minister puvvadaఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఒక అడిషనల్ కలెక్టర్ కాన్పు అయితే చూడటానికి రావడం ఆనందంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది కదా కేసీఆర్ పాలన అంటే..! ఇది కదా మనం సాధించుకున్న తెలంగాణ అంటే’..అంటూ కితాబు (minister puvvada) ఇచ్చారు.
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కాన్పు అయిన అడిషనల్ కలెక్టర్ స్నేహలత ను ఆదివారం మాతా శిశు కేంద్రంలో పరామర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, ప్రజలలో ప్రభుత్వ వైద్య సేవలపై మరింత నమ్మకం పెరిగేందుకు తన తొలికాన్పును జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేయించుకున్న స్నేహలతను సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభినందించారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!