Core Web Vitals Assessment: Mobile She Toilets: మొబైల్ షీ టాయిలెట్స్ తో మ‌హిళ‌ల‌కు, పిల్ల‌ల‌కు తొల‌గ

Mobile She Toilets: మొబైల్ షీ టాయిలెట్స్ తో మ‌హిళ‌ల‌కు, పిల్ల‌ల‌కు తొల‌గ‌నున్న ఇబ్బందులు…ఏఏ సౌక‌ర్యాలు ఉంటాయంటే?

Mobile She Toilets: భార‌త దేశంలో మ‌రుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు ఇంకా ఉన్నాయి. ఇప్ప‌టికీ ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం వ‌ల్ల గ్రామాల్లో మ‌రుగుదొడ్లు లేక సుదూర ప్రాంతాల‌కు మ‌హిళ‌లు, చిన్న పిల్ల‌లు వెళ్ల‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం. ఒక మంచి ఇల్లు లేక‌పోయినా ప‌ర్వాలేదు కానీ.. ఆ ఇంటిలో మ‌రుగుదొడ్డి లేక‌పోతే ఎంత ఇబ్బంది అవుతుందో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల వారికి తెలిసే ఉంటుంది. ఇక మ‌నం ఎక్క‌డికైనా సుదూర ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు అర్థాంత‌రంగా టాయిలెట్ వ‌స్తే ఎక్క‌డికి ప‌రుగులు తీయాలో, ఎటు వెళ్లాలో ఆ క్ష‌ణం అర్థం కాని ప‌రిస్థితులు ఎదుర‌వ‌య్యే ఉంటాయి. ఈ బాధ ఎక్కువుగా మ‌హిళ‌ల్లో , చిన్న పిల్ల‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.

అయితే మ‌హిళ‌ల‌ను, పిల్ల‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఓ వ‌నిత మొబైల్ షీ టాయిలెట్స్‌ను హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఆవిష్క‌రించింది. ఆమె పేరు సుష్మా క‌ల్లెంపూడి(sushma kallempudi), మ‌హిళ‌ల కోసం ప‌రిశుభ్ర‌మైన మ‌రుగుదొడ్డిని ఉప‌యోగించుకోవాల‌నే ఆలోచ‌న‌తో మొబైల్ షీ టాయిలెట్‌(Mobile She Toilets)ను రూపొందించారు ఆమె. ర‌ద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో మ‌హిళ‌ల‌కు స్వ‌చ్ఛ‌మైన మ‌రుగుదొడ్ల‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఎల‌క్ట్రిక్ ఆటోల‌ను ఏర్పాటు చేశారు.

ఈ మొబైల్ షీ టాయిలెట్ లో ఒక్కొక్క‌రు ఉప‌యోగించుకోవ‌చ్చు. 70 ఏహెచ్ 48 వోల్ట్‌ల( battery pack of 70 Ah 48 Volts) ల‌య‌న్ బ్యాట‌రీ ప్యాక్ క‌లిగి ఉంది ఈ వాహ‌నం. ఇది గంట‌కు 25 కిలోమీట‌ర్ల వేగంతో 24 గంట‌లు(24 hours) సుల‌భంగా నడుస్తోంది. టాయిలెట్ బాడీ ఐఎంఎస్‌, ఏసీపీ మ‌రియు స్టెయిలెస్ స్టీల్తో త‌యారు చేశారు. ఫ్ల‌షింగ్ కోసం 100 లీట‌ర్ల నీటి నిల్వ ట్యాంక‌ర్(00 liters water storage tanker) కూడా అందులో ఉంది. ఒంటి మ‌హిళ టాయిలెట్ వ‌చ్చిన‌ప్పుడు, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బిజీగా ఉండే కేంద్రాల వ‌ద్ద దీనిని ఉప‌యోగించుకోవ‌చ్చు.

జిపిఎస్ ట్రాకింగ్‌, శానిట‌రీ న్యాప్ కీన్ డిస్పెన్స‌ర్‌, డైప‌ర్ మార్చ‌డం, ప‌వ‌ర్ ఛార్జింగ్ స్టేష‌న్లు టాయిలెట్‌లో అద‌నంగా వ‌స‌తులు క‌లిగి ఉంది. ఈ వాహ‌నంలో వాక్యూమ్ ఫ్ల‌ష్ టెక్నాల‌జీని సుల‌భంగా ఫ్ల‌ష్ చేయ‌డానికి ఉప‌యోగిస్తారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ పాత ఆటో మొబైల్‌ల‌ను మొబైల్ షీ టాయిలెట్ లుగా మార్చ‌డకోసం అంగీక‌రించింది. ఈ వాహ‌నాన్ని త‌యారు చేసిన సుష్మ‌ను ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అభినందిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం మ‌రింత ముందుకు సాగించాల‌ని ఆమె ధృఢ సంక‌ల్పంతో ఉన్నారు. ఏదేమైనా మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందుల‌ను త‌గ్గించ‌డానికి ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం అభినంద‌నీయం ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌భుత్వాలు స‌హాయ స‌హ‌కారాలు అందించి ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టే వారిని పోత్స‌హిస్తే ఇంకా బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *