MLA Seethakka | తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ పై ఆంధ్రా చిన్న జీయర్ స్వామి అహంకార పూరితంగా మాట్లాడటాన్ని యావత్తు తెలంగాణ ప్రజానీకం, ప్రభుత్వం ఖండించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం ఆమె ఓ వీడియోలో చిన్న జీయర్ స్వామి సమక్క, సారలమ్మపై చేసిన వ్యాఖ్యలకు సీరియస్గా స్పందించారు. ప్రకృతి వన దేవతలైన మా సమక్క సారలమ్మ గురించి రియల్టర్ చిన్నజీయర్ స్వామి మాటలు అహంకారపూరితంగా ఉన్నాయని(MLA Seethakka) విమర్శించారు.
మా తల్లులది వ్యాపారమా..! మీరు చేసేది వ్యాపారమా..? అంటూ ప్రశ్నించారు. మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు. కానీ మీరు పెట్టిన సమతా మూర్తి 120 కిలోల బంగారు విగ్రహం చూడటానికి మాత్రం మా తెలంగాణ ప్రజల కు రూ.150 టికెట్ ధర పెట్టారు. మీదు వ్యాపారం కాకపోతే భక్తా…అంటూ ప్రశ్నించారు. మా సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఎలాంటి వ్యాపారం జరగదని, కోర్కెలు తీర్చే తల్లి అని అన్నారు.
ఆంధ్ర చిన్నజీయర్ స్వామి లక్ష రూపాయలు తీసుకోకుండా ఏదైనా పేదవారి ఇంటికి వెళ్లారా? అని ప్రశ్నించారు. దేవుని భక్తి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మా తెలంగాణ వన దేవతలపై అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!