Tiruvuru : వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధివైపు దూసుకుపోతుందని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. బుధవారం ఏ- కొండూరు మండలానికి చెందిన 55 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.15 లక్షల 50 వేల నగదు గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ..సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 99 శాతం మున్సిపాలిటీలు, 80 శాతం పైగా గ్రామ పంచాయతీలను వైసీపీ గెలుచుకుని సీఎం జగన్ పట్ల ప్రజలకున్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేశారన్నారు. దేశంలో కరోనా వైరస్ రెండో దశ ఉధృతంగా విస్తరిస్తోందని, కాబట్టి ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అమలవుతోందని తెలిపారు. ప్రజలు వ్యాక్సిన్ పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


ప్రజలు కరోనా వైరస్ పట్ల అత్యంత జాగ్రత్త కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వైరస్ నుండి మనకు మనం రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విస్సన్నపేటలో పర్యటించిన ఎమ్మెల్యే
విస్సన్నపేట మండలానికి చెందిన 65 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.22 లక్షల 50 వేల నగదు గల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోప్రభుత్వ అధికారులు, వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started