Aarogyasri

Aarogyasri ప‌రిధిలో 50 శాతం బెడ్లు అందుబాటులో…Minister Vellampalli Srinivasa Rao

Spread the love

Aarogyasri ప‌రిధిలో 50 శాతం బెడ్లు అందుబాటులో…Minister Vellampalli Srinivasa Rao

Aarogyasri : జిల్లాలోని అన్ని ఆసుప‌త్రుల్లో 50 శాతం బెడ్లు కోవిడ్ బాధితుల‌కు అందుబాటులో తీసుకువ‌చ్చి, వైద్య సేవ‌లు అందేలా చూడాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేవ‌దాయ శాఖామంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు స్ప‌ష్టం చేశారు. స్థానిక క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌ యంలో జిల్లా స్థాయి కోవిడ్ కేసుల‌పై మంగ‌ళ‌వారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వెల్లం ప‌ల్లి శ్రీ‌నివాస‌రావు మాట్లాడారు. జిల్లాలోని ఆసుప‌త్రుల్లో 50 శాతం బెడ్లు ఆరోగ్య‌శ్రీ సేవ‌లు అందించేందుకు త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని, ఇందుకు జిల్లా యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

పేషెంట్ల వివ‌రాలు అందించాలి!

సెకండ్ వేవ్ కోవిడ్ కేసులు వ‌ల్ల ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయ‌ని, ప్ర‌జ‌లను మ‌రింత అప్ర‌మ‌త్తం చేయాల‌ని సూచించారు. కోవిడ్ కేసుల‌ను హాస్పిట‌ల్ ల‌లో చేర్పించుకోవ‌డంలోనూ, ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంలోనూ అత్యధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని అన్నారు. ఇందుకు జిల్లా స్థాయి మోన‌ట‌రింగ్ క‌మిటీ ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ చేప‌ట్టాల‌న్నారు. వైద్య చికిత్స కోసం వ‌చ్చే వారికి ఆరోగ్య‌శ్రీ ద్వ‌రా సేవ‌లు పూర్తి స్థాయిలో అందించ‌డంతో పాటు కోవిడ్ కేసులతో పాటు ఇత‌ర సాధార‌ణ కేసులకు చికిత్స అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ఏఏ ఆసుప‌త్రుల్లో ఎంత మంది పేషెంట్ల‌కు చికిత్స చేశారు. కోవిడ్ కు సంబంధించి ఆరోగ్య‌శ్రీ ద్వారా చికిత్స‌లు అందించారా? లేదా? పేషెంట్ పేరుతో స‌హా వివ‌రాలు అందించాల‌ని మంత్రి ఆదేశించారు. జిల్లాలో మ‌రిన్ని బెడ్ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని, త‌క్కువ ప్ర‌మాద స్థాయి ఉండే రోగుల‌కు హోం ఐసోలేష‌న్ ప‌ట్ల అవ‌గాహ‌న పెంచాల‌ని మంత్రి తెలిపారు. ఆక్సిజ‌న్‌, ఇత‌ర అత్య‌వ‌స‌ర మందుల‌ను త‌గినంత‌గా సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు.

అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్న ఆసుప‌త్రులు!

బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ..ప్రైవేటు ఆసుప‌త్రుల్లో కోవిడ్ పేషెంట్లు నుండి అత్య‌ధికంగా ఫీజులు వ‌సూలు చేస్తున్నార‌ని, దీనికి సంబంధించి ప్ర‌భుత్వం నిర్ధేశించిన రేట్ల వివ‌రాల‌ను ఆయా ఆసుప‌త్రుల్లో ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. ఐవి ప్యాలెస్ వంటి భ‌వ‌నాల‌ను కోవిడ్ కేర్ సెంట‌ర్లుగా మార్చి ప్ర‌జ‌ల‌కు మేలైన వైద్య స‌హాయం అందించాల‌న్నారు. ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డంతో పాటు కోవిడ్ ప‌ట్ల అల‌క్ష్యం వ‌ద్ద‌న్న వివ‌రాల‌తో చైత‌న్యం తీసుకురావాల‌న్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న మంత్రి వెల్లంప‌ల్లి, కృష్ణా జిల్లా అధికారులు

యంత్రాంగం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది!

జిల్లా కోవిడ్ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌, ముఖ్య కార్య‌ద‌ర్శి కె.సునీత మాట్లాడుతూ.. మ‌న‌ముందు కోవిడ్ నియంత్ర‌ణ కు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల్సిన ల‌క్ష్యం ఉంద‌న్నారు. ఇందుకు అధికారులు ప్ర‌త్యేకంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందిం చుకుని ల‌క్ష్య సాధ‌న‌లో విజ‌యం సాధించాల్సి ఉంద‌న్నారు. ప్రైవేటు ఆసుప‌త్రులు అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్నా య‌న్న ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌న్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా సేవ‌లు అందిస్తూ కూడా వ్య‌క్తిగ‌తంగా రోగుల నుండి కూడా ఫీజులు వ‌సూలు చేస్తున్న సంఘ‌ట‌న‌లు కూడా చోటు చేసుకుంటున్నాయ‌న్నారు. కృష్ణా జిల్లా యంత్రాంగం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తూ అటువంటివాటిపై కేసులు న‌మోదు చేయ‌డం హ‌ర్షణీయ‌మ‌న్నారు. కోవిడ్ తీవ్ర‌త దృష్ణ్యా ఆన్‌లైన్ ద్వారా స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని ఆమె తెలిపారు. గ‌తంలో కోవిడ్ ఆసుప‌త్రులుగా సేవ‌లు అందించిన ఆసుప‌త్రుల‌కు ఫైర్ అనుమ‌తుల‌కు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌న్నారు.

నిబంధ‌న‌లు పాటించ‌ని వారికి జ‌రిమానా!

కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ..ఖ‌చ్చితత్వంతోనూ, సేవా దృక్ఫ‌థంతోనూ టీమ్ కృష్ణా ప‌నిచేస్తున్న‌ద‌ని హామీ ఇచ్చారు. కోవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కోవ‌డ్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు మాస్క్ లు ధ‌రించ‌ని వారి నుంచి అప‌రాధ రుసుంను వ‌సూలు చేస్తున్నామ‌న్నారు. మాల్స్ లో రూ.1000, సినిమా థియోట‌ర్లు, షాపులు మ‌రియు ఎస్టాబ్లిష్ మెంట్స్ వ‌ద్ద రూ.500లు, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో రూ.100 లు మాస్క్ ధ‌రించ‌ని వారి నుండి, మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించ‌ని వారి నుండి అప‌రాధ రుసుం వ‌సూలు చేస్తున్నామ‌న్నారు. జిల్లా కోవిడ్ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ప్ర‌జాప్ర‌తినిధులు సూచించిన సూచ‌న‌ల మేర‌కు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించే దిశ‌లో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. 104 నెంబ‌ర్‌కు ఫోన్ చేస్తే కోవిడ్‌కు సంబంధించిన అన్ని సేవ‌ల‌ను, సూచన‌ల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. త్వ‌ర‌లోనే 3వ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వ‌స్తుంద‌ని, జిల్లాలో నిర్ధేశించుకున్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ లో 94 శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి చేశామ‌ని క‌లెక్ట‌ర్ తెల‌పారు.

ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా.కె.మాధ‌విల‌త‌, జెసి (అభివృద్ధి ) య‌ల్‌.శివ‌శంక‌ర్‌, వియంసి క‌మిష‌న‌ర్ వి.ప్ర‌స‌న్న వెంక‌టేష్‌, డిసిపి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాజు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.యం. సుహా సిని, డా.శివ‌ప్ర‌సాద్‌, డా.జ్యోతిర్మ‌ణి, డా.జి.గీతాబాయి, డా.నవీన్‌, డా.బాల‌సుబ్ర‌మ‌ణ్యం,పిన్న‌మ‌నేని సిద్ధార్థ కాలేజీ ప్ర‌తినిధులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Third wave of Corona : థ‌ర్డ్‌వేవ్ ముంచుకొస్తుందా? సెకండ్‌వేవ్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మా?

Third wave of Corona : భార‌త్‌లో క‌రోనా మ‌హమ్మారి విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే సెకండ్ వేవ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు థ‌ర్డ్‌వేవ్ భ‌యం ప‌ట్టుకోంది. సెకండ్‌వేవ్ తీవ్ర‌త Read more

Covid Third Wave సంగ‌తేంటంటున్న న్యాయ‌స్థానం!

Covid Third Wave : దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ పై సుప్రీం కోర్టు కేంద్రానికి కొన్ని ప్ర‌శ్న‌ల‌ను సంధించింది. సెకండ్ వేవ్ ముప్పు పోక ముందే Read more

Bengaluru Covid cases : స్మ‌శానాల‌తో ఫుల్ అయిన బెంగళూరు

Bengaluru Covid cases : స్మ‌శానాల‌తో ఫుల్ అయిన బెంగళూరు Bengaluru Covid cases : బెంగళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. కోవిడ్ సోకి Read more

Night Curfew in Telangana : తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ?

Night Curfew in Telangana : తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ? Night Curfew : తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేప‌థ్యంలో బీఆర్కే భ‌వ‌న్ Read more

Leave a Comment

Your email address will not be published.