MLA Seethakka | నీళ్లు, నిధులు నియామకాలు అనే వాదంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవని 1200 మంది విద్యార్థుల బలిదానాలు చూసి తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు MLA Seethakka అన్నారు. ఆదివారం తాడ్వాయి మండలంలోని మేడారంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవి చందర్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ములుగు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణలో కుటుంబ సాలన కొనసాగుతుందని అన్నారు. విద్యార్థులు, యువకులు సైతం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం పోరాటాలు చేస్తే వచ్చిన తెలంగాణలో ఏ ఒక్కరికీ KCR పాలనలో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఇంటిలో ఉద్యోగం అన్నారని, నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తానన్నారని, ఇవ్వాళే ఇలా అనేక మాయమాటలు చెప్పిన సీఎం తన కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారని సీతక్క హెద్దేవా చేశారు. కేంద్రంలో బిజీపీ, రాష్ట్రంలో తెలంగాణ రెండింటినీ బొంద పెట్టాలని యువత ఏకమై భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో వచ్చే వరకూ పోరాటం చేయాలని MLA Seethakka పిలుపు నిచ్చారు.