alla ramakrishna reddy : తండ్రి మాట కొడుకు ధిక్కరించినట్టేనా? : ఎమ్మెల్యే ఆళ్ల
alla ramakrishna reddy : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టం చెప్పారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. కానీ మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల తెలుగుదేశం పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెబితే, దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు.
లోకేష్ ఆదేశాలు ఇచ్చారా?
మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న లోకేష్ ఆదేశాలు లేకుండా ఇక్కడ నాయకులు ఎలా పోటీలో ఉన్నామని చెబుతారని ఎమ్మెల్యే ఆళ్ల ప్రశ్నించారు. నిర్ణయం తీసుకునే ముందు తండ్రి, కొడుకులు ఇద్దరూ మాట్లాడుకోలేదా? అని హెద్దేవా చేశారు. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని లోకేష్ వ్యతిరేకిస్తున్నట్టు లోకేష్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అందరికీ ఒక న్యాయం. లోకేష్ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. దుగ్గిరాల మండలంలో తెలుగుదేశం నాయకులు పార్టీ కార్యకర్తలు, అభిమానులు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. అలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రబాబు లోకేష్ కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు. తీసుకుంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని లోకేష్ ఎలా వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.


చంద్రబాబుకు – లోకేష్‌కు విబేధాలు ఉన్నాయేమో?
ఈ రోజు దుగ్గిరాల మండంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ చేసే విధానంతో చంద్రబాబు లోకేష్ మధ్య విబేధాలు ఉన్నాయని అర్థమవుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. దుగ్గిరాల మండలంలోని పోటీ చేస్తానంటే భయపడే వాళ్లు ఎవరూ లేరని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 18 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ పార్టీ మద్ధతుదారులు 14 గెలుచుకుంటే టిడిపి కేవలం 2 మాత్రమే గెలుచుకుందని విమర్శించారు. వ్యాపారం అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు గుమ్మరించి బెదిరించి దుగ్గిరాలలో గెలుపొందాలని లోకేష్ భావిస్తున్నారన్నారు. లోకేష్ ఎన్ని ప్రయత్నాలు చేసినా 18 ఎంపీటీసీ స్థానాలకు 17 స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దుగ్గిరాల జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ పార్టీ కైవసం చేసుకోబోతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started