాల దృష్టిలో వైవిధ్య‌మైన పోర్ట‌ఫోలియో ఉంటేనే అన్ని అడ్డంకులనూ త‌ప్పించుకుంటూ విజ‌యం తీరం చేరొచ్చు.

Money Investment Ideas: భ‌విష్య‌త్తును ఊహించాలి!

ప్ర‌పంచంలో మ‌న‌కు తెలియ‌ని విష‌యాల‌న్నీ భ‌విష్య‌త్‌లోనే త‌గులుతుంటాయి. వాటిని అంచ‌నా వేయ‌డం అసాధ్యం. ఎవ‌రైనా ఈ ఏడాది క‌రోనా వ‌స్తుందని ఊహించారా? అదే విధంగా క‌ష్ట‌కాలం వ‌స్తుంద‌ని అనుకోం. అయితే అది భ‌విష్య‌త్లో రావొచ్చు. రాక‌పోవ‌చ్చు. కానీ మ‌నం మాత్రం అందుకు సిద్ధంగా ఉండాలి. వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌ణాళిక విష‌యంలో అలా ఆలోచించి అడుగువేయాలి. మార్కెట్ల‌కు ఎవ‌రి వ్య‌క్తిగ‌త ప్ర‌ణాళిక‌తోనూ ప‌ని ఉండ‌దు. అందుకే అన్ని మార్కెట్ల ప‌రిస్థితుల్లోనూ రాణించే ఒక Portfolioను నిర్మించుకోవ‌డ‌మే మ‌నం చేయాల్సింది. అధ్వాన ప‌రిస్థితులు ఎదురైతే ఏం చేయాల‌ని ముందే ఆలోచించుకునేవారే అస‌లుసిస‌లు విజేత‌ల‌వుతారు.

Money Investment Ideas: సురక్షిత‌మూ న‌ష్ట‌మే?

మార్కెట్లో భావోద్వేగాలే మ‌దుప‌రి నిర్ణ‌యాన్ని ప్ర‌భావితం చేస్తాయి. ఈ బావోద్వేగాలే మ‌న‌ల్ని ఆశ లేదా భ‌యం వైపు న‌డిపిస్తాయి. మీ ఫోర్ట్‌పోలియోలో స‌రైన స్థిరాదాయం ఇచ్చే అంశాలు ఉంటేనే, క‌ష్ట‌కాలంలో ఆదుకుంటాయి. మార్కెట్లు ప‌డ్డాయ‌ని ఈ ఏడాది పిల్లాడి స్కూలు ఫీజును క‌ట్ట‌కుండా ఉండలేం కదా? అదే విధంగా ప‌ద‌వీ విర‌మ‌ణకు త‌గిన విధంగా పెట్టుబ‌డులు పెట్టుకోవాలి. స్థిర డిపాజిట్ల‌లో Investments పెట్టి సేఫ్ గేమ్ ఆడ‌కూడ‌దు కూడా. ఈ ఆర్థిక ల‌క్ష్యాల‌న్నింటినీ భావోద్వేగాలు అదుపులో పెట్టుకుని, త‌క్కువ ఒత్తిడి ఛేదించండి. న‌ష్టాల వ‌ధ చేయండి. లాభాలు దీపాలు వెలిగించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *