Minister Vellampalli Srinivas Comments On Ashok Gajapathi Raju|మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై ఆగ్రహం! Vijayanagaram: విజయనగరం జిల్లాలో రామతీర్థంలో శ్రీ కోదండరాముల వారి విగ్రహం తల గుర్తు తెలియని దుండగులు తొలగించడంపై తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహ జ్వాలలు పెరుగుతున్నాయి. ఈ ఘటన చిలికి చిలికి రాజకీయా వాదోపవాదాలు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే వరకు వెళ్లాయి. శనివారం వైసీపీ, టిడిపి, బిజెపి కార్యకర్తలు, హిందూ ధర్మ రక్షణ మండలి వారు రామతీర్థం వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తుండగా, ఈ దాడులు టిడిపినే చేసిందని వైసీపీ పార్టీ వారు ఆరోపణలు చేసుకోవడం శనివారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది.
అయితే దేవదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు, అశోక్ గజపతి రాజు అభిమానులు మంత్రి వెల్లం పల్లిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు సైతం తుళ్లిపడి గజపతి రాజును మాట అనలేరని, అలాంటిది మంత్రి వెల్లంపల్లికి ఎంత నోటి దురుసోనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతున్నవీడియో
ఇది చదవండి: ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు