MLC Kavitha

MLC Kavitha: కొండ ఎక్కినా.. ఏ బండ మొక్కినా రాష్ట్రం కోస‌మే

Spread the love

MLC Kavithaజ‌గిత్యాల: కొండ‌గ‌ట్టు ఆంజనేయ స్వామిని ఎమ్మెల్సీ క‌విత ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ అంజ‌న్న ఆల‌య అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు ఆమె స్ప‌ష్టం చేవారు. దేవాల‌యాల అభివృద్ధికి టిఆర్ఎస్ రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేస్తోంద‌ని అన్నారు. క‌రోనా స‌మ‌యంలో అఖండ హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం ఘ‌నంగా నిర్వ‌హించామ‌ని తెలిపారు. త‌న‌ని ఏక‌గీవ్రంగా గెలిపించిన కామారెడ్డి, నిజామాబాద్ ప్ర‌జాప్రతినిధుల‌కు, సీఎం కేసీఆర్‌కు క‌విత ధ‌న్య‌వాదాలు (MLC Kavitha)తెలిపారు.

మ‌ళ్లీ మ‌ళ్లీ రావాల‌నిపించే అద్భుత ప్రాంతం కొండ‌గ‌ట్టు అని, రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం యాగం నిర్వ‌హించామ‌ని గుర్తు చేశారు. ఏ కొండ ఎక్కినా, ఏ బండ మొక్కినా రాష్ట్రం కోస‌మేన‌ని క‌విత అన్నారు. దేశంలో నెంబ‌ర్ వ‌న్‌గా ఉండాల‌ని యాగాలు నిర్వ‌హించామ‌న్నారు. కొండ‌గ‌ట్టులో చ‌క్క‌టి అద్భుత నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని, రామ‌కోటి రాసి స‌మ‌ర్పించే వారికి రామ‌కోటి స్థూపం నిర్మానం జ‌రుగుతుంద‌న్నారు. అనేక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి చేస్తున్నామ‌ని అన్నారు.

2022 సంవ‌త్స‌రంలో పండుగ శెలవులు ఇవే!(2022 Public Holidays Telangana)

రాబోయే ఏడాదికి గాను పండుగ‌లు, సెల‌వుల తేదీల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. 2022 సంవ‌త్స‌రంలో పండుగ‌లు, ఇత‌ర సెల‌వుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్ర‌బుత్వం విడుద‌ల చేసింది. వ‌చ్చే ఏడాది 28 సాధార‌ణ సెల‌వులు, 23 ఐచ్చిక సెల‌వుల‌ను గుర్తించి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి Somesh Kumar ఉత్త‌ర్వులు జారీ చేశారు. Negotiable Instruments Act 1881 ప్ర‌కారం 23 రోజులు సాధార‌ణ సెలవులుగా ప్ర‌క‌టించారు. ముఖ్య‌మైన సెల‌వులు జ‌న‌వ‌రి 1 నూత‌న సంవ‌త్స‌రం, 15 సంక్రాంతి, 26 గ‌ణ‌తంత్ర‌దినోత్స‌వం, మార్చి 1 మ‌హా శివ‌రాత్రి, 18 హోలీ, ఏప్రిల్ 2 ఉగాది, 10 శ్రీ‌రామ‌న‌విమి, 14 అంబేద్క‌ర్ జ‌యంతి, 15 గుడ్‌ఫ్రైడే, మే 3, 4 రంజాన్, ఆగ‌ష్టు 15 స్వాతంత్య్ర‌దినోత్స‌వం, సెప్టెంబ‌ర్ 25 బ‌తుక‌మ్మ ప్రారంభ‌రోజు, అక్టోబ‌ర్ 5 విజ‌య‌ద‌శ‌మి, 9 మిలాద్‌- ఉన్‌- న‌వి, 25న దీపావ‌ళి, డిసెంబ‌ర్ 25న క్రిస్‌మ‌స్‌గా పేర్కొన్నారు. కాగా వారాంత‌పు సెల‌వు దినం అయిన ఆదివారం నాడు ఆరు సెలవు దినాలు రావ‌డం గ‌మ‌నార్హం.

Congress party Foundation day:కాంగ్రెస్ పోరాడింది కాబ‌ట్టే దేశం ప్ర‌శాంతంగా ఉంది: మ‌ల్లుభ‌ట్టి

Congress party Foundation day ఖ‌మ్మం: కాంగ్రెస్ పార్టీ పోరాట ఫ‌లితమే దేశానికి స్వాంతంత్య్రం, భార‌త రాజ్యాంగం ల‌భించాయ‌ని తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత మ‌ల్లు భ‌ట్టి Read more

gandhi hospital: సర్కార్ ఆసుప‌త్రికి స‌లాం! గాంధీ ఆస్ప‌త్రి సేవ‌లు ఘ‌నం!

gandhi hospital హైద‌రాబాద్:పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఈ మాత్రం ఆరోగ్యంగా జీవిస్తున్నారంటే అది స‌ర్కారు ఆసుప‌త్రుల పుణ్య‌మే అని చెప్పుకోవాలి. రెండు సంవ‌త్స‌రాలుగా క‌రోనా మ‌హ‌మ్మారి Read more

saidabad rape case: దుండగుడిని కఠినంగా శిక్షించాలి:డివైఎఫ్ఐ

saidabad rape case రఘునాధపాలెం: హైదరాబాద్ లో 6 సంవ‌త్స‌రాల‌ చిన్నారి చైత్ర భాయ్ పై అత్యాచారం చేసి,హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించి, చిన్నారి కుటుంబానికి Read more

Teenmaar Mallanna Press Meet: తెలంగాణ‌లో యుద్ధం మిగిలే ఉందంటున్న తీన్మార్ మ‌ల్ల‌న్న

త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు!టిఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించుతాం!నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక‌లో పోటీ? Teenmaar Mallanna Press Meet: Nalgonda : నాకోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి Read more

Leave a Comment

Your email address will not be published.