ML Jaisimha

ML Jaisimha: క్రికెట్ చరిత్ర‌లోనే అత‌నో సింహం!

Share link

ML Jaisimha | మ‌న దేశంలో క్రికెట్ అంత‌గా ప్రాచుర్యం పొంద‌ని రోజుల్లోనే స్టైలిష్ క్రికెట‌ర్‌గా తెర‌పైకి వ‌చ్చాడ‌త‌డు. 15 ఏళ్ల వ‌య‌సులోనే హైద‌రాబాద్ జ‌ట్టు త‌ర‌పున ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌ట్టుపై ఆడిన తొలి మ్యాచ్‌లో 90 ప‌రుగులు సాధించి, అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. Cricket ప్ర‌పంచంలో క‌ల్టివేటెడ్ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఎం.ఎల్ జ‌య‌సింహ సికింద్రాబాద్‌లో 1939 మార్చి 3న జ‌న్మించాడు. అత‌డి చ‌దువు ఇక్క‌డే సాగాయి. Hyderabad జ‌ట్టు త‌ర‌పునే ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ ఇలా అన్ని అంశాల్లోనూ రాణించి ఆల్‌రౌండ‌ర్‌గా స‌త్తా చాటుకున్నాడు.

ML Jaisimha రికార్డులు

క్రికెట్‌లో ఇప్ప‌టి రికార్డుల‌తో పోల్చి చూస్తే జ‌య‌సింహ రికార్డులు పెద్ద‌గా అనిపించ‌క‌పోవ‌చ్చు. అయితే, అప్ప‌టి ప‌రిస్థితుల్లో అత‌డు సాధించిన రికార్డులు త‌క్కువేమీ కాదు. అప్ప‌ట్లో ఆధునిక క్రికెట్ కోచింగ్ సౌక‌ర్యాలు అంతంత మాత్ర‌మే. ఇప్ప‌టిలా అప్ప‌ట్లో క్రికెట‌ర్ల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆదాయ‌వ‌కాశాలు ఉండేవి కాదు. అలాంటి ప‌రిస్థితుల్లో రాణించ‌డం అంత తేలిక కాదు. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లోనే తొంభై ప‌రుగుల‌తో శుభారంభం చేసిన ML Jaisimha, ఆ త‌ర్వాత మ‌ద్రాస్‌, మైసూరు జ‌ట్ల‌తో ఆడిన మ్యాచ్‌ల‌లో సెంచ‌రీలు కొట్టాడు. అదే సీజ‌న్‌లో Ranji మ్యాచ్‌ల‌లో బౌల‌ర్‌గా కూడా రాణించి, 20 వికెట్లు తీసి, 1959లో ఇంగ్లండ్‌కు వెళ్లిన భార‌త క్రికెట్ జ‌ట్టులో చోటు సంపాదించుకున్నాడు. లార్డ్స్ మైదానంలో తొలి అంత‌ర్జాతీయ Test ఆడాడు. తొలి టెస్ట్‌లో విఫ‌ల‌మైనా, ఆ త‌ర్వాతి రెండు టెస్ట్ మ్యాచ్‌ల‌లోనూ రాణించి, క్రికెట్ అభిమానుల దృష్టిని ఆక‌ర్షించాడు.

ఆ ఘ‌న‌త సాధించిన తొలి Cricketer

ఒక టెస్ట్ మ్యాచ్‌లో వ‌రుస‌గా ఐదురోజులూ బ్యాటింగ్ చేసిన తొలి క్రికెట‌ర్‌గా ML Jaisimha ఘ‌న‌త సాధించాడు. ప్ర‌పంచంలో ఈ ఘ‌న‌త సాధించిన తొలి క్రికెట‌ర్ జ‌య‌సింహ అయితే, ఈ ఘ‌న‌త సాధించిన రెండో భార‌త క్రికెట‌ర్ Ravi shastri ఆస్ట్రేలియా జ‌ట్టుపై 1960 లో క‌ల‌క‌త్తాలో ఆడిన మ్యాచ్‌లో జ‌య‌సింహ తొలిరోజు ఆట ముగిసే స‌మ‌యంలో బ్యాటింగ్ ప్రారంభించాడు. రెండో రోజు ఇర‌వై ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా, ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. సెకండ్ Inningsలో మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మ‌ళ్లీ బ్యాటింగ్ అవ‌కాశం వ‌చ్చింది. నాలుగో రోజుంతా బ్యాటింగ్ చేసి 59 ప‌రుగులు చేశాడు. చివ‌రిగా ఐదో రోజు 74 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు.

రెండేళ్ల త‌ర్వాత పాకిస్తాన్ జ‌ట్టుప కాన్సూర్‌లో ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో ఒక సింగిల్ ర‌న్ కోసం ఆత్ర‌ ప‌డి 99 ప‌రుగుల వ‌ద్ద 99 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు. తొలినాళ్ల‌లో మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మ‌న్‌గా ఉన్న జ‌య‌సింహ క్ర‌మంగా ఓపెన‌ర్‌గా ఎదిగాడు. ఓపెన‌ర్‌గానే ఇంగ్లాండ్‌, శ్రీ‌లంక జ‌ట్ల‌పై సెంచ‌రీలు చేశాడు.

జూనియ‌ర్ల‌కు మార్గ‌ద‌ర్శి

వెస్ట్ ఇండీస్‌పై 1970-71 లో చివ‌రి టెస్ట్ సిరీస్ ఆడిన ML Jaisimha, జూనియ‌ర్ల‌కు మార్గ‌ద‌ర్శిగా ఉండేవాడు. ఆట‌లో జ‌య‌సింహ స‌ల‌హాలు విలువైన‌వ‌ని మాజీ కెప్టెన్ అజిత్ వాడేక‌ర్ కొనియా డ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. మ‌రో మాజీ కెప్టెన్ మ‌న్సూర్ అలీఖాన్ ప‌టౌడీ సైతం జ‌య‌సింహ నాయ‌క‌త్వంలో ప‌లు మ్యాచ్‌లు ఆడాడు. లిటిల్ మాస్ట‌ర్ Sunil గ‌వాస్క‌ర్ Batting శైలిలో జ‌య‌సింహానే గురువుగా ప‌రిగ‌ణించేవాడు. క్రికెట‌ర్‌గా విర‌మించుకున్నాక కొన్నాళ్లు సెలెక్ట‌ర్‌గా, శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టుకు మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. కొన్నాళ్లు కామెంటేట‌ర్‌గానూ ఆట‌తో బాంధ‌వ్యాన్ని కొన‌సాగించిన జ‌య‌సింహ‌, 1999 మార్చి 3న లంగ్ కేన్స‌ర్‌తో సైనిక్‌పురిలోని త‌న నివాసంలో క‌న్నుమూశాడు.

Neeraj Chopra Win Gold At Olympics Javelin Throw

Neeraj Chopra: Haryana native Neeraj Chopra Participated in the Javelin throw competition in the 2020 Tokyo Olympics for the very Read more

tokyo olympics 2021: టోక్యో ఒలింపిక్స్ లో తృటిలో భార‌త్ చేజార్చుకున్న ప‌త‌కాలేమిటో తెలుసా!

tokyo olympics 2021: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ‌మై ఇప్ప‌టి వ‌ర‌కు 13 రోజులు పూర్త‌య్యాయి. ఈ ఆట‌ల్లో భార‌త్ క్రీడాకారులు అద్భుత‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ ఒలింపిక్ Read more

Cricket Betting Gang: పోలీసుల‌కు చిక్కిన క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్‌

Cricket Betting Gang | తిరుప‌తిలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా న‌డుస్తోంది. స‌మాచారం అందుకున్న గూడూరు రూర‌ల్ పోలీసులు సాంకేతిక‌త ఆధారంగా చెన్నూరు కేంద్రంగా బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న Read more

Rod Marsh dies: ఆస్ట్రేలియా క్రికెట్ లెజండ‌రీ రాడ్ మార్ష్ మృతి

Rod Marsh dies | 1970 నుండి 1984 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆస్ట్రేలియా త‌ర‌పున 96 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రాడ్ మార్ష్ (Rod Marsh dies)ఆడిలైడ్ Read more

Leave a Comment

Your email address will not be published.