MLC Nomination

MLC Nomination: క‌చ్చితంగా చెబుతున్నాం…ఆ రెండూ స్థానాలూ మేం గెలుస్తాం: మంత్రి

Spread the love

MLC Nominationక‌రీంన‌గ‌ర్: స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానాల‌కు TRS అభ్య‌ర్థులు టీ భాను ప్ర‌సాద్ రావు, ఎల్ ర‌మ‌ణ మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. అంతకు ముందు క‌రీంన‌గ‌ర్‌లోని ప‌ద్మ‌నాయ‌క క‌ళ్యాణ మండ‌పంలో టిఆర్ఎస్ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌మావేశ‌మ‌య్యారు.

ఇద్ద‌రు అభ్య‌ర్థుల నామినేష‌న్ ఫారాలు (MLC Nomination)ఇక్క‌డే రెడీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో రెండు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానాల‌ను త‌మ పార్టీ గెలుచుకుంటుంద‌న్నారు. జిల్లా స్థానిక సంస్థ ల ప్ర‌జాప్రతినిధులు 1,326 ఓట్లు ఉండ‌గా ఇందులో 996 మంది టీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నార‌ని అన్నారు.

21 ఏళ్ల‌లో టిఆర్ఎస్ అనేక ఉద్య‌మాలు చేసి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామ‌ని పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ల్లో క‌లిసి క‌ట్టుగా ప‌నిచేసి కేసీఆర్ ఆశీర్వ‌దించి పంపిన భాను ప్ర‌సాద్‌రావు, ఎల్‌.ర‌మ‌ణ గెలుపుకు కృషి చేయాల‌ని మంత్రి కొప్పుల కోరారు. అనంత‌రం భాను ప్రసాద్‌, ర‌మ‌ణ‌ల‌తో క‌లిసి నామినేష‌న్ వేసేందుకు వెళ్లారు.

Tampering Allegations: మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌పై ట్యాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు?

Tampering Allegations హైద‌రాబాద్: తెలంగాణ లో మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌పై ట్యాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంప‌రింగ్ చేశార‌ని ఫిర్యాదు రావ‌డంతో పాటు వెబ్‌సైట్‌లో 2 అఫిడ‌ఫిట్స్ Read more

Agrigold Scam : అగ్రిగోల్డ్ కేసు హైకోర్టులో విచార‌ణ‌

Agrigold Scam : అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు ఎక్కువుగా ఆంధ్రాలో ఉన్నందున ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏపీ విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం బ‌దిలీ చేసే విష‌యాన్ని న్యాయ‌స్థానం Read more

Ambulance : ఏపీ అంబులెన్స్‌ల‌కు త‌ప్ప‌ని ఇబ్బందులు

Ambulance : క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్రాణాలు కాపాడుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి అంబులెన్స్‌లో బ‌య‌లు దేరిన బాధితుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. దీంతో క‌రోనా Read more

Land Grab Allegations : సీఎస్‌కు చేరిన ఈట‌ల ప్రాథ‌మిక నివేదిక‌

Land Grab Allegations : తెలంగాణ రాష్ట్రంలో 48 గంట‌ల్లో రాజ‌కీయం తీవ్రంగా వేడెక్కింది. అధికార ప‌క్షంలో ఉన్న మంత్రిపైన స్వ‌యంగా సీఎం కేసీఆర్ భూ క‌బ్జాల Read more

Leave a Comment

Your email address will not be published.