Monday thoughts

Monday thoughts: దేనికైతే నువ్వు భ‌య‌ప‌డి వెనుక‌డుగు వేస్తావో..! తెలుగు కొటేష‌న్లు!

motivation-Telugu

Monday thoughts | ప్ర‌తి ఒక్క‌రికీ జీవితంలో ఏదో ఒక స‌మ‌స్య వెంటాడుతూనే ఉంటుంది. ప్ర‌తి రోజూ ఏదో ఒక స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డాల‌ని త‌ప‌న ప‌డుతూనే ఉంటాం. కానీ మ‌న‌లో ఉన్న బాధ‌, అసూయ‌, కోపం, చూసి క‌న్నా చూడ‌కుండా న‌మ్మ‌డం, ఎవ‌రో చెప్పింది విన‌డం, ఏదో కోల్పోయిన‌ట్టు బాధప‌డ‌టం.. ఇలా ప్ర‌తిదీ ఏదో ఒక రూపంలో మ‌న‌కు ప్రశాంత‌త లేకుండా చేస్తుంటాయి. ఇవేమీ ప‌ట్టించుకోకుండా జ‌ర‌గాల్సిన దాని గురించి ఆలోచించ‌కుండా, జ‌రిగే దాని గురించి ఆలోచిస్తూ ముందుకు పోతూ ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. ఈ సోమ‌వారం మీకు కొన్ని అద్భుత‌మైన వ్యాఖ్యాల‌ను అందిస్తున్నాము. ఒక్క‌సారి వీటిని చ‌దివి ప్ర‌శాంత‌త పొందుతార‌ని ఆశిస్తున్నాం.
Monday thoughts

1.చెప్పులు లేవ‌ని ఏడ్చే వాడికి కాళ్లు
లేనివాడు క‌నిపించేవ‌ర‌కు
అర్థం కాలేద‌ట తాను ఎంత‌టి
అదృష్ట‌వంతుడో అని

2.జీవితంలో ఓడిపోవ‌డం, మోస‌పోవ‌డం,
చెడిపోవ‌డం, ప‌డిపోవ‌డం అంటూ ఏం ఉండ‌వు.
కేవ‌లం నేర్చుకోవ‌డం మాత్ర‌మే ఉంటుంది.
కొంద‌రు ఓడిపోయి ఎలా గెల‌వాలి నేర్చ‌కుంటారు
ఇంకొంద‌రు మోస‌పోయి ఎలా జాగ్ర‌త్త‌గా ఉండాలో నేర్చుకుంటారు.
మ‌రికొంద‌రు ప‌డిపోయి ఎలా నిల‌బ‌డాలో నేర్చుకుంటారు.
జీవితం అనేది ఒక పాఠ‌శాల మిత్ర‌మా!

హ్యాపీ స్మైల్‌

3.త‌న‌కు క‌ష్టం వ‌స్తే క‌ష్టాలు మంచివాళ్ల‌కే వ‌స్తాయింటారు త‌ప్పా
తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు!
అదే క‌ష్టాలు ఎదుటివారికి వ‌స్తే
చేసిన పాపాలు ఊరికేపోతాయా? అని అంటారు.
త‌మ క‌ష్టానికి కార‌ణాన్ని తెలుసుకుని,
ఎదుటి వారి క‌ష్టాన్ని సానుభూతితో
అర్థం చేసుకునే వారే నిజ‌మైన మ‌నుషులు!

4.నువ్వు ఒక‌రిని బాధ పెట్టే ముందు
వాళ్ల స్థానంలో నువ్వు ఉండి చూడు..
వాళ్లు ప‌డే బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది
మ‌నం ఒక‌రి సంతోషానికి కార‌ణం కావాలి కానీ
ఒకరి బాధ‌కి కార‌ణం కాకూడ‌దు.

5.దేనికైతే నువ్వు భ‌య‌ప‌డి వెనుక‌డుగు వేస్తావో
అదే నిన్ను మ‌ళ్లీ మ‌ళ్లీ వెంటాడుతుంది.
ఒక్క‌సారి ఎదురెళ్లి చూడు ఆ భ‌య‌మే
నీకు భ‌య‌ప‌డుతుంది.

6.ఇష్టం ఉన్న చోట క‌ష్టం ఉంటుంది.
క‌ష్టం ఉన్న చోట బాధ ఉంటుంది.
క‌ష్టం, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది.
వీట‌న్నింటినీ అర్థం చేసుకుంటే
మంచి మ‌న‌సుంటే జీవితం అద్బుతంగా ఉంటుంది.

7.జీవితంలో బోలెడు సంబంధాలు అక్క‌ర్లేదు
ఉన్న కొన్ని బంధాల్లోనైనా జీవం ఉంటే చాలు
జీవం లేని బంధాలు ఉన్న ఒక‌టే లేక‌పోయినా ఒక‌టే.

8.మ‌న‌ష్యున‌కు జ్ఞానం క‌లిగిన పిమ్మ‌ట‌
ఈ శ‌రీరంపై ల‌క్ష్యం ఉండ‌దు. స‌
ఎంత చ‌క్క‌ని విస్తరికానీ భోజనం చేసిన
త‌ర్వాత విసిరి పారేసిన‌ట్టు ఈ బౌతిక‌
శ‌రీరం జ్ఞానోద‌యం త‌ర్వాత ఎప్పుడు
పార‌వేద్ధామా అని చూస్తాడు.

9.అన్నీ అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌వు
జీవితం ఇలా ఉండాలి అని
ఆశ ప‌డుతూ ముందుకెళితే,
ఎప్పుడూ అసంతృప్తి, బాధ‌.
ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి
అనుకుంటే అంతా సంతృప్తే
అదే నిన్ను ముందుకు న‌డిపిస్తుంది.

10.దేవుడు అంద‌రికీ కాగితం లాంటి జీవితం ఇస్తాడు.
పుస్త‌క‌మైన అక్ష‌ర‌జ్ఞానం నేర్పుతావో..
గాలిప‌ట‌మై ఎత్తుకు ఎగురుతావో
ప‌చ్చ‌నోటై ప్రపంచాన్ని శాసిస్తావో..
చెత్త‌కాగిత‌మై మ‌ట్టిని చేరుకుంటావో
ప్ర‌తిదీ నీ న‌డ‌వ‌క‌డిక‌లో నీ ప్ర‌య‌త్నంలో ఉంది.
మిత్ర‌మా.. దేవుడిని దూషిస్తే కాదు మిత్ర‌మా
భ‌యాన్ని వ‌దిలేస్తే విజ‌యం సాధించ‌గ‌ల‌వు.

11.బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి.
అబ‌ద్ధాలు చెప్పి విశ్వాసం మాత్రం పోగొట్టుకోకండి.
ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి క‌ల‌వ‌చ్చు.
పోయిన విశ్వాసం మాత్రం ఎన్న‌టికీ తిరిగిరాదు.

మోటివేష‌న‌ల్ పిక్‌

12.భ‌గ‌వంతునితో ఉండం క‌ర్మ‌యోగం.
భ‌గ‌వంతునిలో ఉండ‌టం భ‌క్తియోగం
భ‌గ‌వంతునిగా ఉండ‌టం జ్ఞాన‌యోగం

13.జీవితం ఇంద్ర‌ధ‌న‌స్సులోని రంగుల్లా
అందంగా ఉండాలి కానీ
ఇంద్ర ద‌న‌స్సులోని రంగుల్లా మ‌నం రంగులు
మారుస్తూ జీవించ‌కూడ‌దు.
ఏదో ఒక రోజు అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంది.
అప్పుడు జీవితం ఏ రంగు లేకుండా పోతుంది.

14.ఎవ‌రో అడిగారు..
స‌మాజాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి ఏం చేయాలి అని
ఒక తెలివైన‌వారు ఇలా స‌మాధానం ఇచ్చారు..
కాళ్ల‌ని కాకుండా చేతుల‌ని ప‌ట్టుకుని లాగండి అని!

15.మ‌నుష్యుల ఐక‌మ‌త్యం చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది.
బ‌తికున్న వాడిని ప‌డ‌గొట్టాల‌నుకుంటారు.
చ‌చ్చి ప‌డిన వాడిని భుజాల మీద మోస్తుంటారు.

16.చెప్పుడు మాట‌లు విని చెడ్డ వారికి చేరువ కాకు..
నీ ముందు నిన్ను తిట్టే వారే నీ మంచి కోరుకుంటారు.
అని గ్రహించు మిత్ర‌మా!

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *