TDP leader Pattabhi : టిడిపి నేత పట్టాభిపై కారుదాడి, గాయాలు
Vijayawada: ఒక ప్రక్క టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిన గంటలోనే విజయవాడలో టిడిపి జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభి రామ్(Pattabhi Ram)పై దాడి కలకలం రేపింది. మంగళవారం ఇంటి నుంచి టిడిపి కార్యాలయానికి బయల్దేరుతుండగా బయట గేట్ దగ్గరే గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా వచ్చి కారుపై దాడికి దిగారు. ఈ దాడిలో రాడ్లతో కొట్టడంతో కారు అద్దాలు ధ్వంసం కాగా, తనకు గాయాలు అయ్యాయని పట్టాభి రామ్ మీడియాకు తెలియజేశారు. ఆయన సెల్‌ఫోన్ కూడా ఈ దాడిలో ధ్వంసమైంది. సుమారు 10 మది దుండగలు ఈ దాడిలో పాల్గొన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిపై పట్టాభి రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాలు కావడంతో వైద్యం కోసం ఆస్పత్రిలో చేరారు.


రెండు నెలల క్రితం ఇదే తరహాలో!
రెండు నెలల క్రితం కూడా పట్టాభిరామ్(Pattabhi Ram) వాహనంపై దుండగులు దాడి చేశారు. ఇదే తరహాలో ఇంటి దగ్గరే దాడి చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 10, 15 మంది చుట్టుముట్టి ఇనుపరాడ్లతో, బండరాళ్లతో కారు ధ్వంసం చేయడం, పట్టాభి రామ్ ను గాయపర్చడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో తనపై దాడి చేయడం వైయస్సార్సీపీ గుండాల పనే అని ఆయన అన్నారు. గతంలో తనపై కారు ధ్వంసం చేసినవాళ్లపై చర్యలు తీసుకోలేదని పోలీసులు ఉదాసీనతతో గూండాల దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయని అన్నారు. దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పట్టాభిరామ్‌ను పరామర్శించిన చంద్రబాబునాయుడు
దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రికి వెళ్లి పట్టాభి రామ్‌ను పరామర్శించారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పట్టాభికి పూర్తి భద్రత కల్పించాలని చంద్రబాబు తెలిపారు.
ఇది చదవండి:అచ్చెన్నాయుడు అరెస్టు | నిమ్మాడలో ఉద్రిక్తత
ఇది చదవండి:సర్వీస్ పర్సన్స్ గోడు వినాలి: ఎఐటియుసి
ఇది చదవండి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంధువు కిడ్నాప్,హత్య
ఇది చదవండి:పంచాయతీ తీర్పులో మాజీ సర్పంచ్‌పై కత్తితో
ఇది చదవండి:మదనపల్లె కేసు వాదనకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది
ఇది చదవండి:భారత దేశంలో కార్మిక ఉద్యమ చరిత్ర పూర్వ పరిస్థితి!
ఇది చదవండి: జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్