Minister Roja: ఏపీ టూరిజం శాఖా మంత్రి రోజా సెల్వమణి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రతిపక్షాలపై దూకుడు పెంచారు. తనని విమర్శించే వారిపైన, ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిపైనా ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా TDP – JANASENA పొత్తు పైన విమర్శలు చేశారు. ఈ మధ్య కాలంలో Minister Roja రాజకీయంగా ఏమి మాట్లాడారో ఇక్కడ పరిశీలించవచ్చు.
బాలయ్య Unstoppable షోకు వెళ్లను: Minister Roja
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న Unstoppable షోకు వెళ్లే ఆలోచన లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు. గతంలో రెండుసార్లు పిలిచినప్పుడు వెళ్లడం కుదరలేదని తెలిపారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ల తర్వాత షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాగా త్వరలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
బాలయ్య ఆరాటం అందుకేనేమో!
ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని బాలకృష్ణ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని మంత్రి రోజా మండిపడ్డారు. బావ కళ్లలో ఆనందం చూడాలని బాలయ్య అనుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. Chandrababu భ్రమ నుంచి బయటకు రావాలని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
మెగస్టార్ గురించి నో కామెంట్!
పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ అని Minister Roja ఎద్దేశా చేశారు. నాగబాబు మనిషి పెరిగాడే కానీ బుర్ర పెరగలేదని ఆమె అన్నారు. రాజకీయాల్లో లేని Megastar చిరంజీవిపై తాను మాట్లాడబోనని తెలిపారు. హీరోగా చిరంజీవిని ఎప్పటికీ అభిమానిస్తానని, మెగా ఫ్యామిలీని ఎప్పుడూ పర్సనల్‌గా విమర్శించలేదని అన్నారు. సంక్రాంతి పండుగకు చిరంజీవి Valtheru veerayya కు, బాలయ్య వీరసింహారెడ్డి కి కలెక్షన్లు వస్తే, పవన్‌కు మాత్రం చంద్రబాబు నుంచి కలెక్షన్లు అందాయని సెటైర్లు వేశారు.
BABU కు మైండ్ దొబ్బింది!
చంద్రబాబు జీవో నెంబర్-1 కాపీలను భోగి మంటల్లో తగలబెట్టడంపై మంత్రి రోజా మండిపడ్డారు. ప్రజా స్వామ్య విలువలను చంద్రబాబు మంటల్లో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవోను ప్రజల కోసమే తెచ్చామని, చంద్రబాబుకు మైండ్ దొబ్బి మాట్లాడు తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో సక్సెస్ అయిందని చెప్పారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు.
కాస్త చెక్ చేసుకోవాలి కదా పవన్!
శ్రీకాకుళం జనాభా, వలసలపై జనసేన చీఫ్ పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా సెటైర్ వేశారు. శ్రీకాకుళం జనాభా కోటి మందా? వలస వెళ్లింది 45 లక్షల మందా? ఈ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా వెళ్లిపోయారు. 45 లక్షల జనాభానే లేదు. 45 లక్షల మంది వలసలా? టిడిపి స్క్రిప్ట్ ఇస్తే మాత్రం కాస్త చెక్ చేసుకోవాలని తెలియదా దత్తపుత్రా? అని Tweet చేశారు. #PackagestarPk అంటూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేశారు.
నీతో తిట్టించుకోవాలా?
పవన్ కళ్యాణ్ తనపై చేసిన కామెంట్లకు Minister Roja స్పందించి కౌంటర్ ఇచ్చారు. రెండు సార్లు గెలిచిన నేను, రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా? తూ.. ప్రజల కోసం తప్పట్లేదు అని ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్ భేటీపై విమర్శలు చేశారు. Visakha లో జనసేన కార్యకర్తలు మంత్రుల మీద దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్‌ను పరామర్శిస్తారు. చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తారు. వీళ్ల దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా? అని ట్వీట్ చేశారు.
సింహం సింగిల్ గానే వస్తుంది!
చంద్రబాబు, పవన్‌లను కలవమనే చెబుతున్నానని, తాను ఒంటరిగానే పోటీ చేస్తానంటూ సీఎం జగన్ గతంలో చెప్పిన వీడియోను మంత్రి Roja ట్వీట్ చేశారు. సింగ్ల్గా నడవడానికి సింహం ఎప్పుడూ భయపడదని పేర్కొన్నారు. బాబు, పవన్‌లు కలిసే ఉన్నారు. ఇప్పుడు విడిపోయినట్టు నటించి ప్రజలను మోసం చేస్తున్నారు. ముసుగు తీసేసి వారు రావాలి. నాకు దేవుడు, ప్రజల మీద నమ్మకం ఉంది.ఒంటరిగానే పోటీ చేస్తా..అని జగన్ ఆ వీడియోలో పేర్కొన్నారు.