money burning : రూ.5 లక్షలు కాల్చివేసిన టిఆర్ఎస్ నేత | Veldanda Nagarkurnool
money burning : ఏసీబీ అధికారులు తన ఇంటి మీద దాడులకు వస్తున్నారని తెలిసి నోట్ల కట్టలకు ఓ టిఆర్ఎస్ నేత నిప్పంటించాడు. క్రషర్ మిషన్, మైనింగ్ అనుమతుల కోసం ఓ వ్యక్తి నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ తహశీల్దార్‌ను సంపద్రించారు. అయితే స్థానిక టీఆర్ఎస్ నాయకుడికి రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని ఆయన సూంచారు. దీంతో ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో బాధితుడితో డబ్బు పంపించి, ఆ వెంటనే టీఆర్ఎస్ నాయకుడి ఇంటిపై దాడులు చేశారు. అధికారులు వస్తున్నారని తెలిసి ఆ నాయకుడు నోట్ల కట్టలను కాల్చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా తలకొండపల్లి మండలం కోరింత తండాకు చెందిన రాములు నాయక్ కు వెల్దండ మండలంలోని బెల్లంపల్లి గ్రామంలో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ పొలంలో క్రషర్ మిషన్ ఏర్పాటు , మైనింగ్ అనుమతులు కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే స్థానిక తహశీల్దార్ నుంచి ఎన్ఓసీ( నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకురావాలని మైనింగ్ అధికారులు నాయక్‌తో చెప్పారు. దీంతో రాములు నాయక్ ఎన్ఓసీ కోసం తహశీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నారు.
అధికారులు వచ్చారని తెలుసుకున్న వెంకటయ్య గౌడ్ తలుపులు మూసుకున్నాడు. రాములు నాయక్ ఇచ్చిన రూ.5 లక్షలకు నిప్పంటించి తగల బెట్టాడు. ఇంతలో ఏసీబీ అధికారులు తలుపులు బద్ధలు కొట్టుకుని లోపలికి వెళ్లడంతో కరెన్నీ నోట్లు మంటల్లో తగలబడుతూ కనిపించాయి. వెంటనే మంటలు చల్లార్చగా అప్పటిఏ ఆ నోట్లు 70 శాతం కాలిపోయాయి. ఆ డబ్బును స్వాధీనం చేసుకుని వెంకటయ్య గౌడ్ తో పాటు తహశీల్దార్ సైదులు గౌడ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వెల్దండ తహశీల్దార్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని తహశీల్దార్ సైదులు గౌడ్ నివాసంలో దాడులు జరుగుతున్నట్టు సమాచారం.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started