Modi Birthday: మోడీ పుట్టిన రోజు ఆస‌క్తిక‌ర విష‌యాలు!

Modi Birthday: భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ శ‌నివారం 72వ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా న‌రేంద్ర మోడీ పుట్టిన రోజు(Modi Birthday) వేడుక‌లు వైభ‌వంగా జ‌రిగాయి. ప్ర‌ధాన మంత్రిగా దేశానికి సేవ‌లు చేయ‌డంతోనే గాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్ర‌ముఖుల్లో ఒక‌రు.

న‌రేంద్ర మోడీ స‌రిగ్గా దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన మూడు సంవ‌త్స‌రాల‌కు పుట్టారు. ఉత్త‌ర గుజ‌రాత్ మెహ‌స‌నా జిల్లా వాద్ న‌గ‌ర్‌లో సెప్టెంబ‌ర్ 17,1950 సంవ‌త్స‌రంలో దామోద‌ర్ దాస్ మోడీ, హిరాబా మోదీ దంప‌తుల‌కు జ‌న్మించారు. మోడీ అస‌లు పేరు న‌రేంద్ర దామోద‌ర్‌ దాస్ మోడీ. ఈయ‌న ఆరురుగు సంతానంలో 3వ వాడు.

Modi Birthday: పేద‌రికం నుండి వ‌చ్చిన మోడీ!

మోడీ చాలా పేదరికం కుటుంబం నుండి వ‌చ్చారు. చిన్న‌త‌నంలో క‌నీసం తిన‌డానికి కూడా తిండి దొర‌క‌ని రోజుల‌ను అప్పుడ‌ప్పుడూ గుర్తు చేసుకుంటారు. మోడీ కుటుంబీకుల‌ను పోషించానికి ఆయ‌న త‌ల్లి నాలుగు ఇళ్ల‌లో ప‌ని చేసేద‌ట‌. తండ్రి స్థానికంగా ఉన్న స్టేష‌న్‌లో ఛాయ్ అమ్ముకుని జీవించ‌గా, త‌న తండ్రికి స‌హాయంగా మోడీ వెళ్లేవార‌ని త‌రుచూ ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పేవారు.

న‌రేంద్ర మోడీ ఎక్కువుగా హోట‌ళ్ల‌లో నిద్రించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ర‌ట‌. గుజ‌రాత్‌లో సీఎంగా ఉన్న‌ప్పుడు దాదాపుగా ప్ర‌యాణాల‌తోనే ఆ స‌మ‌యాన్ని భ‌ర్తీ చేసుకునేవార‌ట‌. ఒక వేళ మ‌రుస‌టి రోజు ఉద‌యం మీటింగ్‌లు ఉండే అత్య‌వ‌స‌ర స్థితిలో మాత్ర‌మే హోట‌ళ్ల‌లో ఉండేవార‌ట‌. ఉన్న‌త ప‌దువులు చేసిన‌ప్ప‌టి కీ ఇప్ప‌టికీ విరామం అంటే ఎరుగ‌ని నేత మోడీ. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు 13 సంవ‌త్స‌రాల్లో ఏనాడూ సెల‌వు పెట్ట‌లేదంట‌.

Modi Birthday | ప్ర‌ధానికి ఎక్కువుగా ఒంట‌రి జీవితం అంటే ఇష్ట‌మ‌ట‌. తాను యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు దేశంలో చాలా చోట్ల ఆధ్యాత్మిక యాత్ర‌లు చేశారు. చిన్న‌త‌నంలోనే పెద్ద‌లు బ‌ల‌వంతంగా చేసిన పెళ్లిన మోడీ తిర‌స్క‌రించారు. మోడీ ఎక్కువుగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఇష్ట‌ప‌డతార‌ట‌. త‌న కాలేజీ జీవితంలో కూడా ఒంట‌రిగానే ఉంటూ కోల్‌క‌త్తాలోని బేలూర్ మ‌ఠానికి త‌న ప్ర‌యాణినికి కొన‌సాగించారు. త‌న 28వ సంవ‌త్స‌రంలో ఢిల్లీ యూనివ‌ర్శిటీ త‌న గ్రాడ్యూయేష‌న్ పూర్తి చేశారు. ఇమేజ్ మేనేజ్‌మెంట్ మ‌రియు ప‌బ్లిక్ రిలేష‌న్ కోర్సు కోసం అప్ప‌ట్లో అమెరికాలో 3 నెల‌లు ఉన్నార‌ట‌.

తీర‌ని కోరిక ఇదేన‌ట‌

న‌రేంద్ర మోడీ మందు, సిగ‌రెట్ లాంటి ఎలాంటి అల‌వాట్లు లేవ‌ట‌. ఎప్పుడూ యోగా చేసే అల‌వాటు ఉన్న‌ది. Modi ప‌క్కా వెజిటేరియ‌న్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. మోడీకి ఆర్మీలో చేరాల‌ని క‌ల‌లు క‌న్నాడ‌ట‌. జామ్‌న‌గ‌ర్ సైనిక్ స్కూల్ లో చేరాల‌ని ప్ర‌య‌త్నించార‌ట‌. కానీ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఆ క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది. 1965 ఇండో-పాక్ వార్ స‌మ‌యంలో స్టేష‌న్‌కు చేరుకున్న మోడీ భార‌త సైనికుల‌కు టీ అందించ‌డం ద్వారా త‌న అభిమానాన్ని చాటుకున్న‌ట్టు తెలిపారు. చివ‌ర‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ్లోబ‌ల్‌ల‌లో అత్య‌ధిక ఫాలోయింగ్ ఉన్న నేత‌గా గుర్తింపు ద‌క్కించుకున్నారు.

Share link

Leave a Comment