MLC Ashok Babu Arrest గుంటూరు: ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబును గురువారం అర్ధరాత్రి సీఐడి పోలీసులు అరెస్టు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో విధులు నిర్వహించినప్పుడు బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు(MLC Ashok Babu Arrest) చేశారు.
ఇందుకై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషర్ ఇటీవల అశోక్ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా జనవరి 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ కేసులో అశోక్ బాబును గత అర్థరాత్రి అరెస్టు చేసినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు.


ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ను అరెస్టు చేయడంపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఇది రాజకీయ కుట్ర అని వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పార్టీ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం అశోక్ బాబును కోర్టులో హాజరు పర్చాల్సి ఉందని తెలుస్తోంది. మొత్తంగా అశోక్ బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్